అందులో నిజం లేదు! | Taapsee Shares About The Low Pay For Dunki: Bollywood | Sakshi
Sakshi News home page

అందులో నిజం లేదు!

Published Mon, Nov 4 2024 1:09 AM | Last Updated on Mon, Nov 4 2024 1:21 AM

Taapsee Shares About The Low Pay For Dunki: Bollywood

‘‘జుడ్వా 2’, ‘డంకీ’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో నేను పారితోషికం అందుకున్నానని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’’ అంటున్నారు హీరోయిన్‌ తాప్సీ. బాలీవుడ్‌లోని స్టార్‌ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు  ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై స్పందించారు. ‘‘వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆలోచిస్తాను. పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు.

‘జుడ్వా 2’, ‘డంకీ’ సినిమాలకు నేను భారీగా పారితోషికం అందుకున్నానని పలువురు భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు ఏదో మాపై దయ చూపుతున్నట్లు వ్యవహరిస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.. మరికొంతమంది ‘మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్‌ ఉన్నతి కోసం సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది’ అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై నేను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్స్‌లో హీరోయిన్ల పాత్రలపై చిన్నచూపు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement