
బాబూ! బిస్కెట్ కావాలా?
మీరు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నప్పుడు బాగా ఆకలేస్తే ఏం చేస్తారు? హోటల్‌లో స్పెషల్ ఏంటో ఎంక్వయిరీ చేసి, అవి తెప్పించుకుని మరీ తింటారు కదూ! కానీ, కాజల్ అగర్వాల్ కొంచెం డిఫరెంట్. స్టార్ హోటల్ కిచెన్‌లోకి వెళ్లి కుకింగ్ చేశారు. బాదం బిస్కెట్లు, డార్క్ చాక్లెట్ అండ్ సీ సాల్ట్ కుకీస్ తయారు చేశారు. ఎప్పుడూ సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే కాజల్‌కు వంట చేయడం వచ్చా? అనే డౌట్ వచ్చిందా! నటన తర్వాత కాజల్ ఎక్కువగా ఇష్టపడేది వంట చేయడాన్నే.
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కిచెన్‌లోకి వెళ్లి గరిటె తిప్పడం కాజల్‌కు అలవాటు. కానీ, ఇప్పుడు ఇంట్లో కాకుండా బయట వంట చేశారు. కుకింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా కుకింగ్‌పై నా ప్రేమను చూపించుకునే ఛాన్స్ వచ్చింది. బిస్కెట్స్, కుకీస్ తయారు చేశా.
మా అమ్మ ద్వారా నాకు వంట అంటే ఇష్టం ఏర్పడింది’’ అని కాజల్ పేర్కొన్నారు. ‘బాబూ! బిస్కెట్ కావాలా?’ అన్నట్టు కాజల్ పోస్ట్ చేసిన స్టిల్స్ చూస్తే ప్రేక్షకుల నోరూరడం ఖాయమే. ఎవరైనా ఈ బిస్కెట్లు తినాలనుకుంటే కష్టమే. చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలసి నగల వ్యాపారం ప్రారంభించిన కాజల్, భవిష్యత్తులో బేకరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే... అప్పుడు ఆమె చేసిన కుకీలను తినవచ్చు.