
ప్రతీకాత్మక చిత్రం
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): లక్షల రూపాయల విలువైన బైక్ కొంటామని హైదరాబాద్‌కు బేరానికి వెళ్లినట్టే వెళ్లిన ఓ యువకుడు బైక్‌తో పరారయ్యాడు. అతని కోసం తెలంగాణ పోలీసులు విశాఖలో గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొడుకు పవన్ రూ.4.30లక్షల విలువైన బైక్‌ను కొంతకాలం క్రితం అమ్మకానికి పెట్టారు. అక్కడున్న ఓ స్నేహితుని ద్వారా సింహాచలానికి చెందిన సుమంత్ అనే యువకుడికి ఈ సంగతి తెలిసింది. తాను ఈ బైక్ కొనాలని వచ్చానని చెప్పడంతో పవన్ బైక్ చూపించారు. ఇదిగో ఒక సారి ట్రయిల్ వేసి వస్తానని చెప్పడంతో నిజమేనని పవన్‌న్‌బైక్ ఇచ్చారు. అంతే రోడ్డు మలుపు తిరిగి ఎంతకీ రాకపోవడంతో ఆయన గగ్గోలు పెట్టారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెక్ అనకాపల్లిలో ఉన్నట్టు గుర్తించారు. దీన్ని సుమంత్ వేకొకరికి అమ్మేసినట్టు సమాచారం తెలియడంతో తెలంగాణ పోలీసులతో వచ్చిన పవన్ అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, సుమంత్ కోసం సింహాచలంలో గాలింపు చర్యలు చేపడితే జాడలేదని తెలిసింది. సుమంత్ ఆచూకీ కోసం సహకరించాలని తెలంగాణ పోలీసులు సోమవారం రాత్రి గోపాలపట్నం పోలీసులను కోరారు. దీంతో గాలింపు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment