సాక్షి, హైదరాబాద్: హిజ్రావద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చి సెల్‌ఫోన్ తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం–12లోని ఎన్‌బీటీనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్తి అగర్వాల్ అనే హిజ్రా వద్దకు శనివారం సాయంత్రం గుర్తుతెలియని యువకుడు వచ్చాడు.
తనను ఆశీర్వదించాలని హిజ్రాను కోరాడు. ఆమె ఆశీర్వదిస్తున్న సమయంలో పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆర్తి అగర్వాల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment