Strawberries
-
స్ట్రాబెర్రీ పండే కాదు..ఆకులతో కూడా : డబుల్ ధమాకా
జ్యూసీ, జ్యూసీ స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కాస్త ఖరీదు ఎక్కువైనా సరే, ప్రతీ బైట్లోనూ నోట్లోకి జారే తీపి పులుపుతో కూడిన స్ట్రాబెర్రీ టేస్ట్‌ను ఆరగించాల్సిందే. అయితే స్ట్రాబెర్రీ పండ్ల మాదిరి గానే, ఆకుల్లోకూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. మరి అవేంటో చూద్దాం రండి!స్ట్రాబెర్రీ ఆకులు విటమిన్ సీ విషయంలో స్ట్రాబెర్రీ పండుతో పోటీపడతాయట. సాధారణ ఆకు కూరల మాదిరిగానే, స్ట్రాబెర్రీ ఆకులూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది.రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ ఆకులు మంచిది. విటమిన్ ఏ, కే, ఇనుము, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ ఆకుల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అంచనా.స్ట్రాబెర్రీ ఆకులలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలకు, శక్తివంతమైన సెల్ ప్రొటెక్టర్లుగా పనిచేస్తాయి. స్ట్రాబెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ గ్లెసీమియా (ప్రమాదకర అధిక రక్త చక్కెర స్థాయిలు) టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులతో ఉన్న వారికి మేలు చేస్తాయి. డైజెస్టివ్ ఎయిడ్‌గా ఉపయోగపడతాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపర్చి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సన్నగా తరిగిన ఆకులు సలాడ్లలో యాడ్ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీలో కూడా వాడవచ్చు. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్ట్రాబెర్రీ ఆకుల్లోని ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.నోట్: సేంద్రీయంగా పండించిన తాజా స్ట్రాబెర్రీ ఆకులను వాడటం ఉత్తమం. లేదా వీటి ఆకులను వాడే ముందు పురుగుమందుల అవశేషాలనుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. -
మన నేలమీదే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్ స్టోరీ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది. నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. హై బుష్ కౌన్సిల్ ప్రకటన! ‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం. దిగుబడికి ముందే ఆర్డర్లు! ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్లు వచ్చారు. రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం. -
రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!
స్ట్రాబెర్రీ అంటే ఇష్టంగా తినే వాళ్లకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో రోజూ స్ట్రాబెర్రీలు కనీసం ఎనిమిది తింటే డిప్రెషన్, డిమెన్షియా దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పరిశోధనలు న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలను సిన్సినాటి యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి పరిశోధనల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలెంటంటే.. సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకుల బృందం సుమారు 50 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తుల సముహాలను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు. ఒక గ్రూప్ మొత్తానికి స్టాబెర్రీలు ఇవ్వగా, ఇంకో గ్రూప్‌కి సాధారణమైన రోజూవారి పళ్లను ఇచ్చారు. అయితే స్ట్రాబెర్రీలు క్రమతప్పకుండా తీసుకున్న గ్రూప్‌లో మెరుగైన జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిస్ప్రుహ లక్షణాలను అధిగమించినట్లు తెలిపారు. మిగతా సముహంలో మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా ఉండటమే గాక డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. మెరుగైన ఫలితాలు కనిపించిన సముహంలో కేవలం ఐదుగురు పురుషులు, సుమారు 25 మంది దాక మహిళలు ఉన్నారని. వారిందరూ మెరుగైన మానసిక స్థితి, మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారని అన్నారు. 12 వారాల పాటు ఎనిమిది చొప్పున స్ట్రా బెర్రీలు ఇస్తేనే ఇంత మెరుగైన ఫలితం కనిసించిందంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు రోజూ తీసుకుంటే ఇంకెంతో ఫలితం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ డిమెన్షియా అనేది వ్యాధి కాదు. ఇది ఒకరకమైన మానసిక చిత్త వైకల్యం. సింపుల్‌గా చెప్పాలంటే మెమరీ నష్టం అనొచ్చు. మెదడు గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కోల్పోవడం. దీనివల్ల దైనందిన జీవితం గందరగోళంగా మారిపోతుంది. ఇది పార్కిన్సన్, అల్జీమర్స్ లాంటిదే కానీ దీనికి చికిత్స లేదు. జస్ట్ మందులతో నిర్వహించగలం అంతే. ఇది తగ్గటం అంటూ ఉండదు. చివరికి ఒకనొక దశలో ఆయా పేషెంట్లకు తినడం అనేది కూడా కష్టమైపోతుంది. ప్రస్తుతం యూకేలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి 11 మందిలో ఒకరు ఈ డిమెన్షియా బారినపడుతున్నట్లు సిన్సినాటి పరిశోధకుడు రాబర్ట్ క్రికోరియన్ తెలిపారు. అయితే మనకు అందుబాటులో ఉండే ఈ స్ట్రా బెర్రీ పళ్లల్లో విటమిన్ సీ, మాంగనీస్, ఫోలేట్ (విటమిన్ B9), పోటాషియంలు ఉంటాయి. వీటితో మానసిక సమస్యలకు సంబంధించిన రుగ్మతలను నుంచి సునాయసంగా బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మందుల కంటే కూడా ఇలా ప్రకృతి ప్రసాదించినవే ప్రభావంతంగా పనిచేస్తాయని, పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. (చదవండి: ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!) -
లంబసింగి స్ట్రాబెర్రీ జామ్: జుర్రుకుని తినేయొచ్చు
తాడేపల్లిగూడెం: బ్రెడ్‌కి జామ్ రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు.. ఇంకా చాలా ఆహార పదార్ధాలతో జామ్ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో చాలా రకాల జామ్‌లు దొరుకుతాయి. కానీ.. మన రాష్ట్రంలోని లంబసింగి నుంచి వచ్చే జామ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది అక్కడి రైతులు పండించిన స్ట్రాబెర్రీ నుంచి తయారు చేసినది. ఈ జామ్ మిగతా వాటికంటే సూపర్ టేస్ట్. మృదుఫలంగా పిలిచే స్ట్రాబెర్రీని జామ్లా జుర్రుకు తినొచ్చు. ఇదెలా సాధ్యమైందంటే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలు. మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో స్ట్రాబెర్రీ విక్రయాలకు తీవ్ర అవరోధం కలిగింది. పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అయోమయంలోకి వెళ్లారు. ఈ విషయం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ డి.వెంకటస్వామి దృష్టికి వచ్చింది. వారు స్ట్రాబెర్రీ రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలను వెంకట్రామన్నగూడెంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగానికి రప్పించారు. వాటిని ఇక్కడ సహజ విధానాలతో శుభ్రం చేయించి, తాజా పండ్లకు వాణిజ్య హంగులు అద్ది ప్యాకింగ్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మిగిలిపోయిన పండ్లను గుజ్జుగా మార్చారు. ఆ గుజ్జును పంచదారతో మిశ్రమం చేసి జామ్‌గా తయారు చేశారు. దానిని సీసాల్లో పోసి అందంగా ప్యాకింగ్ చేశారు. లంబసింగి రైతులు పండించిన తాజా స్ట్రాబెర్రీలను వినియోగించడంతో 250 గ్రాముల జామ్ బాటిల్ ధర రూ.250 ధర పలికింది. అంటే కిలోకు రూ.వెయ్యి దక్కింది. స్ట్రాబెర్రీ ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ జానకిరామ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ డీవీ స్వామి ఎకరానికి రూ.2.20 లక్షల లాభం ఎకరానికి 800 కేజీల స్ట్రాబెర్రీ పండ్ల దిగుబడి వస్తుంది. ఆ పండ్లను కిలో రూ.150 చొప్పున విక్రయిస్తుంటారు. ఆ విధంగా పండ్లను నేరుగా విక్రయిస్తే రైతుకు రూ.1,20,000 ఆదాయం లభిస్తుంది. కానీ.. ఆ పండ్ల నుంచి గుజ్జు (పల్ప్) తీస్తే 546 కిలోలు వస్తుంది. దీనిని ప్రాసెసింగ్ చేసి 250 గ్రాముల చొప్పున బాటిల్ ప్యాకింగ్ చేయించాం. 2,025 బాటిల్స్ వచ్చాయి. రిటైల్ మార్కెట్లో 250 గ్రాముల స్ట్రాబెర్రీ జామ్ సీసా రూ.250 పలుకుతోంది. రైతులు గుత్తగా ఒక్కో సీసాను రూ.175 చొప్పున విక్రయించగా.. రైతుకు రూ.3,54,375 ఆదాయం లభించింది. సాగుతోపాటు రవాణా, ఇతర అన్నిరకాల ఖర్చులు కలిపి రూ.1,35,000 అయినట్టు అంచనా వేశారు. ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ.2.20 లక్షల నికరాదాయం లభించినట్టు తేల్చారు. పండ్లగా విక్రయించడం కంటే.. జామ్ రూపంలో విక్రయిస్తే ఎకరానికి అదనంగా రూ.లక్ష వరకు అదనపు ఆదాయం వస్తుంది. పండ్లగా విక్రయించే సందర్భంలో అవి కుళ్లిపోయినా.. ధర తగ్గినా.. పండ్లు అమ్ముడుకాకపోయినా ఆ మేరకు రైతు నష్టపోతాడు. జామ్ చేయడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం ఉండదు. పైగా ఇది 9 నెలలు నిల్వ ఉంటుంది. రైతులకు మేలు చేయగలిగాం రైతులు పండించిన పంటలకు వాణిజ్య విలువలు తీసుకురావడంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుంటోంది. లంబసింగి రైతుల సమస్యను తెలుసుకుని స్ట్రాబెర్రీలను వర్సిటీ ఆధ్వర్యంలో జామ్‌గా తయారు చేయించి వారికి మేలు చేయగలిగాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉప కులపతి, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆనందంగా ఉంది లంబసింగి రైతులు పండించిన స్ట్రాబెర్రీలను జామ్‌గా మార్చడానికి సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది. వీసీ, పరిశోధన సంచాలకులతో కలిసి జామ్ తయారు చేయించి రైతులకు లాభాలు వచ్చేలా చూడగలిగాం. – డాక్టర్ డీవీ స్వామి, విభాగాధిపతి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ -
స్నాక్ సెంటర్
స్ట్రాబెరీ బిస్కెట్స్ కావలసినవి: సాల్టెడ్ బటర్ తురుము – అర కప్పు (మార్కెట్లో దొరుకుతుంది)మైదాపిండి – రెండున్నర కప్పులు, పంచదార – పావు కప్పు (మిక్సీ పట్టుకోవాలి)బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, చీజ్ – 1 కప్పుస్ట్రాబెరీ ముక్కలు – 1 కప్పు, సాల్టెడ్ బటర్ – 2 టేబుల్ స్పూన్స్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, అరకప్పు బటర్ తురుము వేసుకుని, బాగా కలిపి పదినిమిషాల పాటు ఆగాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చీజ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ ముక్కలు కూడా యాడ్ చేసుకుని, ఓ ఐదారు సార్లు కలుపుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో బిస్కెట్స్ తయారు చేసుకుని ఓవెన్లో పెట్టుకోవాలి. 12 – 15 నిమిషాల మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ సాల్టెడ్ బటర్ని బిస్కెట్స్పైన వేసి మెల్ట్ చేసుకోవాలి. ఓట్స్ కేక్ కావలసినవి: మైదాపిండి – 1 1/4 కప్పు, బేకింగ్ పౌడర్ – 1 1/2 టీ స్పూన్బ్రౌన్సుగర్ – అర కప్పు, బటర్ – అర కప్పు, ఓట్స్ – ముప్పావు కప్పు, వేడి నీళ్లు – 1 కప్పు, ఖర్జూరం – 1 కప్పు, వాల్నట్స్ – 1 కప్పు, అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 6 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఖర్జూరాలను శుభ్రం చేసి, గింజలు తీసి వేడి నీళ్లలో వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత అవిసె గింజల పొడిలో 6 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి. (అభిరుచిని బట్టి ఈ అవిసె గింజల మిశ్రమానికి బదులుగా ఒక గుడ్డును ఉపయోగించుకోవచ్చు) ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ బౌల్ తీసుకుని, అందులో బ్రౌన్‌సుగర్, బటర్, ఖర్జూరం వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత వాల్నట్స్, అవిసె గింజల మిశ్రమం యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేదాకా మరోసారి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్, మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బ్రౌన్‌సుగర్ మిశ్రమం కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓవెన్లో నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడకనిచ్చి మనకు కావల్సిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకోవాలి. బనానా డోనట్స్ కావలసినవి: అరటి పండ్లు – 2 (మీడియం సైజ్), గుడ్డు – 1, పాలు – పావు కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, వెనీలా సిరప్ – 1 టేబుల్ స్పూన్, మైదాపిండి – 1 కప్పు, పంచదార – అర కప్పు, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, దాల్చినచెక్క పొడి – పావు టీ స్పూన్, బటర్ – పావు కప్పుబ్రౌన్సుగర్ – పావు కప్పు, బెల్లం తురుము – 1 టేబుల్ స్పూన్చీజ్ – 2 టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్డు, పాలు, నూనె, వెనీలా సిరప్ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద బౌల్ తీసుకుని మైదా పిండి, పంచదార, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నాన్‌స్టిక్ బౌల్లో బటర్ వేసుకుని, అది కరిగిన తర్వాత బ్రౌన్ సుగర్, బెల్లం తురుము, చీజ్ వేసుకుని సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న మరో అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత డోనట్స్ షేప్ ట్రే తీసుకుని, అందులో కొద్దికొద్దిగా బటర్–çసుగర్ సిరప్ వేసుకుని, మూడు నాలుగు అరటిపండు ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అరటిపండు–మైదా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. డోనట్స్ తయారైన వెంటనే మిగిలి ఉన్న బటర్–సుగర్ సిరప్‌ను వాటిపై వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
దీర్ఘాయుష్ ఫలం!
స్ట్రాబెర్రీస్ రంగు, రుచి కారణంగా వాటిని ఎన్నో పానియాల్లో, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉపయోగిస్తుంటారు. అవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.. ఆరోగ్యానికీ అంతగానే మేలు చేస్తాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. స్ట్రాబెర్రీస్‌లోని గుండెకు మేలు చేసే ఎలాజిక్ యాసిడ్, యాంథోసయనిన్, క్యాటెచిన్, క్వార్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ కారణంగా అవి గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. రక్తనాళాలు బాగా విప్పారేలా చేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెన్) రాకుండా చూస్తాయి. స్ట్రాబెర్రీస్‌లోని శాల్సిలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్లు చర్మంపై మృతకణాలను తొలగించడంతో పాటు, మొటిమలు రావడాన్ని నివారిస్తాయి. అంతే కాదు.. దీర్ఘకాలం మేనిని మిలమిల మెరిసేలా చూస్తాయి. వీటిలో విటమిన్–సి చాలా ఎక్కువ. అది చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అందుకే స్ట్రాబెర్రీస్ తినేవాళ్లలో చర్మం ఆరోగ్యకరంగా, యౌవనంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ తినడం వల్ల చర్మానికి అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ కూడా దొరుకుతుంది. స్ట్రాబెర్రీస్ తినేవారిలో కంటినరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి వ్యాధులు నివారితమవుతాయి. కంట్లోని ఆక్యులార్ ప్రెషర్లో హెచ్చుతగ్గులు లేకుండా చూడటం ద్వారా గ్లకోమా వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. ఇందులో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అది రక్తపోటును అదుపులో ఉంచి హైబీపీని నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్‌లో ఉండే విటమిన్–సి, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ కారణంగా అది అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఆర్థరైటిస్, గౌట్ వంటి ఎముకల వ్యాధుల్లో ఉండే నొప్పిని గణనీయంగా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది. కీళ్లలో కందెన బాగా ఉత్పత్తి అయ్యేలా చూసి, అవి దీర్ఘకాలం పనిచేసేలా తోడ్పడుతుంది. స్ట్రాబెర్రీస్‌లోని ఫైటోకెమికల్స్ కారణంగా అవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీస్‌లోని పోషకాలు మనలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే హార్మోన్లను ఎక్కువగా స్రవించేలా చేస్తాయి. ఈ హార్మోన్లు కొవ్వును కరిగేలా చూస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకున్న వారికి స్ట్రాబెర్రీలు తినడం ఒక రుచికరమైన మార్గం. స్ట్రాబెర్రీలలోని పోషకాలన్నీ మన రోగనిరోధక శక్తిని బాగా పెంచేవే. అందుకే స్ట్రాబెర్రీలు తినేవారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. -
పండ్లు పాడవకుండా...
ఇంటిప్స్ మూడు కప్పుల నీళ్లలో ఓ కప్పు వెనిగర్ వేసి కలపాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ లాంటి పండ్లని ఈ నీటితో కడిగి, బట్టతో తుడిచి, ఆపైన మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే... కొన్ని వారాల పాటు పాడవకుండా ఉంటాయి.దుమ్ము కారణంగా కారు హెడ్‌లైట్స్ మీది అద్దాలు డల్‌గా అయిపోతే... ముందుగా టూత్‌పేస్ట్‌తో రుద్ది, ఆపైన మెత్తని బట్టతో తుడిచెయ్యాలి. అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి. కార్పెట్‌కి బబుల్గమ్ అతుక్కుపోతే... ఓ ఐస్‌ముక్క తీసుకుని, గమ్ మీద బాగా రుద్దండి. కాసేపటికి ఊడి వచ్చేస్తుంది.చెక్క గరిటెలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే... వాటిమీద కాస్త టేబుల్ సాల్ట్ చల్లి, టిష్యూ పేపర్‌తో తుడవాలి.