bike robbery
-
స్కూల్ కి వెళ్లే పిల్ల ఎంత పని చేసింది..!
-
బండిని ఇంత సింపుల్ గా ఎత్తుకెళ్లాడు ఏంటి..!
-
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
బైక్‌పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్..
హైదరాబాద్: దొంగతనం కోసం వచ్చిన దుండగులు ఇంటి యజమాని అప్రమత్తమై కేకలు వేయడంతో తాము వచ్చిన బైక్‌ను అక్కడే వదిలేసి పరారైన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ...షేక్‌పేట ఓయూ కాలనీ సమీపంలోని భగత్‌సింగ్ కమ్యూనిటీ హాల్ వద్ద నివసించే మెకానిక్ ఆంజనేయులు శుక్రవారం తెల్లవారుజామున అలికిడి రావడంతో లేచి చూశాడు. ఏసీ సందులో నుంచి ఓ చెయ్యి లోపలికి రావడం, తన పర్సును తస్కరించేందుకు యత్నించడంతో వెంటనే లేచి అరిచాడు. ఈ అరుపులకు ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారవుతుండగా ఆంజనేయులు బయటికి పరుగులు తీశాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తితో పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా గుర్తించాడు. ఇద్దరిని పట్టుకునేందుకు యత్నించగా వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దొంగతనానికి ఈ ఇద్దరూ వచ్చిన యాక్టివా బైక్‌ను అక్కడే వదిలేసి పోయారు. బాధితులు ఈ బైక్‌ను పోలీసులకు అప్పగించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫంక్షన్ హాల్ వద్ద బైక్ దొంగలించి అతి వేగంగా వెళ్లడంతో...
బీబీపేట (నిజామాబాద్): ద్విచక్ర వాహనం దొంగతనం చేసి తీసుకెళ్లే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ అదుపు తప్పి కిందపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం మాల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రమేష్ (31) బీబీపేటకు చెందిన గడీల బాస్కర్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఓ ఫంక్షన్ హాల్ వద్ద దొంగలించి అతి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపై కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి👉 లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా! -
బైకుల దొంగ.. 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ముండ్లమూరు: వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను అపహరించుకెళ్తున్న నర్రా సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం నిందితుడి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉల్లగల్లు ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ నెల 16వ తేదీ రాత్రి బైకు అపహరణకు గురికాగా అదే గ్రామానికి చెందిన బొట్ల నాగేశ్వరరావు స్థానిక పోలీసుస్టేషన్లో 17వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్శి సీఐ భీమానాయక్, ముండ్లమూరు ఎస్ఐ గంగుల వెంకటసైదులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, బి.ప్రేమానిధి, డి.అశోక్‌కుమార్, ఎస్కే ఖాశిం, కావిరాజు, టి. శ్రీనులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ వద్ద సేకరించిన ఆధారాల మేరకు మోటార్ సైకిళ్ల దొంగ కోసం వేట ప్రారంభించారు. చదవండి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు! శనివారం దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న దర్శి మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వర్రా సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.20 లక్షలు. నిందితుడు జిల్లాలోని చీరాల, చినగంజాం, అద్దంకి, చీమకుర్తి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ, నూజెండ్ల మండలాల పరిధిలో పలు మోటార్ సైకిళ్లను అపహరించాడు. స్వాధీనం చేసుకున్న 18 ద్విచక్ర వాహనాల్లో 11 వాహనాలకు సంబంధించి వివిధ పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఏడు బైకులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎంవీఐకి సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక టీమ్‌ను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు. వారికి రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు దర్శి సీఐ భీమానాయక్, ఎస్ఐ గంగుల వెంకటసైదులు, హెడ్‌కానిస్టేబుల్ సూర్యనారాయణ, సిబ్బంది అంజిబాబు, విజయ్‌కుమార్ ఉన్నారు. చదవండి: రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు -
‘ఇడియట్’ సినిమాలో అలీ లాగే..
సాక్షి, హైదరాబాద్: ‘ఇడియట్’ సినిమాలో కమెడియన్ అలీ దొంగలించిన బైక్‌లను చాకచక్యంగా ఎత్తుకెళ్తాడు. మార్గంమధ్యలో అడ్డగించిన పోలీసులు ఆ బైక్‌పై ఉన్న ఇసుకను మాత్రమే చూస్తారు కానీ.. బైక్ వివరాలు మాత్రం అడగరు. సరిగ్గా ఇదే తరహాలో ముగ్గురు దొంగలు ఇలాగే దొంగలించిన బైక్‌లను ఎత్తికెళ్లిపోదామనే పన్నాగం పన్ని పోలీసులకు చిక్కారు. ఆసీఫ్‌నగర్ పీఎస్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన బైక్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. ముగ్గురు దొంగలు దొరికారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన 12 ద్విచక్రవాహనాలను, ముగ్గురు నిందితులు ఎం.వెంకటేష్(22), వశీం అక్రమ అలియాస్ వసీం(27), సిరాజ్‌ఖాన్(28)లను సోమవారం మీడియాకు చూపించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం... దహిల్‌బాగ్ మహబూబ్ కాలనీకి చెందిన పాతనేరస్తుడు ఎం.వెంకటేష్ ఆసీఫ్‌నగర్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్నాడు. ఇతనిపై 12కు పైగా బైక్ చోరీ కేసులున్నాయి. కొద్దిరోజులు క్రితం బీదర్‌కు చెందిన వశీం అక్రం, సిరాజ్ ఖాన్‌లతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లొచ్చిన వెంకటేష్.. వసీం, సిరాజ్ఖాన్లతో కలిసి బైక్‌ల చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో పార్క్ చేసిన ఉన్న బైక్ తాళాలను వెంకటేష్ ఓపెన్ చేయడానికి యత్నిస్తాడు. తాళం వేస్తే ఈ విషయాన్ని వసీం అక్రం, సిరాజ్ఖాన్లకు సమాచారం ఇస్తాడు. వారు వచ్చి ఆ బైక్‌లను వేరే ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తారు. నగరంలో అమ్మితే సమస్యలు వస్తాయని వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇలా పట్టేశారు... ‘ఇడియట్’ సినిమాలో అలీ ఏ విధంగా అయితే బైక్‌లను దొంగలించి ఆ బైక్‌లపై బీదర్‌కు ఇసుకను తరలిస్తూ.. పోలీసులకు చిక్కినట్టే.. వీరు కూడా ఇసుక బస్తాలను దొంగలించిన బైక్‌లపై పెట్టుకుని బీదర్ వెళ్లి అమ్మాలని పథకం వేశారు. అయితే..పోలీసులు ఫొటో అండ్ ఎనాస్మెంట్ ద్వారా వీరిని పట్టుకున్నారని కమిషనర్ తెలిపారు. వెంకటేష్‌పై పలు ఠాణాల్లో కేసులు వెంకటేష్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. అతను సాధారంగా చేసేదంతా చోరీలే. ఇలా 2014 నుంచి చోరీలు చేస్తున్నాడు. వెంకటేష్‌పై మంగళ్‌హట్ పీఎస్‌లో 4 కేసులు, ఆసీఫ్‌నగర్ పీఎస్‌లో 3 కేసులు, రాయదుర్గం పీఎస్‌లో 2 కేసులు, లంగర్‌హౌస్, టప్పచబుత్ర పీఎస్‌ల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దొంగలించిన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కాగా.. 12 బైక్స్‌లో 11 బైక్‌ల సమాచారం మాత్రమే ఉంది. మరో బైక్ ఎక్కడ కొట్టేసింది స్పష్టత లేదు. -
అప్పుడే బెయిల్, అంతలోనే దొంగతనం
కరాచీ: ఓ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అతను కోర్టుకు కృతజ్ఞత తెలుపుదామనుకున్నాడో ఏమో కానీ వెంటనే కోర్టు ఆవరణలో ఉన్న ఓ బైకును ఎత్తుకెళ్లాడు. ఈ వింతైన ఘటన పాకిస్తాన్లో జరిగింది. కరాచీలోని సింధ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.. తాజాగా అతను విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యాడు. ఈ కేసులో పలు మార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు ఇన్నిరోజులు జైల్లో ఉన్నా అతని వక్రబుద్ధి మాత్రం అలాగే ఉంది. (అనస్థీషియా వైద్యుడి వీరంగం) బెయిల్ వచ్చినందుకు సంతోషపడటం మాని కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైకును ఎత్తుకెళ్లిపోయాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ దృష్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవగా ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు ఆ విధంగా కృతజ్ఞతలు తెలిపాడం'టూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ఈ దొంగోడు ఈ జన్మలో మారడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ దేశ రాజధాని కరాచీలో ప్రతి రోజు 90 బైకులు చోరీకి గురవుతాయని సిటిజన్ పోలీస్ లియాసిగ్ కమిటీ వెల్లడించింది. (యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..) -
జల్సాల కోసం దొంగతనాలకు..
నెల్లూరు(క్రైమ్): రెండేళ్లుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ముగ్గురు దొంగల బృందంలోని ఇద్దరు నిందితులను నెల్లూరులోని సీసీఎస్, నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, జి.రామారావులు వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లెకు చెందిన పి.వెంకటరత్నం, చంద్రగిరి మండలం అయితేపల్లి అగరాల గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి అలియాస్ పవన్ అలియాస్ చంటి, కోవూరు కోనమ్మతోటకు చెందిన వి.కిశోర్ అలియాస్ పెయింటర్ కిశోర్‌లు స్నేహితులు. వీరు బృందంగా రెండేళ్లుగా వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకుని జల్సాలు చేయసాగారు. వారి కదలికలపై సీసీఎస్ ఇన్స్పెక్టర్లు, నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్, నవాబుపేట ఎస్సైలు కె.శేఖర్‌బాబు, బి.శివప్రకాష్, రమేష్‌బాబు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచారు. మంగళవారం నిందితులు పి.వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్‌రెడ్డిలు ప్రశాంతినగర్ జంక్షన్లో ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించగా పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువచేసే బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లతోపాటు ఎస్సై కె.శేఖర్‌బాబు, ఏస్సై జె.వెంకయ్య, హెడ్ కానిస్టేబుల్స్ సయ్యద్‌వారీస్ అహ్మద్, ఆర్.సత్యనారాయణ, కానిస్టేబుల్స్ జి.నరేష్, ఎం.సుబ్బారావు, జి.అరుణ్‌కుమార్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. -
ఫంక్షన్ హాళ్లే టార్గెట్
దూద్‌బౌలి: ఫంక్షన్ హాళ్లను కేంద్రంగా చేసుకుని ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హుస్సేనీఆలం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి మైలార్‌దేవ్‌పల్లి కింగ్ కాలనీకి చెందిన మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ ఓ ఫంక్షన్ హాల్లో వీడియోగ్రాఫర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను వివాహాది శుభకార్యాలకు వచ్చే వారి బైక్‌లను చోరీ చేసి విక్రయించేవాడు. కొద్ది రోజుల క్రితం ఫతేదర్వాజాలోని మహరాజా ఫంక్షన్ హాల్లో ఓ శుభకార్యానికి హాజరైన మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి తన బజాజ్ సిటీ–100 వాహనం కనిపించకపోవడంతో హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సదరు వాహనానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్ పోస్టు ద్వారా అందింది. ఈ వాహనం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హుస్సేనీఆలం అడిషనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు మూసాబౌలి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా సదరు బైక్‌పై వెళుతున్న అబ్దుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ తనకు బైక్‌ను విక్రయించినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అఫ్జల్ ఆఫ్రిదిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, చాంద్రాయణగుట్ట పరిధిలో 2, చార్మినార్ పరిధిలో 1, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున దొంగిలించినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్సైలు రాము నాయుడు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ దొంగ.. పెట్రోల్ అయిపోగానే వదిలేస్తాడు..!
చోరీ చేయడం అతడికి సరదా..!దుకాణ సముదాయాలు.. పార్కింగ్‌ప్రదేశాల్లో ఉంచిన బైక్‌లను చాకచక్యంగా అపహరిస్తాడు.. అలా అని వాటిని విక్రయించి సొమ్ము చేసుకోడు.. తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్తాడు..మార్గమధ్యలో పెట్రోల్ అయిపోతే ఆ బైక్‌ను అక్కడే వదిలేసి మరో వాహనాన్ని చోరీ చేసి వెళ్తుంటాడు.. 22ఏళ్ల క్రితం ప్రారంభమైన అతడి చోరీల ప్రస్థానంలో రెండుసార్లు జైలుకెళ్లినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. తాజాగా మరో బైక్‌ను అపహరించి పోలీసులకు చిక్కాడు.. వివరాల్లోకి వెళితే. యాదగిరిగుట్ట (ఆలేరు) : అంతర్జిల్లా బైక్ దొంగను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు లు అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ లో గురువారం ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి వివ రాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరాల మురళీధర్‌రావు వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే క్రమంలో సరదా కోసం బైక్‌లను చోరీ చేయ డం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. 1998లో ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు బైక్‌లను దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మురళీధర్‌రావు తిరిగి 2002లో మళ్లీ అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు బైక్‌లను అపహరించి అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత 2017లో హైదరాబాద్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐదు బైక్‌లు చోరీ చేశాడు. భక్తుడి బైక్ అపహరించి.. ఇదే క్రమంలో 2019 డిసెంబర్ 21న జగిత్యాలకు చెందిన నరేష్ తన గ్లామర్ బైక్‌పై యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాడు. కొండపైన బైక్ పార్కింగ్ చేసి దర్శనానికి వెళ్లగా మురళీధర్‌రావు సదరు బైక్‌ను చోరీ చేసి తీసుకెళ్లాడు. నరేష్ తిరిగి వచ్చే సరికి బైక్ కనిపించకపోవడంతో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రోజు నుంచి బైక్ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనాల తనిఖీల్లో.. యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మురళీధర్‌రావు బైక్‌పై అక్కడికి చేరుకోగానే పోలీసులు విచారించారు. దీంతో అతడు తడబడటంతో అనుమానం వచ్చిన పోలీసులు బైక్‌కు సంబంధించిన పత్రాలను చూపెట్టాలని కోరగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కొండపై ఓ బైక్‌తో పాటు మరో 9బైక్‌లను అపహరించినట్లు అంగీకరించాడు. తన చోరీల ప్రస్థానాన్ని వివరించాడు. తాను ఒక్క బైక్‌ను కూడా విక్రయించలేదని.. సరదా కోసమే చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. పది బైకుల స్వాధీనం... మురళీధర్‌రావు అపహరించిన మొత్తం బైక్‌లను భువనగిరి టౌన్, కూకట్పల్లి, మియాపూర్, పటాన్‌చెర్వు, నిజామాబాద్ 4టౌన్ పోలీస్స్టేషన్లలో ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆ వాహనాలకు సంబంధించిన యజమానులు కోర్టు ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ పాండురంగారెడ్డి, సీసీఎస్ సీఐ పార్థసారథి, ఎస్ఐలు గుండెల రాజు, రవీందర్, సిబ్బంది సుందర్‌పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
జల్సాలకి అలవాటుపడి..
నెల్లూరు(క్రైమ్): వారు జల్సాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డారు. దీంతో దొంగలుగా అవతారమెత్తారు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకోవడం, మారుతాళాలతో ద్విచక్ర వాహనాలను అపహరించడం ప్రారంభించారు. గతంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలైనా వారిలో మార్పురాలేదు. తిరిగి దొంగతనాలు చేస్తుండగా శుక్రవారం నెల్లూరులోని నవాబుపేట పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని శెట్టిగుంటరోడ్డు జయప్రకాష్‌వీధికి చెందిన సీహెచ్ డింపు అలియాస్ రాహుల్, నవాబుపేట చాకలివీధికి చెందిన వి.దిలీప్, కిసాన్‌నగర్ పార్క్ సెంటర్‌కు చెందిన టి.దేవసునీల్, విజయనగరం జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి గ్రామానికి (ప్రస్తుతం నాలుగోమైలు) చెందిన ఎం.సురేష్‌లు, మరో ఇద్దరు మైనర్లు జల్సాలకు అలవాటుపడ్డారు. మారుతాళాలతో ద్విచక్రవాహనాలను దొంగలించి వాటిపై సంచరిస్తూ ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకోసాగారు. ఈ ఏడాది నిందితులు చిన్నబజారు, బాలాజీనగర్, నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు ద్విచక్రవాహనాలు, నవాబుపేట పరిధిలో రెండు సెల్ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. వరుస దొంగతనాలపై నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు రమేష్‌బాబు, మరిడినాయుడు, ఏఎస్సై రాజేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ తురకా శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ మోహన్, జితేంద్రలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితులు ప్రశాంతినగర్ హైవే వద్ద ఉన్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు వెళ్లి నలుగురు నిందితులతోపాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు అపహరించినట్లు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు విలువచేసే నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
సరదా కోసం బైక్‌ల చోరీ
చిలకలగూడ : ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిపై చక్కర్లు కొడుతున్న ఓ బాలుడిని అరెస్ట్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ చింతబావికి చెందిన బాలుడు (16)చదుకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పి జూలాయిగా తిరుగుతున్నాడు. అతడికి బైక్‌లపై తిరగడమంటే సరదా. అయితే బైక్ కొనే స్థోమత లేకపోవడంతో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి జాయ్‌రైడింగ్ చేసేవాడు. వాహనంలో పెట్రోలు ఎక్కడ అయిపోతే అక్కడే వాటిని వదిలేసేవాడు. ఠాణా పరిధిలో బైక్‌ల చోరీపై ఫిర్యాదులు అందడంతో డీఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడి కదలికలపై సమాచారం అందడంతో అతడిపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం సీతాఫల్మండి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగిలించిన వాహనంపై అటుగా వచ్చిన మైనర్ వారిని చూసి పరారయ్యేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అతడి నుంచి రెండు బైక్‌లపై స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఐ నర్సింహరాజు తెలిపారు. -
డ్రంక్ ఆండ్ డ్రైవ్‌లో పట్టుకున్నారని..
లంగర్‌హౌస్: చదువుతోంది డిగ్రీ...డ్రంక్ ఆండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తన వాహనాన్ని సీజ్ చేశారని ట్రాఫిక్ పోలీసులపై కక్ష పెంచుకున్నారు. కక్ష సాధింపు చర్యగా ఏకంగా ట్రాఫిక్ పోలీసుల నుంచే మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. చివరకు సిగ్నల్ జంప్ ఈ–చలాన్ నేరస్తులను పట్టించి కటకటాలపాటు చేసింది. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్, డీఎస్సై నరేందర్ వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ సర్దార్బాగ్లో నివాసముండే మొహమ్మద్ జహంగీర్(20) కారు మెకానిక్‌గా పనిచేస్తు చదువుకుంటున్నాడు. మారుతీనగర్‌లో నివాసముండే ధనరాం భాస్కర్(19) సనత్‌నగర్‌లోని శ్లోకం కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత ఫిబ్రవరి నెలలో మద్యంతాగి యాక్టివా వాహనంపై వస్తుండగా లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద టోలీచౌకీ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. జహంగీర్‌పై కేసు నమోదు చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకొని సంగం ఆలయం పక్కన ట్రాఫిక్ సీజ్ వాహనాల పార్కింగ్‌లో పెట్టారు. దీంతో పోలీసులపై కక్ష పెంచుకున్న జహంగీర్ జరిగిన విషయాన్ని భాస్కర్‌కు తెలిపాడు. ఎలాగయినా తన వాహనాన్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల తరువాత సంగం ప్రాంతాన్ని పరిశీలించిన జహంగీర్, భాస్కర్లు 24 గంటలు ట్రాఫిక్ పోలీసులు కాపలా ఉండటమే కాకుండా వాహనాలకు అడ్డుగా బారీకేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం గమనించారు. పక్కా ప్లాన్‌తో తెల్లవారుఝామున వాహనాల పార్కింగ్‌లోకి చొరబడ్డారు. పోలీసుల కళ్లు కప్పి తమ ద్విచక్రవాహనాన్ని వాగులోంచి దాటించి మూసీకి అటు వైపు చెట్ల నుండి తీసుకెళ్లారు. మరో రెండు రోజుల తరువాత సంగం వచ్చి పల్సర్ వాహనాన్ని చోరీ చేసి మూసీలోంచి అవతలి గట్టుకు తీసుకెళ్లి ఉడాయించారు. అయితే పల్సర్ వాహనదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా నిందితున్ని అరెస్టు చేసిన తరువాత అక్కడ చోరీ అయ్యింది ఒకటి కాదు రెండు వాహనాలు అని తెలియడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.కాగా ఈ చోరీకి భాద్యత వహిస్తు విదులు నిర్వహిస్తున్న హోంగార్డులు తమ వేతనాల నుండి భాదితునికి ద్విచక్ర వాహనాన్ని కొనిచ్చారు. తరువాత మరో బాలున్ని చేర్చుకొని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పార్కింగ్ నుండి మరో వాహనాన్ని చోరీ చేసి వాటిని అమ్మి హుక్కా సేవిస్తూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. లంగర్హౌస్తో పాటు నార్సింగి పరిధిలో రెండు కెటీఎం వాహనాలు, రెండు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను చోరీ చేశారు. ఈ చలాన్ పట్టించింది... కొద్ది రోజుల క్రితం చోరీ చేసిన వాహనంపై ఇద్దరూ తిరుగుతు మాసబ్‌ట్యాంక్ వద్ద సిగ్నల్ జంప్ చేశారు. ఈ చలాన్ ఆ«ధారంగా పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితులు మల్లేపల్లి వరకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు తివారి, నరేష్ బాబు, మదన్‌లు కొద్ది రోజులు ఆయా ప్రాంతాలలో డేగకన్నుతో తిరుగుతు చాకచక్యంగా నిందితులు భాస్కర్, జహంగీర్‌లను అదుపులోకి తీసుకున్నారు.వీరిని అరెస్టు చేసి 5 వాహనాలను సీజ్ చేశారు. -
అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది
సాక్షి, కడప : బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి లీలావతి (21) అనే యువతి బైకును ఆపింది. రిమ్స్‌లో తమ బంధువులు ఉన్నారని, అర్జెంటుగా వెళ్లాలని చెప్పి లిఫ్ట్ అడిగింది. దీంతో అతను ఆమెను బైకుపై ఎక్కించుకుని రిమ్స్‌కు బయలుదేరాడు. రిమ్స్‌లోని దంతవైద్య కళాశాల వద్దకు వెళ్లగానే అతనికి ఫోన్ రావడంతో బైకును అక్కడే ఆపి ఫోన్ మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన యువతి ఆ బైకును స్టార్ట్ చేసుకుని వేగంగా ఉడాయించింది. ఈ విషయంపై బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా, ఈనెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. నిందితురాలి పూర్తి వివరాలను తెలుసుకుని ఆమె కడపకు రాగానే పసిగట్టి శనివారం సాయంత్రం సింగపూర్ టౌన్షిప్ సర్కిల్ వద్ద అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సులో వెళ్లడం ఇష్టం లేక బైక్ చోరీ
హిమాయత్‌నగర్: తనసొంత గ్రామానికి బస్సులో వెళ్లడం ఇష్టం లేక ఓ యువకుడు బైక్ చోరీ చేశాడు. అయితే ఆ బైక్ మధ్యలోనే మొరాయించడంతో మరో బైక్ చోరీ చేసి గ్రామానికి వెళ్లాడు. తాజాగా దొంగిలించిన బైక్‌ను విక్రయిస్తుండగా నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..మెదక్‌జిల్లా శంకరంపేటకు చెందిన దుర్గాప్రసాద్ గత నెల 24న దోమలగూడలో ఉంటున్న తండ్రి, తమ్ముడి వద్దకు వచ్చాడు. 26న రాత్రి తన గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడిన అతను బస్సులో వెళ్లడం ఇష్టం లేక దోమలగూడ ప్రాంతంలో ఓ బైక్‌ను చోరీ చేశాడు. కొద్దిదూరం వెళ్లగానే ఆ బైక్ మోరాయించడంతో దానిని అక్కడే వదిలేసి సమీపంలో ఉన్న మరో బైక్‌ను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం కింగ్‌కోఠిలో చోరీ చేసిన బైక్‌ను విక్రయిస్తుండగా పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు బైక్‌ను దోమలగూడ ప్రాంతంలో దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐదు స్టేషన్లలో కేసులు... దుర్గప్రసాద్ బైక్‌లను దొంగలించడం కొత్తేమీ కాదు. 2013– 2015 మధ్య పలు ప్రాంతాల్లో ఐదు బైక్‌లను అపహరించాడు. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో 2, చిక్కడపల్లి పీస్ పరిధిలో 1, అఫ్జల్‌గంజ్, అబిడ్స్ పీఎస్ పరిధిలో ఒక్కోటి చొప్పున చోరీకి పాల్పడ్డాడు. నారాయణ గూడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్లొచ్చినా తన తీరు మార్చుకోకుండా నారాయణగూడ, చిక్కడపల్లి పీఎస్ పరిధిలో బైక్‌ల చోరీకి పాల్పడి పోలీసులకు దొరికాడు. గురువారం నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. -
ఎస్ఐ బైక్‌నే కొట్టేశార్రా బాబూ!
సాక్షి, చిత్తూరు అర్బన్ : చోరీలు జరిగితే ప్రజలు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మామూలు విష యం. కానీ పోలీసు అధికారే తన బైక్ చోరీకి గురైందంటూ పోలీసులను ఆశ్రయించడం కాస్త విభిన్నం. చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎస్ఐ రఘుకు ఇదే అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి తన పల్సర్ బైక్‌ను ఉషానగర్ కాలనీలో నివాసముంటున్న అపార్టుమెంటులో ఉంచి గదిలో పడుకున్నారు. గురువారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో ఆయన క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ కొట్టేసినోడికి అది ఎస్‌ఐదని తెలియదేమో మరి.. వాడు పట్టుబడాలేగానీ సినిమానే అని పోలీసులు పళ్లు కొరుకుతున్నారట! -
జాయ్ రైడర్లకు జైలు
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులైన వారిద్దరిలో ఒకరు మేజర్... మరొకరు మైనర్. బైక్‌లపై తిరగాలనే కోరిక ఉన్నా వీరికి ఆ స్థోమత లేదు... గంజాయి బానిసలైన వీరికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. దీంతో వీరిద్దరూ దొంగలుగా మారారు. కేవలం 12 రోజుల వ్యవధిలో నగర వ్యాప్తంగా నాలుగు బైక్‌ల దోపిడీ, ఓ సెల్‌ఫోన్ చోరీకి పాల్పడిన వీరిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా గండుపల్లికి చెందిన మామిడి ప్రణయ్ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. వీరి కుటుంబం ప్రస్తుతం సైనిక్‌పురి నిర్మలనగర్‌లో నివసిస్తుండగా ప్రణయ్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మద్యం, గంజాయి సహా అనేక దురలవాట్లకు బానిసైన అతడికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. ద్విచక్ర వాహనాలపై షికార్లు చేయాలనే కోరిక ఉన్నప్పటికీ ఇతడికి బైక్ లేదు. బైక్ కావాలని అడిగినా అడిగినా తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి లేకపోవడంతో జాయ్ రైడింగ్ కోసం బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. మరికొన్ని చిన్న చిన్న చోరీలు చేస్తూ జల్సా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థి అయిన మరో మైనర్ (16) కూడా ఇలాంటి నేపథ్యమే కలిగి ఉండి ఇతడితో జట్టు కట్టాడు. ప్రణయ్‌పై గతంలో కుషాయిగూడ ఠాణాలో ఒకటి, మైనర్‌పై రామ్‌గోపాల్‌పేట్, మియాపూర్, కుషాయిగూడ ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ముఠాగా ఏర్పడిన వీరి గత నెల 19 నుంచి మళ్లీ నేరాలు చేయడం మొదలెట్టారు. అదే రోజు చందానగర్ పరిధిలో బైక్‌ను చోరీ చేశారు. 21న రాత్రి దీనిపై తిరుగుతూ బేగంపేటలోని బైసన్‌పోలో గ్రౌండ్స్ వద్దకు వచ్చారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సెల్ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అడ్డగించిన వీరు ఆ ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దోపిడీ కేసు నమోదైంది. 25న దుండిగల్ పరిధిలో మరో బైక్, 30న తార్నాకలో ద్విచక్ర వాహనం చోరీ చేశారు. వీటితో పాటు మరో వాహనాన్ని వీరు తస్కరించినా దానిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. ఈ వాహనాలపై పెట్రోల్ అయిపోయే వరకు తిరిగే వీరు ఆపై ఏదో ఒక ప్రాంతంలో వదిలేస్తుంటారు. ఇలా చేసే వారిని సాంకేతిక పరిభాషలో జాయ్ రైడర్స్ అంటారు. బేగంపేట పరిధిలో నమోదైన దోపిడీ కేసు దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని వీరి నుంచి నాలుగు బైక్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
బైక్‌ల దొంగ అరెస్ట్
మియాపూర్: వ్యసనాలకు బానిసై బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా, కోస్గి మండలం, లింగంపల్లి తాండకు చెందిన నేనావత్ చందర్‌నాయక్ మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉంటూ స్విగ్గీలో డెలివరీబాయ్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను సులభంగా డబ్బు సంపాదించేందుకుగాను బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. వైన్స్‌షాపులు, ఇండిపెండెంట్ గృహాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో మియాపూర్ పీఎస్ పరిధిలో 13, బంజారాహిల్స్ పరిధిలో 1æ, చందానగర్ పరిధిలో 2, దుండిగల్ పరిధిలో 1æ, సికింద్రాబాద్ పరిధిలో 1æ బైక్ దొంగిలించాడు. చోరీ చేసిన వాహనాలను వికారాబాద్ పరిసర గ్రామాల్లో విక్రయించేవాడు. దీనిపై సమాచారం అందడంతో మియాపూర్ పోలీసులు ఈ నెల 19న పీఏనగర్ నుంచి జేపీనగర్ వెళ్లే రోడ్డులో చందర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను అంగీకరించాడు. అతడి నుంచి 18 బైక్‌లనుస్వాధీనం చేసుకున్నారు.నిందితుడి పై కేసు నమోదు చేసిరిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ రవికుమార్, సీఐ వెంకటేష్, డీఐమహేష్, క్రైం ఎస్ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ పి.చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి 7 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలపై ఎస్సైలు కె.రామారావు, డి.హరికృష్ణతో కలిసి నిఘా పెట్టామన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఇద్దరు బాలురు ఉండటంతో జువైనల్ హోంకు పంపిస్తున్నట్లు చెప్పారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మోటార్ సైకిల్స్ దొంగిలించిన తర్వాత వాటిపై తిరుగుతూ పెట్రోల్ అయిపోతే నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేస్తున్నారని చెప్పారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఆకివీడు మండలం గంగనామ్మకోడుకు చెందిన చింత నాని, కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సరిళ్ల రాజారత్నంను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ టి.ముత్యాలరాజును అభినందించారు. -
చోరీ చేసిన బైక్‌లతోనే స్నాచింగ్‌లు
గచ్చిబౌలి: బైక్‌లు చోరీ చేసి వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. బోరబండకు చెందిన దస్తగిరి, శివ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బండారి సాయిరాం అలియాస్ సాయి, మరో బాలుడు ముఠాగా ఏర్పడి బైక్‌ల చోరీ, చైన్, సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అపాచీ, యూనికాన్ బైక్‌లతో పాటు స్కూటీని చోరీ చేసిన వీరు అదే బైక్‌లపై కాలనీల్లో తిరుగుతూ తెల్లవారు జామున 4.30 గంటల నుంచి 5 .30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ Ðð వెళుతున్న మహిళల నుంచి ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇదే తరహాలో వీరు కేపీహెచ్‌బీ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్‌లు, బాచుపల్లి, మాదాపూర్, నార్సింగి పరిధిలో ఒక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు, మాదాపూర్ పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్ చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు నగలు, మూడు బైక్‌లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిపై 11 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన అతను జల్సాలకు అలవాటు పడి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న మహబూబ్ పాషా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీపీ ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. నేరాలను చేధించడమే కాకుండా నేరాల సంఖ్య తగ్గించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. 13 నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్‌లో 75వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో వాటి సంఖ్య లక్షకు చేరుకుంటుందన్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు స్థానిక పీఎస్‌లో సంప్రదిస్తే సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ దయానంద్‌రెడ్డి, కూకట్పల్లి ఏసీపీ బి. సురేందర్‌రావు, డీఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
దురలవాట్ల బారినపడి బైక్‌ల చోరీ
విజయనగరం, బొబ్బిలి: చిన్నతనంలోనే దురలవాట్ల బారినపడి, వాటిని తీర్చుకునేందుకు మోటరు సైకిళ్ల దొంగతనాలకు అలవాటు పడిన బాలలను అదపులోకి తీసుకున్నట్టు సీఐ దాడి మోహనరావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఇటీవల ఛేదించిన కేసు తాలుకా వివరాలు తెలియపర్చారు. ముగ్గురు బాలలు బొబ్బిలి, బాడంగి, చీపురుపల్లి, రాజాం, విజయనగరం స్టేషన్ల పరిధిలోని మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బైక్‌లను దొంగతనం చేసి వాటిని విక్రయించేవారు. ఇటీవల ఒక బైక్‌ను దొంగతనం చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్న తరువాత మొత్తం వారు దొంగతనం చేసిన బైక్‌ల గురించి కూపీ లాగితే 16 మోటారు సైకిళ్లను సదరు బాలలు దొంగిలించినట్టు తేలిందన్నారు. వీటి విలువ రూ.3.30 లక్షలు ఉంటుందని అంచనావేశారు. క్రైం హెచ్‌సీ శ్యామ్ సుందరరావు, కానిస్టేబుళ్లు, తిరుపతినాయుడు, చిన్నారావు, శ్రీరామ్‌లు బాలలను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అదుపులోకి తీసుకుని రికవరీ చేసినట్లు తెలిపారు. బాలలు కావడంతో వారి తల్లిదండ్రులకే సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లను న్యాయమూర్తి ఆదేశాలు, సూచనలతో మరికొద్ది రోజుల్లో యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. బాలలను సున్నితంగా విచారించి వారి నుంచి రికవరీ చేసేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లను సీఐ మోహనరావు అభినందించారు. -
రైడింగ్ కోసం బైక్‌ల చోరీ
హిమాయత్‌నగర్: బైక్‌పై తిరగడం అంటే అతడికి సరదా. ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టేందుకు సొంతంగా బైక్ లేకపోవడంతో ఓ యువకుడు బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. ఖర్చుల కోసం సెల్ఫోన్ల చోరీలను కూడా ఎంచుకున్నాడు. బైక్‌లు, సెల్ఫోన్లు చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి పలు మార్లు జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా పాత పంథానే అనుసరిస్తూ తాజాగా నారాయణగూడ పోలీసులకు చిక్కాడు మౌలాలీకి చెందిన మహ్మద్ అబ్థుల్ అమన్(18). చిన్నప్పటి నుంచే... 10వ తరగతి వరకు చదువుకున్న అమన్ ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాగా తిరిగేందుకు బైక్ రైడింగ్ నేర్చుకున్నాడు. ప్రతిసారి స్నేహితులను అడగడం ఇష్టం లేని అమన్ బైక్ చోరీలకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా 8 బైక్‌లను దొంగలించిన అతను ఇప్పటి వరకు మూడుసార్లు జైలుకు వెళ్లివచ్చాడు. చక్కర్లు కొట్టేందుకు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్ సైతం దొంగిలించేవాడు. వాచ్మెన్ ఇళ్లల్లో ఫోన్ల చోరీ... ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు ఫోన్ల చోరీకి శ్రీకారం చుట్టాడు. అపార్ట్మెంట్లలో వాచ్మెన్ ఇళ్లను ఎంచుకునే ఇతను ఇంటి తలుపు వేయకుండా బయట నిద్రస్తున్న వారిని గుర్తించి సెల్ఫోన్లు నగదు ఎత్తుకెళ్లేవాడు.. ఇప్పటి వరకు 25 సెల్ఫోన్లు, రూ.లక్ష పైగా నగదును చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు గంటల్లో పట్టివేత... సోమవారం తెల్లవారుజామున ఫరీద్‌బస్తీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వాచ్మెన్ గోపాల్ ఇంట్లోకి చొరబడిన అతను ఖరీదైన సెల్‌ఫోన్, రూ.11వేలు కాజేసి పరర్యాడు. గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా నిందితుడు ఎంఎస్.మక్తా బస్తీలో ఉన్నట్లు గుర్తించారు. కానిస్టేబుళ్లు శ్రీకాంత్, నర్సింహ్మా, వినోద్, బ్రహ్మయ్య అతడిని పట్టుకునేందుకు వెళ్లగా వీరిని చూసిన అమన్ తప్పించుకునేందుకు యత్నిస్తుండగా ఛేజ్ పట్టుకున్నారు. -
టార్గెట్ బుల్లెట్ బైక్..
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణం మండలం, కొడియాల్ గ్రామానికి చెందిన పేరినేని సందీప్ పాటిల్ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే అతను బైక్ చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో జైలుకు వెళ్లిన అతను ఇటీవల విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని సందీప్ తన పాత స్నేహితులు విజయ్, శివశంకర్‌లతో కలిసి తిరిగి చోరీల బాట పట్టాడు. గత రెండున్నర నెలల్లో బాలానగర్, సనత్‌నగర్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, అత్నూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 బుల్లెట్లు, 3 పల్సర్లు, దొంగిలించినట్లు తెలిపారు. గురువారం భాగ్యనగర్ కాలనీలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు నంబర్ లేని బుల్లెట్ బైక్‌పై వెళుతున్న సందీప్ పాటిల్, అతడి స్నేహితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడు విజయం పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ ప్రసన్న కుమార్, డీఐ రామకృష్ణ, ఎస్ఐ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.