– తాప్సీ పన్ను, నటి
‘నా ఇల్లంతా భారతీయత కనిపించాలి. ఆ కళతో నేను అనుభూతి చెందాలి’ అంటోంది నటి తాప్సీపన్ను. ముంబైలోని తాప్సీ పన్ను ఇల్లు ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. ఇందుకు సోదరి షగున్ తన కలకు సహాయం చేసిందని మరీ మరీ చెబుతుంది తాప్సీ.
ఇంటి లోపలి అలంకరణలో ఎర్ర ఇటుక గోడలు, జూట్ చార్పైస్, గోడకు అమర్చిన ఝరోఖాలు ఉన్నాయి. ఇది పంజాబ్ ఇంటీరియర్‌లలో ఒక అద్భుతమైనప్రాచీన ఇంటిని గుర్తు చేస్తుంది. ‘నా సోదరి వెడ్డింగ్ ప్లానర్,ప్రొఫెషనల్ కూడా. దీంతో ప్రత్యేకమైన డిజైనర్ అవసరం లేకపోయింది. ఆమె మా ఇంటిని చాలా అర్ధవంతంగా మార్చడానికి సహాయం చేసింది. మేం దేశంలోని పంజాబ్, రాజస్థాన్, కచ్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా కొన్ని వస్తువులు సేకరించి, తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన వాటితోనే మా ఇంటి అలంకరణ చేశాం.
ప్రాచీన కళ
‘నేనెప్పుడూ విలాసవంతమైన ఇల్లు కావాలనుకోలేదు. భారతీయత కనిపించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాను. అందుకు ఇది ఫ్యాన్సీదా, ఖరీదైనదా అనుకోను. ఇల్లు మన ఆత్మీయులందరినీ స్వాగతించేలా ఉండాలి.
దేశీ – విదేశీ
మా ఇల్లు అపార్ట్‌మెంట్‌లోని డ్యూప్లెక్స్ స్టైల్. ఒక అంతస్తు మొత్తం దేశీ అనుభూతిని పంచుతుంది. నా అభిరుచికి ఈ అంతస్తు అద్దం పడుతుంది. మరొక అంతస్తు నా వ్యక్తిగత స్థలం. అక్కడ, నా మానసిక స్థితిని బట్టి, మార్చుకోవడానికి అనువైనది ఉండేలా చూసుకుంటాను. నా స్నేహితులు దేశీ ఫ్లోర్‌పైనే సందడి చేస్తారు.
ఇక నా గదిని చూసి మాత్రం పింటరెస్ట్ హౌస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇంట్లోని ప్రతి మూలన ఏదో ఒక ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. నాకెందుకో ఏ మూలన ఖాళీగా అనిపించినా, అక్కడ ఫొటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫొటో ఆల్బమ్‌లో అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి, నచ్చిన చోటల్లా పెట్టేస్తుంటాను. మా నాన్నకు ఇంటీరియర్స్‌లో చాలా మంచి అభిరుచిని ఉంది. అందుకు ఉపయుక్తంగా, వైద్యపరంగా ఉండటానికి ఇష్టపడతాడు.
మాస్టర్ బెడ్‌రూమ్ క్లాసిక్ వైట్‌తో ఉంటుంది. నలుగురు పడుకునేంత పెద్ద బెడ్, వుడెన్ ఫ్రేమ్స్, కార్వింగ్‌తో చేయించాం. వానిటీ ఏరియాలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేయించాం. మిర్రర్ చుట్టూ ఎల్లో లైట్స్ డిజైన్ చేయించాం. మంచి రంగున్న కర్టెయిన్స్, బెడ్ కు ముందు కిటికీ, ఫ్లోరింగ్ కూడా ఉడ్‌తో తయారుచేసిందే. బాల్కనీ ఏరియాలో వుడెన్ ఫ్లోరింగ్, ముదురు గోధుమ రంగు కుషన్స్, ప్రింటె ప్యాబ్రిక్స్ ఉంటాయి.
కొన్ని మొక్కలతో బాల్కనీ ఏరియాను డిజైన్ చేసుకున్నాం. యోగా చేసుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంటుంది. కుండీలలో మొక్కలు, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, బుద్ద విగ్రహం, వాల్ హ్యాంగింగ్స్... అన్నీ కలిసి ఓ మినీ ఫారెస్ట్‌ని తలపించేలా డిజైన్ చేయించాం. ఇంటిని డిజైన్ చేయించం అంటే మనలోని కళకు అద్దం పట్టినట్టే’’ అంటోంది తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment