hair oil brand
-
కొబ్బరి నూనె.. హెయిర్ ఆయిలా? వంటనూనా?
కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె.. హెయిర్ ఆయిలా లేక వంటలనూనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రెండింటికీ వాడతారు. మనదేశంలో హెయిర్ ఆయిల్గానే అధికంగా కొబ్బరి నూనె వాడతారు. కాళ్లు, చేతులతో పాటు శరీరాన్ని మర్దన చేయడానికి కూడా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? దశాబ్దన్నర కాలం నుంచి కొబ్బరినూనెపై జరుగుతున్న ‘పన్ను’ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ముగింపు పలికింది. ఎక్సైజ్ శాఖ, తయారీదారుల మధ్య సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఏమిటా వివాదం?చిన్నచిన్న సీసాల్లో విక్రయించే కొబ్బరి నూనెను ఎడిబుల్ ఆయిల్ (తినదగిన నూనె)గా వర్గీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తయారీదారులు, వినియోగదారులకు ఊరట లభించనుంది. కొకొనట్ ఆయిల్‌పై ‘పన్ను’ వివాదం 2009లో ప్రారంభమైంది. మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తుంటాయి. అలాగే రెడీమేడ్ కొబ్బరినూనె అమ్మకాలపై కూడా పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ (సెట్ యాక్ట్) 1985 ప్రకారం ఎడిబుల్ ఆయిల్ కేటగిరీ కింద కొబ్బరినూనెపై 8 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. సెట్ యాక్ట్‌కు 2005లో కేంద్రం సవరణ చేసింది. దీని ప్రకారం 2009, జూన్‌లో కొబ్బరినూనెను కేశసంరక్షణ ఉత్పత్తిగా పేర్కొంటూ సుంకాన్ని 16 శాతానికి పెంచింది.అయితే 2009లో సర్క్యులర్ జారీ చేయడానికి ముందే, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు 2007లో మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు పలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిగా వర్గీకరిస్తూ కొబ్బరి నూనెపై అధిక పన్ను రేటు విధించాలని నోటీసుల్లో ప్రతిపాదించారు. మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొబ్బరి నూనెను 5 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ప్యాకెట్లలో విక్రయిస్తుంటుంది. పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(సెస్టాట్)ను మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. సెస్టాట్ తీర్పును సుప్రీంకోర్టులో సేలం సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సవాల్ చేశారు.ఎటూ తేల్చని ద్విసభ్య ధర్మాసనంకొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్ విభాగంలో చేర్చాలా, వంటనూనెగా పరిగణించాలా అనే దానిపై 2018లో జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా కొబ్బరి నూనెను తినదగిన నూనెగా వర్గీకరించాలని జస్టిస్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్గా పరిగణించాలని జస్టిస్ భానుమతి పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది.15 ఏళ్ల న్యాయవివాదం15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. కొబ్బరి నూనెను చిన్న బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎడిబుల్ ఆయిల్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే వంటనూనె, హెయిర్ ఆయిల్ మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా ఏదైనా చేయాలని ధర్మాసం సూచించింది. తినదగిన నూనెగా విక్రయించబడే కొబ్బరి నూనె తప్పనిసరిగా 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది.చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్రూ. 740 కోట్లు పెండింగ్రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వ్యవహారంలో వడ్డీ, జరిమానాలు కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 740 కోట్లు రావాల్సి ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉండడంతో కొకొనట్ ఆయిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ ప్రకారం చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్‌పై 5 శాతం, హెయిర్ ఆయిల్‌పై 18 శాతం పన్ను ఉంది. స్వల్ప పరిమాణంలో విక్రయించే కొబ్బరినూనెను ఎడిబుల్ ఆయిల్ జాబితాలో చేర్చడం వల్ల పన్నుల భారంతో పాటు ధర కూడా తగ్గుతుంది. ఫలితంగా తయారీదారుడితో పాటు వినియోగదారుడికి ఊరట లభిస్తుంది. -
ఈ డివైజ్‌తో ఒత్తుగా దృఢంగా ఉండే కురులు సొంతం..!
ఆడవారికి కురులతోనే అందం రెట్టింపవుతుంది. పెదవులను, కనురెప్పలను, కనుబొమ్మలను ప్రత్యేకంగా హైలైట్ చేసి మేకప్ వేసుకున్నా, ట్రెడిషనల్ లేదా మోడర్న్ డ్రెస్ వేసుకుని మెరిసిపోవాలన్నా, అందుకు తగ్గ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి జుట్టు ఉండాలి. చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ హెయిర్ ఆయిల్ అప్లికేటర్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ను చక్కగా అందిస్తుంది.ఇది చూడటానికి చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఈ ఆయిల్ అప్లికేటర్ బ్రష్‌లో వైబ్రేషన్ ఫంక్షన్ ఉండటంతో ఇది స్కాల్ప్ మసాజర్‌లా పని చేస్తుంది. దీని లోపల ఉన్న మినీ ట్యాంక్‌లో నూనె పోసుకుని, డివైస్‌తో లభించే సీరమ్ కలుపుకుని, బటన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పవర్ కనెక్టర్ దగ్గర సేఫ్టీ క్యాప్ ఉండటంతో వాటర్‌ప్రూఫ్‌లా పని చేస్తుంది. అందువల్ల దీన్ని వినియోగించడం, శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. ఈ డివైస్ 5 మి.లీ. సామర్థ్యంతో రూపొందింది. దీనికి యూఎస్బీ కేబుల్‌తో చార్జింగ్ పెట్టుకుంటే, వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. లాప్టాప్, ఫోన్, పవర్ బ్యాంక్‌లతో కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని పోర్టబుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది హెడ్ మసాజర్ నాన్–స్లిప్ ఉపరితలంతో పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది పని చేస్తున్నప్పుడు లోపల లైట్ వెలుగుతూ తలకు గోరువెచ్చని కాపడం కూడా అందిస్తుంది. దీనికి ప్రత్యేకమైన క్యాప్ ఉంటుంది. మసాజ్ చేసుకునే పని లేనప్పుడు దాన్ని డివైస్‌కి బిగించి, ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లొచ్చు. ఇలాంటి మసాజర్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. కంపెనీని బట్టి ఒక హెయిర్ గ్రోత్ సీరమ్ డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ సీరమ్ అయిపోతే మళ్లీ ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధర 26 డాలర్లు. అంటే 2,176 రూపాయలు మాత్రమే! (చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..) -
రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..?
జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే..?రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.జుట్టు రాలడంజుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్‌కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.మొటిమలురాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.(చదవండి: మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!) -
జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే!
రాజకీయనాయకురాలు, బాలీవుడ్ నటి జయబచ్చన్ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగానూ అభిమానుల చేత పలు ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువైనా ఆమె జుట్టు అంతగా మెరవలేదని చెప్పొచ్చు. తనతోటి నటులు జుట్టు రాలిపోయి, ముగ్గబుట్టయ్యే పోయినా.. ఆమె మాత్రం నలభై, యాభైల వయసు మాదిరిగా ఉన్న శిరోజాలను మెయింటైయిన్ చేస్తారు. ఆమె తన శిరోజాలు నెరవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాను వాట్ ది హెల నవ్య అనే పోడోకాస్ట్ ప్రోగ్రాంలో షేర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రా మూడు తరాలకు చెందిన మహిళల వారి ఆలోచనలను షేర్ చేసుకునే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆమె కూతురు శ్వేతాబచ్చన్, మనవరాలు నవ్వ నందాతో కలసి జయబచ్చన్ తన శిరోజాల సీక్రేట్ని గురించి షేర్ చేసుకున్నారు. తాను జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన కొబ్బరినూనెని ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. తమ అమమ్మల కాలం నుంచి ఆకొబ్బరి నూనెతో తయారు చేసే ఆ ఆయిల్నినే వాడతామని అన్నారు. అందువల్లే తన శిరోజాలు ఇంతలా ఆరోగ్యంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే నెరుస్తుందని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఆ నూనెని ఎలా తయారు చేయాలో కూడా వివరంగా చెప్పారు. ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె కొద్దిగా కరివేపాకులు మెంతులు ఓ కుండ తయారీ విధానం: ఒక కుండలో కొబ్బరి నూనె, కరివేపాకులు, మెంతులు వేసి సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక వడకట్టి పొడి డబ్బాలో వేసి ఉపయోగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుని డ్రై అవ్వకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పైగా చివర్ల చిట్లిపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఉపయోగిచే కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. డ్యామేజ్ అయ్యిన జుట్టుని రిపేర్ చేయడంలో సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఈ మెంతి గింజల్లో ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్లు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. జయబచ్చన్ చెప్పిన ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ మీ జుట్టు సంరక్షణకు తప్పకు తోడ్పడుతుంది. తప్పక ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Mithi Ki Rasoi (@mithi_ki_rasoi) (చదవండి: రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!) -
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్!
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్ సోయా బిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు క్రూడ్ పామాయిల్‌పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను, పాయిల్‌పై 10శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి. వంటనూనెలేనా ఇంకా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెలతో పాటు ఫుడ్ ఐటమ్స్, కాస్మోటిక్స్ ధరలు అదుపులోకి రానున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థలు తయారు చేసేందుకు ముడి పదార్ధాలైన సన్ ఫ్లవర్ ఆయిల్, పాయిల్‌ను వినియోగిస్తుంటాయి. నూనె ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు రా మెటీరియల్‌పై పెట్టే ఖర్చును తగ్గించడంతో అటోమెటిగ్గా.. తయారు చేసే ప్రొడక్ట్‌ల ధరలు తగ్గుతాయి. వచ్చే మూడునెలల్లో మనదేశంలో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తక్కువ.అందుకే భారత్ సంవత్సరానికి 55 శాతం 60శాతం వరకు వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నూనెలపై ట్యాక్స్ తగ్గింపుతో రాబోయే 3నెలలో సామాన్యులు విరివిరిగా వినియోగించే వస్తువుల ధరలు భారీ తగ్గనున్నాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ పార్ట్నర్ సుమన్ జగ్దేవ్ తెలిపారు. నూనెల తగ్గింపుతో త్వరలో తగ్గనున్న వంట నూనెల ధర ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడనుంది. నూనెతో తయారు చేసే బిస్కెట్‌లాంటి ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెయ్యి, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడనున్నాయని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం అధినేత వినీత్ బోలిజ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి ధరలు పైపైకి కరోనా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సప్లయ్ చైన్ సమస్య, పెరిగిన ఇన్ పుట్ కాస్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థలైన నెస్లే ఇండియా, మారికో, హిందుస్తాన్ యూనిలివర్, రుచి సోయా, బ్రిటానియా, డాబర్,కోల్గెట్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థలు గత రెండేళ్లలో పలు ప్రొడక్ట్‌లను భారీగా పెంచాయి. తాజా, కేంద్ర నిర్ణయంతో పై సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించనున్నాయి. చదవండి👉దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు! -
కూతురి జుట్టు ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్లో వెదికి.. వృద్ధ దంపతులు..
ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదోఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని ఎదిరించి నిలబడి పోరాడేవాళ్లే ముందుకు సాగగలుగుతారు. కొంతమంది సమస్యను కూకటివేళ్లతో పెకిలించి భవిష్యత్ తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఓ వృద్ధజంట ఈ జాబితాలో నిలిచారు. తమ కూతురికి వచ్చిన సమస్యను వేర్లతో సహా పీకేయడానికి ఎనభై ఏళ్ల వయసులో ఈ జంట నడుం బిగించి, ఏకంగా హెయిర్ ఆయిల్ స్టార్టప్‌ను ప్రారంభించి ఔరా అనిపిస్తోంది. ‘‘మీలో శక్తి ఉంటే వయసు గురించి ఆలోచించకండి. మీకిష్టమైన దానిని సాధించే వరకు పోరాడండి’’ అని చెబుతున్నారు సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వయసులో వీరికి ఏమాత్రం ఓపిక తగ్గలేదు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా.. సమస్యకు సై అని సవాలు విసురుతూ పరిష్కారం చూపుతున్నారు. ఈ చౌదరి దంపతుల కూతురి జుట్టు బాగా ఊడిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం మాత్రం తగ్గలేదు. దీంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గర వెళ్లబోసుకుంది. కూతురి బాధను చూడలేని ఆ దంపతులు అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దానికి గల కారణాలు ఏంటీ? అని ఏడాదిపాటు నెట్లో వెదికారు. వెదుకులాటలో అనేక అధ్యయనాలు, పరిశోధన పత్రాలు లోతుగా అధ్యయనం చేయగా... ‘‘పురుషులలో అయితే డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉండడవల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది’’ అని గ్రహించారు. ఈ రెండు హార్మోన్లను సక్రమంగా పనిచేయించే పదార్థాల కోసం ఇంటర్నెట్ను క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వారు దొరికిన సమాచారంతో... వారే ఒక సరికొత్త ఆయిల్‌ను తయారు చేయడానికి పూనుకున్నారు. యాభై రకాలతో... అనేక పరిశోధనల తరువాత ఈ వృద్ధ జంట యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో హెయిర్ అయిల్ను రూపొందించింది. వీటన్నింటిని కలిపి ఆయిల్ తయారు చేసిన వీరు..తమ కూతురుకిచ్చి వాడమన్నారు. ఆ ఆయిల్ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం కనిపించింది. దీంతో తాము రూపొందించిన ఆయిల్ బాగా పనిచేస్తుందని అర్థమైంది చౌదరి దంపతులకు. ఆ తరువాత బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం కనిపించింది. అవిమీ... మూడు నెలలపాటు ఆయిల్‌ను పరీక్షించి, ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అవిమీ హెర్బల్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మలివయసులోనూ ఇంత బాగా ఆలోచించి సమస్యకు చక్కని పరిష్కారం చూపి ఎంతోమంది యువతరానికి ప్రేరణ ఇవ్వడమేగాక, చిన్నపెద్దా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. గమనిక: ఈ వృద్ధ జంట ప్రయత్నాన్ని ఒక స్ఫూర్తిదాయక కథనంగా మాత్రమే అందించడం జరిగింది. చదవండి👉🏾Youtube Village: ఘుమఘుమలాడే బిర్యానీ, చేపలు సులభంగా ఎలా పట్టాలి? వీటన్నింటికీ సమాధానం! -
హెయిర్ ఆయిల్ ప్రకటనలో టాలీవుడ్ హీరోయిన్
ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా రంగప్రవేశం చేసిన హీరోయిన్ తాప్సీ పన్ను ఇప్పుడు కొత్తగా హెయిర్ ఆయిల్ ప్రకటనలో నటిస్తోంది. తన తల్లి పేరు నిర్మల అని.. ఆమె పేరుమీదే వచ్చిన నిర్మల్ హెయిర్ ఆయిల్ ప్రకటనలో నటించే అవకాశం తనకు రావడం తన అదృష్టమని తాప్సీ (28) చెప్పింది. తాను మోడలింగ్ చేసే రోజుల నుంచి తన ఉంగరాల జుట్టు బాగుందంటూ చాలామంది మెచ్చుకునేవాళ్లని, అందుకే హెయిర్ ఆయిల్ ప్రకటన వచ్చిందంటే పెద్దగా ఆశ్చర్యపోలేదని తాప్సీ తెలిపింది. తాను నటించబోయే బ్రాండులో ఏవేం ఉంటాయన్నది నిర్ధారించుకోవడం కూడా తనకు చాలా ముఖ్యమని తాప్సీ చెప్పింది. ఇంతకుముందు కూడా తనకు కొన్ని ప్రముఖ బ్రాండ్ల హెయిరాయిల్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి గానీ, వాటికి తాను అంగీకరించలేదని తెలిపింది. తనకు విలువనిచ్చే బ్రాండు కోసం వేచి చూశానని, నిర్మల్ కొబ్బరినూనె అలాంటిదేనని తేలిందని వివరించింది.