
బైక్‌ను తీసుకుని వెళుతున్న యువకుడు
కడప అర్బన్ : కడప నగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్, లక్ష్మివిలాస్ బ్యాంక్‌ల సెల్లార్ కింద పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ చోరీకి గురైంది. యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కత్తి వెంకటసుబ్బయ్య అలియాస్ వెంకట్ తన బైక్‌ను తాను పని చేస్తున్న బ్యాంక్ సెల్లార్‌లో మధ్యాహ్నం 12:10 గంటలకు పార్కింగ్ చేశారు. తర్వాత ఆఫీసులోకి వెళ్లారు. 12:45కు భోజనానికి వెళ్లేందుకు మోటార్ సైకిల్ కోసం చూడగా.. అక్కడ లేకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించారు. పార్కింగ్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఓ యువకుడు రోజ్ కలర్ షర్ట్‌తో వచ్చి, ఎంచక్కా చోరీ చేసి తీసుకెళ్లాడు. బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment