
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి
విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు.
దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.
నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు
లక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు.