ఓటీటీ లవర్స్‌కి అమెజాన్ ప్రైమ్ భారీ షాకిచ్చింది. త్వరలో ‘హైక్వాలిటీ’ పేరుతో యూజర్ల నుంచి డబ్బుల్ని వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం అమెజాన్ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.
కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు సగటు సినీ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లి ఎందుకు సినిమా చూడడం లేదనేదానికి అన్నే కారణాలు ఉన్నాయి. అయితే సినిమా, థియేటర్లు అనే అంశాలు కాసేపు అటుంచితే.. ప్రస్తుతం ఎంటర్‌టైన్ మెంట్ విభాగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌నే క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
బొమ్మ ఫుల్ హెచ్‌డీలో కనబడాలంటే
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం తమ ఆదాయాన్ని, సబ్‌స్కైబర్ బేస్‌ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం పాస్ వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడం, యాడ్ ఫ్రీ వ్యూయింగ్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వంటి పలు మార్పులు చేస్తున్నాయి. తాజాగా, అమెజాన్ ప్రైమ్ ఇటీవల డాల్బీ విజన్ హెచ్‌ఆర్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ఫీచర్లను తన స్టాండర్డ్ సర్వీసుల నుండి తొలగించింది. ఇప్పుడు హైక్వాలిటీ ఆడియో,వీడియో స్ట్రీమింగ్ వీడియోల్ని వీక్షించాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని యూజర్లను కోరుతుంది.
ఎంత మొత్తం చెల్లించాలంటే?
అమెజాన్ తన పెయిడ్ సబ్ స్క్రిప్షన్‌కు యాడ్స్ జోడించడమే కాకుండా హై క్వాలిటీ ఆడియో, వీడియో ఆప్షన్‌ను తొలగించింది. వినియోగదారులు ఇప్పుడు తమ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పై నెలకు 2.99 డాలర్లు చెల్లించి క్వాలిటీని తిరిగి పొందవచ్చు. యాడ్స్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మార్పులు, చేర్పులు చేసే సమయంలో సబ్‌స్కైబర్లు భారీగా తగ్గిపోతున్నారు. ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్ ప్రైమ్ తీసుకునే నిర్ణయం ఆ సంస్థపై ఎలాంటి ప్రతికూలా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment