
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు.
బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.