విస్తృతమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అన్ని కంపెనీలు అందిపుచ్చుకుని ముందుకుసాగుతుంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) మాత్రం అదే మా కొంప ముంచుతోందంటూ బోరుమంటోంది. ఉత్పాదక ఏఐ (GenAI) తమకు ముప్పుగా పరిణమించిందని, తమ కార్యకలాపాలను, ఇతర కంపెనీలతో పోటీపడే సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని వాపోయింది.
యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి దాఖలు చేసిన వార్షిక నివేదికలో నెట్‌ఫ్లిక్స్ ఈ వివరాలను వెల్లడించింది. కొత్త సాంకేతిక పరిణామాలు, ఉత్పాదక కృత్రిమ మేధస్సు అభివృద్ధి, వినియోగం విస్తృతంగా పెరుగుతున్నాయని పేర్కొంది.
"మా పోటీదారులు అటువంటి సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతుండగా గట్టిగా పోటీపడే మా సామర్థ్యం, మా కార్యకలాపాల ఫలితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి" అని కంపెనీ వాపోయింది. నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మేధో సంపత్తి క్లెయిమ్‌లు, కాపీరైట్, ఇతర మేధో సంపత్తి రక్షణ లభ్యతపై మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment