స్నాక్‌ సెంటర్‌ | Funday Snacks special | Sakshi
Sakshi News home page

స్నాక్‌ సెంటర్‌

Published Sun, Aug 12 2018 12:48 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

Funday Snacks special - Sakshi

స్ట్రాబెరీ బిస్కెట్స్‌
కావలసినవి:  సాల్టెడ్‌ బటర్‌ తురుము – అర కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది)మైదాపిండి – రెండున్నర కప్పులు, పంచదార – పావు కప్పు (మిక్సీ పట్టుకోవాలి)బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూన్, చీజ్‌ – 1 కప్పుస్ట్రాబెరీ ముక్కలు – 1 కప్పు, సాల్టెడ్‌ బటర్‌ – 2 టేబుల్‌ స్పూన్స్‌
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్‌ పౌడర్, అరకప్పు బటర్‌ తురుము వేసుకుని, బాగా కలిపి పదినిమిషాల పాటు ఆగాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చీజ్‌ కూడా వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ ముక్కలు కూడా యాడ్‌ చేసుకుని, ఓ ఐదారు సార్లు కలుపుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో బిస్కెట్స్‌ తయారు చేసుకుని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 12 – 15 నిమిషాల మధ్యలో 2 టేబుల్‌ స్పూన్స్‌ సాల్టెడ్‌ బటర్‌ని బిస్కెట్స్‌పైన వేసి మెల్ట్‌ చేసుకోవాలి.

ఓట్స్‌ కేక్‌
కావలసినవి:  మైదాపిండి – 1 1/4 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – 1 1/2 టీ స్పూన్‌బ్రౌన్‌సుగర్‌ – అర కప్పు, బటర్‌ – అర కప్పు, ఓట్స్‌ – ముప్పావు కప్పు, వేడి నీళ్లు – 1 కప్పు, ఖర్జూరం – 1 కప్పు, వాల్‌నట్స్‌ – 1 కప్పు, అవిసె గింజల పొడి – 3 టేబుల్‌ స్పూన్స్, నీళ్లు – 6 టేబుల్‌ స్పూన్స్, ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా ఖర్జూరాలను శుభ్రం చేసి, గింజలు తీసి వేడి నీళ్లలో వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత అవిసె గింజల పొడిలో 6 టేబుల్‌ స్పూన్ల నీళ్లు కలిపి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి. (అభిరుచిని బట్టి ఈ అవిసె గింజల మిశ్రమానికి బదులుగా ఒక గుడ్డును ఉపయోగించుకోవచ్చు) ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ బౌల్‌ తీసుకుని, అందులో బ్రౌన్‌సుగర్, బటర్, ఖర్జూరం వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత వాల్‌నట్స్, అవిసె గింజల మిశ్రమం యాడ్‌ చేసుకుని మెత్తగా అయ్యేదాకా మరోసారి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్, మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, బ్రౌన్‌సుగర్‌ మిశ్రమం కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓవెన్‌లో నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడకనిచ్చి మనకు కావల్సిన షేప్‌లో ముక్కలు కట్‌ చేసుకోవాలి. 

బనానా డోనట్స్‌
కావలసినవి:  అరటి పండ్లు – 2 (మీడియం సైజ్‌), గుడ్డు – 1, పాలు – పావు కప్పు, నూనె – 4 టేబుల్‌ స్పూన్స్, వెనీలా సిరప్‌ – 1 టేబుల్‌ స్పూన్, మైదాపిండి – 1 కప్పు, పంచదార – అర కప్పు, బేకింగ్‌ సోడా – 1 టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, దాల్చినచెక్క పొడి – పావు టీ స్పూన్, బటర్‌ – పావు కప్పుబ్రౌన్‌సుగర్‌ – పావు కప్పు, బెల్లం తురుము – 1 టేబుల్‌ స్పూన్‌చీజ్‌ – 2 టీ స్పూన్‌

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్డు, పాలు, నూనె, వెనీలా సిరప్‌ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద బౌల్‌ తీసుకుని మైదా పిండి, పంచదార, బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని నాన్‌స్టిక్‌ బౌల్‌లో బటర్‌ వేసుకుని, అది కరిగిన తర్వాత బ్రౌన్‌ సుగర్, బెల్లం తురుము, చీజ్‌ వేసుకుని సిరప్‌ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న మరో అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత డోనట్స్‌ షేప్‌ ట్రే తీసుకుని, అందులో కొద్దికొద్దిగా బటర్‌–çసుగర్‌ సిరప్‌ వేసుకుని, మూడు నాలుగు అరటిపండు ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అరటిపండు–మైదా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని ఓవెన్‌లో ఉడికించుకోవాలి. డోనట్స్‌ తయారైన వెంటనే మిగిలి ఉన్న బటర్‌–సుగర్‌ సిరప్‌ను వాటిపై వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement