
మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని భదోహీలో ఓ మహిళపై న్యాయవాది, కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ లు ఈ ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై జ్ఞాన్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.