
చిల్లకూరు (చిత్తూరు): సార్ మీరే మాకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట గురువారం చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు..మండలంలోని తీర ప్రాంత గ్రామామైన తమ్మినపట్నం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు డ్యాన్స్ ఈవెంట్లు చేస్తూ జీవనం చేస్తున్నాడు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందన అనే యువతి పరిచయమైంది. ఇరువురు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో తమ ప్రేమ విషయం తెలియజేశారు.
అయితే యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక, పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో యువతి ఇంటి నుంచి నేరుగా ప్రశాంత్ ఉండే ప్రాంతానికి వచ్చి విషయం తెలియజేసింది. ఇరువురు గ్రామ సమీపంలోని ఆలయంలో వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి యువకుని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఇద్దరు మేజర్లు అని వారిని ఇబ్బంది పెట్టొద్దని సర్దిచెప్పి పంపారు. యువతి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.
చదవండి: (Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి)
Comments
Please login to add a commentAdd a comment