
లక్నో : ఉత్తరప్రదేశ్ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు.
ఈ పేలుడు ధాటికి కార్పెట్ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment