భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేశాయి. దీంతో యూట్యూబ్ ‘యూట్యూబ్ షార్ట్స్’ పేరుతో షార్ట్ వీడియో విభాగాన్ని ప్రారంభించింది. అయితే వ్యూస్, యూజర్ల విషయంలో షార్ట్స్‌కు ఊహించని స్పందన వచ్చింది. యూట్యూబ్ యాజమాన్యం సైతం సంతోషించింది. కానీ ఆ సంతోషం అంతలోనే అవిరైనట్లు తెలుస్తోంది.
ఆందోళనలో యూట్యూబ్ సిబ్బంది
షార్ట్స్‌ను ప్రారంభించడంలో యూట్యూబ్ లక్ష్యం.. వ్యాపారాన్ని పెంచడం, టిక్ టాక్, మెటా వంటి ప్రత్యర్థులతో నిలబడటం. అయితే, ఈ షార్ట్స్ ఫీచర్ లాంగ్ వీడియోలకు వచ్చే ఆదాయానికి గండిపెడుతుందని యూట్యూబ్ సిబ్బంది భావిస్తున్నారు. ఇటీవలి యూట్యూబ్ స్ట్రాటజీ మీటింగ్స్ లో కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే లాంగ్ ఫామ్ వీడియోలు ఫార్మాట్ గా 'అంతరించిపోతున్నాయి' అనే ప్రమాదం గురించి చర్చించినట్లు నివేదిక తెలిపింది.
సందిగ్ధంలో యూట్యూబ్
షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో యూట్యూబ్ సందిగ్ధంలో పడింది. షార్ట్ ఫామ్ వీడియోలు ప్రేక్షకులలో మరింత ప్రాచుర్యం పొందాయి .త్వరగా క్రియేట్ చేయడం, వీక్షించడం సులభం. అందుకే టిక్ టాక్ , ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంత సక్సెస్ కావడంతో పాటు యూట్యూబ్ కూడా షార్ట్స్‌ను పరిచయం చేసింది. ఏదేమైనా, యూట్యూబ్ ప్రకటనల నుండి ఆదాయాన్ని గడిస్తుంది. షార్ట్ ఫామ్ వీడియోలు ఎక్కువ ప్రకటనలను అనుమతించవు. అందువల్ల యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియోల ద్వారా సంపాదించినంత లాభాన్ని షార్ట్స్ నుంచి పొందలేకపోతోంది.
ఆదాయం కోసం
ఇదిలా ఉంటే షార్ట్స్ నుంచి మరింత యాడ్ ఆదాయాన్ని ఎలా ఆర్జించాలనే దానిపై యూట్యూబ్ ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే ఈలోగా కంటెంట్ క్రియేటర్లు తక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేస్తుండటం యూట్యూబ్ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. గూగుల్ తన యూట్యూబ్ ఆడియన్స్ యూజర్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆదాయం గడించే మార్గాన్ని గుర్తించాలని యూట్యూబ్ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment