కార్పెట్ అలియాస్ టేబుల్
అసలే ఇరుకిళ్లు.. దాన్ని ఫర్నిచర్‌తో నింపేస్తే.. మరింత ఇరుకైపోతుంది. అలాంటిళ్ల కోసమే ఈ కార్పెట్. ఇది కార్పెట్.. అవసరమైనప్పుడు ఇలా టేబుల్‌గానూ మారిపోతుంది. దీన్ని ఇటలీకి చెందిన డిజైనర్ అలెగ్జాండ్రో ఐజోలా రూపొందించారు. కార్పెట్ల అంచుల్లో మడతలు పడటం వంటివి ఆయనకు నచ్చవట.
దీంతో ఆ మడతలను కూడా అనుకూలంగా మార్చుకోవాలని డిసైడయ్యారు. అందుకే ఆ మడతలనే వంచితే.. టేబుల్‌లాగా మారేలా ‘స్టంబుల్ అపాన్’ అనే ఈ కార్పెట్‌ను తయారుచేశారు. ఈ కార్పెట్ కింది భాగం మెటాలిక్ తరహాలో ఉంటుంది. దీంతో దాన్ని మడవగానే.. టేబుల్ లుక్ వచ్చేస్తుంది.