జ్యూసీ, జ్యూసీ స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కాస్త ఖరీదు ఎక్కువైనా సరే, ప్రతీ బైట్‌లోనూ నోట్లోకి జారే తీపి పులుపుతో కూడిన స్ట్రాబెర్రీ టేస్ట్‌ను ఆరగించాల్సిందే. అయితే స్ట్రాబెర్రీ పండ్ల మాదిరి గానే, ఆకుల్లోకూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. మరి అవేంటో చూద్దాం రండి!
స్ట్రాబెర్రీ ఆకులు విటమిన్ సీ విషయంలో స్ట్రాబెర్రీ పండుతో పోటీపడతాయట. సాధారణ ఆకు కూరల మాదిరిగానే, స్ట్రాబెర్రీ ఆకులూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది.
రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ ఆకులు మంచిది. విటమిన్ ఏ, కే, ఇనుము, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ ఆకుల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అంచనా.
స్ట్రాబెర్రీ ఆకులలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలకు, శక్తివంతమైన సెల్ ప్రొటెక్టర్‌లుగా పనిచేస్తాయి.
స్ట్రాబెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ గ్లెసీమియా (ప్రమాదకర అధిక రక్త చక్కెర స్థాయిలు) టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులతో ఉన్న వారికి మేలు చేస్తాయి.
డైజెస్టివ్ ఎయిడ్‌గా ఉపయోగపడతాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపర్చి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సన్నగా తరిగిన ఆకులు సలాడ్‌లలో యాడ్ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీలో కూడా వాడవచ్చు.
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్ట్రాబెర్రీ ఆకుల్లోని ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నోట్: సేంద్రీయంగా పండించిన తాజా స్ట్రాబెర్రీ ఆకులను వాడటం ఉత్తమం. లేదా వీటి ఆకులను వాడే ముందు పురుగుమందుల అవశేషాలనుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment