Bhadohi
-
దారుణం.. ప్రేమకు నిరాకరించిందని తుపాకీతో కిరాతకంగా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ భదోహిలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని 15 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిచంపాడు ఓ కిరతాకుడు. నుదుటిపై షూట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందుతుడ్ని 22 ఏళ్ల అరవింద్ విశ్వకర్మగా గుర్తించారు పోలీసులు. బాధితురాలి పేరు అనురాధ. ఈమె నిందితుడి సోదరితో పాటు కోచింగ్ సెంటర్కు వెళ్తోంది. ఓ రోజు తిరిగివస్తుండగా.. అనురాధ దగ్గరకు వెళ్లి అరవింద్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్ గన్ తీసి ఆమెను షూట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
వైరల్ వీడియో: లవర్ను కలిసేందుకు వచ్చి బుక్కయిన యువకుడు
-
వైరల్: లవర్ను కలిసేందుకు వచ్చి బుక్కైన ప్రియుడు
లక్నో: ప్రేమించుకున్నారు.. వారి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో అతడి నుంచి ఆమెను దూరం చేశారు. అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు అన్నీ విధాల ప్రయత్నించాడు. చివరకు ఇలా అయితే కుదరదని వేషం మార్చాడు. అబ్బాయి కాస్త అమ్మాయిలా తయారై తన లవర్ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే తప్పు చేశాడు. బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచూ వీరిద్దరు కలుసుకుంటుండడంతో అమ్మాయి ఇంట్లో తెలిసింది. తన ప్రేయసిని ఎలాగైనా చూడాలని ఆ యువకుడు పై విధంగా చేశాడు. అచ్చం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. జుట్టు మొదలుకుని వస్త్రధారణ, పాదరక్షలు, అమ్మాయిలు వాడే వస్తువులు ఇలా మొత్తం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. అయితే సాధారణంగా తయారైతే ఎవరూ గుర్తు పట్టకపోయి ఉండవచ్చు. కానీ నవ వధువు మాదిరి తయారై తమ ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు అనుమానించారు. ఏం కావాలి అని ప్రశ్నించగా తన ప్రేయసి పేరు చెప్పాడు. అయితే అప్పటికే కుటుంబసభ్యులు గుమిగూడడంతో అతడు కొంత కంగారుపడ్డాడు. ఈ క్రమంలో ముఖం కనిపించకుండా చున్నీ వేసుకుంటుండడంతో జుట్టు పక్కకు జరిగింది. ముఖం చూపించాలని కుటుంబీకులు పట్టుబట్టి తీసేందుకు ప్రయత్నించగా జుట్టు కిందపడిపోయింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. చున్నీ తీసి చూడగా ఆ యువకుడు కనిపించాడు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్త చదివిన వారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. మరికొందరు జాలి పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ కోసం ఈ మాత్రం తిప్పలు పడాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఏమున్నా ఆ అమ్మాయి కోసం అంత కష్టపడ్డాడంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడోనని నెటిజన్లు చెబుతున్నారు. ఇచ్చేయండి మీ పిల్లను అని సూచనలు చేస్తున్నారు. సినిమాలో మాదిరి సీన్ నిజ జీవితంలో జరగడంతో ఆ వీడియో వైరలయ్యింది. మీరు చూసేయండి. -
ఘోరం: మటన్ కత్తితో తమ్ముడు, మరదలితో పాటు
లక్నో: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడి కుటుంబంపై రగిలిపోయాడు. వారిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని మటన్ కోసే కత్తి తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించి తమ్ముడిని.. మరదలును వారి కుమారుడిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచేసి వారిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో చోటుచేసుకుంది. కజియానాలో నౌషద్, జమీల్ సోదరులు. నౌషద్ మటన్ వ్యాపారి. సోదరుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని నాశనం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం నౌషద్ తాను ఉపయోగించే మటన్ కత్తిని తీసుకుని జమీల్ (42), అతడి భార్య రూబీ (38)పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం జాలి కూడా లేకుండా ఏడాది వయసున్న తమ్ముడి కుమారుడిని కూడా పాశవికంగా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో వారు ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే నౌషద్ తన తల్లితో పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. -
ఐదుగురు పిల్లల్ని గంగానదిలోకి విసిరేసిన తల్లి
భోపాల్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి ఓ మహిళ తన ఐదుగురు పిల్లల్ని నదిలో తోసేసింది. ఈ ఘటన భాదోహి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాదోహి జిల్లా జహంగీరాబాద్ గ్రామానికి చెందిన మంజు యాదవ్, మృదుల్ యాదవ్లు భార్యాభర్తలు. గత ఏడాదిగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన మంజు యాదవ్ పిల్లల్ని నదిలోకి విసిరి చంపేయాలని నిర్ణయించుకుంది. శనివారం భార్యాభర్తల మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. దీంతో మంజు తన పిల్లలను గంగానది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలోకి విసిరేసింది. వారిలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. నదిలో గల్లంతైన మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారని జిల్లా ఎస్పీ రాం బదన్ సింగ్ తెలిపారు. ఏడాది కాలంగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారని చెప్పారు. పిల్లలను గంగలో తోసేసిన తర్వాత కూడా ఆమె అక్కడ నుంచి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. -
కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ భడోహి జిల్లాలోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. ఈ మధ్యాహ్నం కార్పెట్ ఫ్యాక్టరీ లోపల రహస్యంగా బాణాసంచా సామాగ్రి తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. దాంతో ఇంతకు ముందే భవనం లోపల భద్రపరిచిన టపాకాయలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగనట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి కార్పెట్ ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కుప్పకూలి పోగా.. చుట్టుపక్కల ఉన్న మరో మూడు ఇళ్లు కూడా నేలమట్టమైనట్టు తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. -
భదోహిలో వ్యాన్ ను ఢీకొన్న రైలు
-
భదోహిలో ఘోర ప్రమాదం
వ్యాన్ ను ఢీకొన్న రైలు ఏడుగురు చిన్నారుల మృతి భదోహి: ఉత్తరప్రదేశ్ లోని భదోహిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్ ను రైలు ఢీకొననడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాపలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యాన్ లో 19 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. పలువురు చిన్నారులు కూడా గాయపడినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
నీళ్లు తోడుకున్నాడని...
బదోహీ: ప్రభుత్వ చేతిపంపు నుంచి నీళ్లు తోడుకున్న దళిత యువకుడిపై కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లా ఆమ్వాలో ఆదివారం పంకజ్ ధాయ్కర్ నీళ్లు తోడుతుండగా కైలాస్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. పాథక్ తుపాకీతో ధాయ్కర్పై కాల్పులు జరిపి పారిపోయాడు. ధాయ్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు బాధ్యులై వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని భదోహీలో ఓ మహిళపై న్యాయవాది, కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ లు ఈ ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై జ్ఞాన్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.