రాజకీయనాయకురాలు, బాలీవుడ్ నటి జయబచ్చన్ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగానూ అభిమానుల చేత పలు ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువైనా ఆమె జుట్టు అంతగా మెరవలేదని చెప్పొచ్చు. తనతోటి నటులు జుట్టు రాలిపోయి, ముగ్గబుట్టయ్యే పోయినా.. ఆమె మాత్రం నలభై, యాభైల వయసు మాదిరిగా ఉన్న శిరోజాలను మెయింటైయిన్ చేస్తారు.
ఆమె తన శిరోజాలు నెరవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాను వాట్ ది హెల నవ్య అనే పోడోకాస్ట్ ప్రోగ్రాంలో షేర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రా మూడు తరాలకు చెందిన మహిళల వారి ఆలోచనలను షేర్ చేసుకునే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆమె కూతురు శ్వేతాబచ్చన్, మనవరాలు నవ్వ నందాతో కలసి జయబచ్చన్ తన శిరోజాల సీక్రేట్‌ని గురించి షేర్ చేసుకున్నారు.
తాను జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన కొబ్బరినూనెని ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. తమ అమమ్మల కాలం నుంచి ఆకొబ్బరి నూనెతో తయారు చేసే ఆ ఆయిల్‌నినే వాడతామని అన్నారు. అందువల్లే తన శిరోజాలు ఇంతలా ఆరోగ్యంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే నెరుస్తుందని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఆ నూనెని ఎలా తయారు చేయాలో కూడా వివరంగా చెప్పారు.
ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరి నూనె
- కొద్దిగా కరివేపాకులు
- మెంతులు
- ఓ కుండ
తయారీ విధానం: ఒక కుండలో కొబ్బరి నూనె, కరివేపాకులు, మెంతులు వేసి సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక వడకట్టి పొడి డబ్బాలో వేసి ఉపయోగించుకోవాలి.
ఈ హెయిర్ ఆయిల్‌లో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుని డ్రై అవ్వకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పైగా చివర్ల చిట్లిపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఉపయోగిచే కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. డ్యామేజ్ అయ్యిన జుట్టుని రిపేర్ చేయడంలో సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఈ మెంతి గింజల్లో ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్‌లు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. జయబచ్చన్ చెప్పిన ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ మీ జుట్టు సంరక్షణకు తప్పకు తోడ్పడుతుంది. తప్పక ట్రై చేసి చూడండి.
(చదవండి: రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!)
Comments
Please login to add a commentAdd a comment