Strawberry fruit
-
స్ట్రాబెర్రీ పండే కాదు..ఆకులతో కూడా : డబుల్ ధమాకా
జ్యూసీ, జ్యూసీ స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కాస్త ఖరీదు ఎక్కువైనా సరే, ప్రతీ బైట్లోనూ నోట్లోకి జారే తీపి పులుపుతో కూడిన స్ట్రాబెర్రీ టేస్ట్‌ను ఆరగించాల్సిందే. అయితే స్ట్రాబెర్రీ పండ్ల మాదిరి గానే, ఆకుల్లోకూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. మరి అవేంటో చూద్దాం రండి!స్ట్రాబెర్రీ ఆకులు విటమిన్ సీ విషయంలో స్ట్రాబెర్రీ పండుతో పోటీపడతాయట. సాధారణ ఆకు కూరల మాదిరిగానే, స్ట్రాబెర్రీ ఆకులూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది.రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ ఆకులు మంచిది. విటమిన్ ఏ, కే, ఇనుము, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ ఆకుల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అంచనా.స్ట్రాబెర్రీ ఆకులలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలకు, శక్తివంతమైన సెల్ ప్రొటెక్టర్లుగా పనిచేస్తాయి. స్ట్రాబెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ గ్లెసీమియా (ప్రమాదకర అధిక రక్త చక్కెర స్థాయిలు) టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులతో ఉన్న వారికి మేలు చేస్తాయి. డైజెస్టివ్ ఎయిడ్‌గా ఉపయోగపడతాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపర్చి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సన్నగా తరిగిన ఆకులు సలాడ్లలో యాడ్ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీలో కూడా వాడవచ్చు. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్ట్రాబెర్రీ ఆకుల్లోని ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.నోట్: సేంద్రీయంగా పండించిన తాజా స్ట్రాబెర్రీ ఆకులను వాడటం ఉత్తమం. లేదా వీటి ఆకులను వాడే ముందు పురుగుమందుల అవశేషాలనుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. -
క్రమంగా పెరుగుతున్న స్ట్రాబెర్రీ సాగు..!
-
ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ సాగు.. రైతులకు ఊహించని లాభాలు
స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఎర్రని రంగుతో అత్యంత ఆకర్షవంతంగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ ఫల మాధుర్యం మనల్ని మరిచిపోనివ్వదు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఈ పంట ప్రస్తుతం మన రాష్ట్రంలో విస్తరిస్తోంది. కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతంలో పంట సాగు కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారుల సాయంతో రైతులు అధిక దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతం స్ట్రాబెర్రీ సాగులో దూసుకుపోతోంది. ఇక్కడ పండించే స్ట్రాబెర్రీ రుచి అద్భుతంగా ఉందని సీఎం నవీన్ పట్నాయక్ కొనియాడడం విశేషం. వాస్తవానికి దక్షిణ, నైరుతి ఒడిశా జిల్లాల కొండ చరియ ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు అనుకూల ప్రాంతాలు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొరాపుట్, నువాపడా జిల్లాల్లో స్ట్రాబెర్రీ పండించవచ్చు. దీంతో వాణిజ్యపరంగా ఇక్కడ పంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. 5 ఎకరాల్లో ప్రారంభం కొరాపుట్ జిల్లాలోని ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులు స్ట్రాబెర్రీ పండించడంలో రైతులకు శిక్షణ అందించి ప్రోత్సహించారు. తొలుత 5 ఎకరాల పొలంలో ఈ సాగు ప్రారంభించారు. పూణే నుంచి 55,000 స్ట్రాబెర్రీ మొక్కలు తెప్పించారు. 3 స్వయం సహాయక బృందాలు, 45 రైతు కుటుంబాలకు స్ట్రాబెర్రీ సాగు శిక్షణ కలి్పంచారు. 50 రోజుల స్వల్ప వ్యవధిలో సాగు ఫలితాలు కనిపించడంతో సాగుపై అసక్తి పెరిగింది. ఊహాతీత ఫలితాలు కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం కొటియాలో స్ట్రాబెర్రీ ప్రయోగాత్మక సాగు ఊహాతీత ఫలితాలు సాధించింది. వ్యవసాయం, రైతు సాధికారత విభాగం జిల్లా యంత్రాంగం క్రియాశీల సహకారంతో 20 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ అరబింద కుమార్ పాఢీ ఇటీవల కొటియా పర్యటన పురస్కరించుకొని స్టాబెర్రీ సాగు రైతులతో సమావేశమయ్యారు. స్ట్రాబెర్రీ సాగుకు పూర్తిస్థాయిలో సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. సాగు విస్తరణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతులు నారు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్ట్రాబెర్రీ సాగు ఒకసారి విజయవంతమైతే ఇతర పండ్ల సాగు కంటే చాలా లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్యాకెట్ ధర రూ.100 ప్రస్తుతం ఇక్కడ స్ట్రాబెర్రీ పంట లాభసాటిగా మారింది. ఒక చిన్న ప్యాకెట్ అమ్మకంతో రూ.100 వరకు లాభం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాదే టర్నోవర్ రూ.4.60 లక్షలకు తాకడం విశేషం. గత సీజన్లో కొరాపుట్ జిల్లా డోలియాంబ, జానిగూడ, గాలిగదూర్, ఫతుసినేరి గ్రామాల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు సంకలి్పంచినా 20 ఎకరాల్లో మాత్రమే సాగుకు అనుకూలించింది. ఈ విస్తీర్ణంలో 6 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా ప్రోగ్రామ్ కో–ఆర్డినేషన్ వర్గాలు తెలిపాయి. రుచి అద్భుతం: సీఎం నవీన్ పట్నాయక్ కొరాపుట్ జిల్లా కొటియా ప్రాంతంలో పండించిన స్ట్రాబెర్రీ పండ్లను సీఎం నవీన్ పటా్నయక్ రుచి చూశారు. రుచి అద్భుతంగా ఉందని కొనియాడారు. కొటియాలో స్ట్రాబెర్రీ పండించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్ట్రాబెర్రీ సాగుతో మన రైతులు తియ్యదనానికి కొత్త ఒరవడి దిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు ఇటువంటి వినూత్న మార్గాల్లో సాధికారత కలి్పంచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని కొనియాడారు. -
స్ట్రాబెర్రీతో ఇన్ని ప్రయోజనాలా? ఆరోగ్యంతో పాటు అందానికి కూడా
-
స్ట్రాబెర్రీ సాగుతో ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి
సాక్షి,అమరావతి: స్ట్రాబెర్రీ సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉన్నందున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంకు ఆమె స్ట్రాబెర్రీ పండ్లను బహూకరించారు. చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో గిరిజనులు ఎక్కువగా స్ట్రాబెర్రీ సాగుచేస్తున్నారని, దీనిని మరింత ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
బ్యూటీ ఇన్ మినిట్స్..
బ్యూటిప్స్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకొని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ను నివారిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం ఎప్పుడూ నిగనిగలాడుతుంది. * డార్క్ లిప్స్‌తో బాధ పడేవారికి ఇది సులువైన చిట్కా. మార్కెట్లో దొరికే లిప్‌బామ్స్ కంటే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. తయారీకి గ్లిజరిన్, బీట్రూట్ పౌడర్, పెట్రోలియం జెల్లీ చాలు. ఒక చిన్న గిన్నెలో పెట్రోలియం జెల్లీని వేసి వేడి చేయాలి. అది ద్రవంగా మారగానే, అందులో టీ స్పూన్ గ్లిజరిన్, అర టీ స్పూన్ డ్రై బీట్రూట్ పౌడర్ వేసి కలపాలి. చల్లారాక దాన్ని ఒక చిన్న బాటిల్లో తీసుకొని రోజూ అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ మీ సొంతం. * కొందరి జుట్టు నల్లగా కాకుండా రాగి రంగులో కనిపిస్తుంది. అలాంటి వారు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకుల పొడిని వేసి మరిగించాలి. ఆ వేడి చల్లారక ముందే, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపాలి. గోరువెచ్చని ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. ఉదయం లేచిన వెంటనే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. వారానికి మూడు సార్లైనా ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.