ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ధేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో అప్పటికే క్రియేటర్‌లు షేర్ చేసిన స్టోరీస్‌లోని పోస్ట్‌లు కనుమరుగు కానున్నాయి.
2017లో యూట్యూబ్ 10వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్న యూజర్లకు స్టోరీస్ అనే ఫీచర్‌ను అందించడం ప్రారంభించింది. ఆ ఫీచర్ సాయంతో యూట్యూబ్ క్రియేటర్లు వారి కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మరింత సులువగా ఉండేది. కానీ యూట్యూబ్ ఊహించిన స‍్థాయిలో క్రియేటర్లు స్టోరీస్‌ని వినియోగించేందుకు మక్కువ చూపలేదు. ముఖ్యంగా, వినియోగంలో పరిమితి ఉండడంతో పట్టించుకోలేదు. అందుకే ఈ యూట్యూబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్ ఉన్నాయిగా
యూట్యూబ్ నిర్వాహకులు అప్‌లోడ్ చేస‍్తున్న కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు స్టోరీస్‌కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్‌లు వినియోగిస్తున్నారు. యూజర్లను కంటెంట్‌తో ఎంగేజ్ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్లలో టెక్ట్స్‌తో పాటు, పోల్‌లు, క్విజ్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో స్టోరీస్ ఫీచర్‌ను పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment