హెయిర్ ఆయిల్ ప్రకటనలో టాలీవుడ్ హీరోయిన్
ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లో కూడా రంగప్రవేశం చేసిన హీరోయిన్ తాప్సీ పన్ను ఇప్పుడు కొత్తగా హెయిర్ ఆయిల్ ప్రకటనలో నటిస్తోంది. తన తల్లి పేరు నిర్మల అని.. ఆమె పేరుమీదే వచ్చిన నిర్మల్ హెయిర్ ఆయిల్ ప్రకటనలో నటించే అవకాశం తనకు రావడం తన అదృష్టమని తాప్సీ (28) చెప్పింది. తాను మోడలింగ్ చేసే రోజుల నుంచి తన ఉంగరాల జుట్టు బాగుందంటూ చాలామంది మెచ్చుకునేవాళ్లని, అందుకే హెయిర్ ఆయిల్ ప్రకటన వచ్చిందంటే పెద్దగా ఆశ్చర్యపోలేదని తాప్సీ తెలిపింది.
తాను నటించబోయే బ్రాండులో ఏవేం ఉంటాయన్నది నిర్ధారించుకోవడం కూడా తనకు చాలా ముఖ్యమని తాప్సీ చెప్పింది. ఇంతకుముందు కూడా తనకు కొన్ని ప్రముఖ బ్రాండ్ల హెయిరాయిల్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి గానీ, వాటికి తాను అంగీకరించలేదని తెలిపింది. తనకు విలువనిచ్చే బ్రాండు కోసం వేచి చూశానని, నిర్మల్ కొబ్బరినూనె అలాంటిదేనని తేలిందని వివరించింది.