ఈ డివైజ్‌తో ఒత్తుగా దృఢంగా ఉండే కురులు సొంతం..! | Electric Hair Oil Applicator Massager With Red Light Therapy | Sakshi
Sakshi News home page

ఈ డివైజ్‌తో ఒత్తుగా దృఢంగా ఉండే కురులు సొంతం..!

Published Sun, Oct 20 2024 2:08 PM | Last Updated on Sun, Oct 20 2024 5:17 PM

Electric Hair Oil Applicator Massager With Red Light Therapy

ఆడవారికి కురులతోనే అందం రెట్టింపవుతుంది. పెదవులను, కనురెప్పలను, కనుబొమ్మలను ప్రత్యేకంగా హైలైట్‌ చేసి మేకప్‌ వేసుకున్నా, ట్రెడిషనల్‌ లేదా మోడర్న్‌ డ్రెస్‌ వేసుకుని మెరిసిపోవాలన్నా, అందుకు తగ్గ హెయిర్‌ స్టైల్‌ వేసుకోవడానికి జుట్టు ఉండాలి. చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్‌ హెయిర్‌ ఆయిల్‌ అప్లికేటర్‌ హెయిర్‌ గ్రోత్‌ ట్రీట్‌మెంట్‌ను చక్కగా అందిస్తుంది.

ఇది చూడటానికి చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఈ ఆయిల్‌ అప్లికేటర్‌ బ్రష్‌లో వైబ్రేషన్‌ ఫంక్షన్‌ ఉండటంతో ఇది స్కాల్ప్‌ మసాజర్‌లా పని చేస్తుంది. దీని లోపల ఉన్న మినీ ట్యాంక్‌లో నూనె పోసుకుని, డివైస్‌తో లభించే సీరమ్‌ కలుపుకుని, బటన్‌ ఆన్‌  చేసుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పవర్‌ కనెక్టర్‌ దగ్గర సేఫ్టీ క్యాప్‌ ఉండటంతో వాటర్‌ప్రూఫ్‌లా పని చేస్తుంది. అందువల్ల దీన్ని వినియోగించడం, శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. 

ఈ డివైస్‌ 5 మి.లీ. సామర్థ్యంతో రూపొందింది. దీనికి యూఎస్‌బీ కేబుల్‌తో చార్జింగ్‌ పెట్టుకుంటే, వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. లాప్‌టాప్, ఫోన్, పవర్‌ బ్యాంక్‌లతో కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. దీన్ని పోర్టబుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది హెడ్‌ మసాజర్‌ నాన్‌–స్లిప్‌ ఉపరితలంతో పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది పని చేస్తున్నప్పుడు లోపల లైట్‌ వెలుగుతూ తలకు గోరువెచ్చని కాపడం కూడా అందిస్తుంది. 

దీనికి ప్రత్యేకమైన క్యాప్‌ ఉంటుంది. మసాజ్‌ చేసుకునే పని లేనప్పుడు దాన్ని డివైస్‌కి బిగించి, ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లొచ్చు. ఇలాంటి మసాజర్స్‌ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. కంపెనీని బట్టి ఒక హెయిర్‌ గ్రోత్‌ సీరమ్‌ డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ సీరమ్‌ అయిపోతే మళ్లీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. దీని ధర 26 డాలర్లు. అంటే 2,176 రూపాయలు మాత్రమే! 

(చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement