Carpet
-
ప్రపంచపు అత్యంత భారీ కార్పెట్ ఇదే...
World Largest Carpet ప్రపంచంలోనే అతిపెద్ద కార్పెట్ మన దేశంలో రూపుదిద్దుకుంది. కార్పెట్ సిటీగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో పటోడియా కాంట్రాక్ట్ అనే సంస్థ ఈ భారీ కార్పెట్‌ను సాకారం చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు అయిన కజకిస్తాన్‌లోని నుర్–సుల్తాన్ మసీదు కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్‌మేడ్ కార్పెట్‌ను అందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశేషాలివే... మొత్తంగా 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో మెడాలియన్ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల నిఖార్పైన న్యూజిలాండ్ ఊల్ స్పన్ వినియోగించారు. దీనిని వెయ్యి మందికి పైగా కార్మికులు ఆరు నెలల పాటు నిర్విరామంగా శ్రమించి తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో ప్రధానంగా రెండు డిజైన్లు ఉంటాయి. మసీదులో కోర్ట్‌యార్డ్ సెంటర్‌పీస్‌గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే, జన్నత్ ఉల్ ఫిరదౌస్ స్ఫూర్తితో ఇంకో డిజైన్ ఉంటుంది. అతిపెద్ద కార్పెట్ కళ... ప్రపంచంలో ఇంతవరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్ధాయిలో హ్యాండ్‌మేడ్ కార్పెట్‌ను తీర్చిదిద్దిన సందర్భం లేదు. ఈ కార్పెట్‌కు సంబంధించి యార్న్ స్పిన్నింగ్ మొదలు, సైట్లో దాని ఇన్స్టాలేషన్ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్ నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం చేసిన ఈ కార్పెట్ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్, కార్నర్స్, ఫ్లోరింగ్, కన్వర్జింగ్ వాల్స్, పిల్లర్లు వంటివి పరిగణలోకి తీసుకుని కార్పెట్ తీర్చిదిద్దారు. పటోడియా కాంట్రాక్ట్ కంపెనీ 1881 నుంచి కార్పెట్ తయారీ రంగంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామి కార్పెట్ డిజైనర్లతో కలిసి పనిచేస్తోంది. -
కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి కార్పెట్ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. -
పండ్లు పాడవకుండా...
ఇంటిప్స్ మూడు కప్పుల నీళ్లలో ఓ కప్పు వెనిగర్ వేసి కలపాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ లాంటి పండ్లని ఈ నీటితో కడిగి, బట్టతో తుడిచి, ఆపైన మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే... కొన్ని వారాల పాటు పాడవకుండా ఉంటాయి.దుమ్ము కారణంగా కారు హెడ్‌లైట్స్ మీది అద్దాలు డల్‌గా అయిపోతే... ముందుగా టూత్‌పేస్ట్‌తో రుద్ది, ఆపైన మెత్తని బట్టతో తుడిచెయ్యాలి. అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి. కార్పెట్‌కి బబుల్గమ్ అతుక్కుపోతే... ఓ ఐస్‌ముక్క తీసుకుని, గమ్ మీద బాగా రుద్దండి. కాసేపటికి ఊడి వచ్చేస్తుంది.చెక్క గరిటెలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే... వాటిమీద కాస్త టేబుల్ సాల్ట్ చల్లి, టిష్యూ పేపర్‌తో తుడవాలి. -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
కార్పెట్ అలియాస్ టేబుల్
అసలే ఇరుకిళ్లు.. దాన్ని ఫర్నిచర్‌తో నింపేస్తే.. మరింత ఇరుకైపోతుంది. అలాంటిళ్ల కోసమే ఈ కార్పెట్. ఇది కార్పెట్.. అవసరమైనప్పుడు ఇలా టేబుల్‌గానూ మారిపోతుంది. దీన్ని ఇటలీకి చెందిన డిజైనర్ అలెగ్జాండ్రో ఐజోలా రూపొందించారు. కార్పెట్ల అంచుల్లో మడతలు పడటం వంటివి ఆయనకు నచ్చవట. దీంతో ఆ మడతలను కూడా అనుకూలంగా మార్చుకోవాలని డిసైడయ్యారు. అందుకే ఆ మడతలనే వంచితే.. టేబుల్లాగా మారేలా ‘స్టంబుల్ అపాన్’ అనే ఈ కార్పెట్‌ను తయారుచేశారు. ఈ కార్పెట్ కింది భాగం మెటాలిక్ తరహాలో ఉంటుంది. దీంతో దాన్ని మడవగానే.. టేబుల్ లుక్ వచ్చేస్తుంది. -
కార్పెట్ క్లీనింగ్!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో వాడే కార్పెట్ శుభ్రంగా లేకపోతే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తే ప్రమాదముంది. అందుకే కార్పెట్‌ను క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడవాలి. మరకలు పడితే వీలైనంత త్వరగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. నాణ్యమైన యాసిడ్, డిటర్జెంట్, షాంపూలనే కార్పెంట్ క్లీనింగ్‌కు వాడాలి. లేకపోతే రంగు పోయే ప్రమాదముంది. స్టీమ్ క్లీనింగ్‌తో కూడా కార్పెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్ క్లీన్ చేసే ముందు బ్రెష్ చేయడం కూడా మరవద్దండోయ్.