దారుణం.. ప్రేమకు నిరాకరించిందని తుపాకీతో కిరాతకంగా.. | Uttar Pradesh Man Shot Dead Girl After She Reject Love Proposal | Sakshi
Sakshi News home page

దారుణం.. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని తుపాకీతో కిరాతకంగా..

Published Thu, Jan 19 2023 12:07 PM | Last Updated on Thu, Jan 19 2023 12:07 PM

Uttar Pradesh Man Shot Dead Girl After She Reject Love Proposal - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ భదోహిలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని 15 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిచంపాడు ఓ కిరతాకుడు.  నుదుటిపై షూట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

నిందుతుడ్ని 22 ఏళ్ల అరవింద్ విశ్వకర్మగా గుర్తించారు పోలీసులు. బాధితురాలి పేరు అనురాధ. ఈమె  నిందితుడి సోదరితో పాటు కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. ఓ రోజు తిరిగివస్తుండగా.. అనురాధ దగ్గరకు వెళ్లి అరవింద్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్ గన్ తీసి ఆమెను షూట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement