
సాక్షి, చిత్తూరు అర్బన్ : చోరీలు జరిగితే ప్రజలు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మామూలు విష యం. కానీ పోలీసు అధికారే తన బైక్ చోరీకి గురైందంటూ పోలీసులను ఆశ్రయించడం కాస్త విభిన్నం. చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ రఘుకు ఇదే అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి తన పల్సర్ బైక్‌ను ఉషానగర్ కాలనీలో నివాసముంటున్న అపార్టుమెంటులో ఉంచి గదిలో పడుకున్నారు. గురువారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో ఆయన క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ కొట్టేసినోడికి అది ఎస్‌ఐదని తెలియదేమో మరి.. వాడు పట్టుబడాలేగానీ సినిమానే అని పోలీసులు పళ్లు కొరుకుతున్నారట!
Comments
Please login to add a commentAdd a comment