పండ్లు పాడవకుండా...
ఇంటిప్స్
మూడు కప్పుల నీళ్లలో ఓ కప్పు వెనిగర్ వేసి కలపాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ లాంటి పండ్లని ఈ నీటితో కడిగి, బట్టతో తుడిచి, ఆపైన మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే... కొన్ని వారాల పాటు పాడవకుండా ఉంటాయి.దుమ్ము కారణంగా కారు హెడ్‌లైట్స్ మీది అద్దాలు డల్‌గా అయిపోతే... ముందుగా టూత్‌పేస్ట్‌తో రుద్ది, ఆపైన మెత్తని బట్టతో తుడిచెయ్యాలి. అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి.
కార్పెట్‌కి బబుల్‌గమ్ అతుక్కుపోతే... ఓ ఐస్‌ముక్క తీసుకుని, గమ్ మీద బాగా రుద్దండి. కాసేపటికి ఊడి వచ్చేస్తుంది.చెక్క గరిటెలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే... వాటిమీద కాస్త టేబుల్ సాల్ట్ చల్లి, టిష్యూ పేపర్‌తో తుడవాలి.