chillakuru
-
బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?
సాక్షి, చిత్తూరు(చిల్లకూరు): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట విషం తాగి తనువు చాలించిన ఘటన గురువారం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పొయ్య గిరిజన కాలనీకి చెందిన శివమణి, మారెక్క పెద్ద కుమారుడు మారప్ప(26), అదే కాలనీకి చెందిన వెంకటరమణయ్య, చెల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె వనజ (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. బాలికకు యుక్తవయసు రాలేదని, కొంత కాలం ఆగాలని పెద్దలు సూచించారు. అయితే వారి సూచనలు పట్టించుకోని ప్రేమ జంట కుటుంబ సభ్యులకు తెలియకుండా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిల్లకూరు మండలం, తమ్మినపట్నం పంచాయతీ, గుమ్మళ్లదిబ్బలో తమకు తెలిసిన భవన నిర్మాణ కార్మికుడు మేకల వెహేసువ ఇంట్లో ఉంటూ స్థానికంగా రొయ్యల గుంటల్లో పనిచేసుకుని జీవనం సాగించారు. ఏమైందో తెలియదు కానీ గ్రామానికి సమీపంలోని కాలువ దగ్గర పురుగుల మందు తాగి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రేమికులిద్దరూ బతుకుపై బెంగపెట్టుకుని చావుని ఎంచుకున్నారా..? కుటుంబ సభ్యులు ఎవరైనా బెదిరించారా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. చదవండి: (వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ముగ్గురు యువకులేనా?) -
డ్యాన్స్ ఈవెంట్లు చేస్తూ జీవనం.. స్పందనతో పరిచయమై..
చిల్లకూరు (చిత్తూరు): సార్ మీరే మాకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట గురువారం చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు..మండలంలోని తీర ప్రాంత గ్రామామైన తమ్మినపట్నం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు డ్యాన్స్ ఈవెంట్లు చేస్తూ జీవనం చేస్తున్నాడు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందన అనే యువతి పరిచయమైంది. ఇరువురు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో తమ ప్రేమ విషయం తెలియజేశారు. అయితే యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక, పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో యువతి ఇంటి నుంచి నేరుగా ప్రశాంత్ ఉండే ప్రాంతానికి వచ్చి విషయం తెలియజేసింది. ఇరువురు గ్రామ సమీపంలోని ఆలయంలో వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్ఐ సుధాకర్‌రెడ్డి యువకుని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఇద్దరు మేజర్లు అని వారిని ఇబ్బంది పెట్టొద్దని సర్దిచెప్పి పంపారు. యువతి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: (Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి) -
తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?
చిల్లకూరు (తిరుపతి): జీవాలు మేపుకునేందుకు వెళ్తున్న గిరిజన బాలుడు తన తోటలో ఉన్న కోడిని దొంగిలించాడన్న అనుమానంతో తోట యజమాని ఆ బాలుడిని నిర్బంధించి, విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం, కడివేడు పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లవరపుకండ్రిగకు చెందిన బుర్రి రామకృష్ణ అనే వ్యక్తికి పంచాయతీ పరిధిలోని రాజగోపాల్‌రెడ్డి గిరిజన కాలనీ సమీపంలో నిమ్మ తోట ఉంది. అదే కాలనీకి చెందిన తల్లిదండ్రులు లేని మైనర్ బాలుడు తన అన్న వెంకటేశ్వర్లుతో కలిసి మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మేకలు మేపేందుకు వెళ్తున్న సమయంలో సమీపంలోని నిమ్మ తోట యజమాని బాలుడిని పట్టుకుని తన తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా? అంటూ విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. దెబ్బలకు తాళ లేక కేకలు వేయడంతో కాలనీలోని వారు గుర్తించి అక్కడికి వచ్చి యజమానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గ్రామానికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నచ్చజెప్పి బాలుడిని విడిపించాడు. దీంతో బాలుడి సమీప బంధువులతో కలసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని.. ఇప్పుడే పెళ్లి వద్దని..) -
భూ కుంభకోణం కేసులో మరొకరి అరెస్ట్
చిల్లకూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం భూ కుంభకోణం కేసులో మరో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చిల్లకూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినపట్నం సమీపంలో ఉన్న పోర్టు భూములను వెబ్‌ల్యాండ్‌లో మార్పులుచేసి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. దీనిపై గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇప్పటికే నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో పొదలకూరు రెవెన్యూ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సాసం నరసయ్యను మంగళవారం చిల్లకూరు బైపాస్ వద్ద సీఐ శ్రీనివాసులరెడ్డి అరెస్ట్ చేశారని తెలిపారు. రాపూరు మండలం సైదాసుపల్లి గ్రామానికి చెందిన సాసం నరసయ్య నెల్లూరులో ఉంటున్నారని, ఆయనే చిల్లకూరు రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌ను నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి సర్వే నంబర్ 94–3లో ఉన్న 271.80 ఎకరాల్లో 209 ఎకరాలను 327 సర్వే నంబర్‌కు మార్చి 327–3ఏ2–హెచ్1–హెచ్11 సబ్ డివిజన్ చేసి ఆన్లైన్లో 11 మంది పేర్లతో నమోదు చేశారని వివరించారు. ఈ కేసులో తహసీల్దార్ గీతావాణి, నరసయ్య, శేఖరరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అజయ్‌కుమార్ ఉన్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ
చిల్లకూరు: వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట వద్ద బుధవారం జరిగింది. చిల్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు గూడూరు వెళ్లారు. బుధవారం అక్కడ్నుంచి ఆటోలో స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. నాంచారంపేట వద్దకు వచ్చేసరికి.. గూడూరు బైపాస్‌లోని సిలికా యార్డులో ఇసుక లోడ్ చేసుకునేందుకు వెళ్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏరూరు గ్రామానికి చెందిన మామిడాల బుజ్జమ్మ (55), కలవకొండకు చెందిన ముడి శిఖామణి(52) అక్కడికక్కడే మృతి చెందారు. బల్లవోలుకు చెందిన భారతి(38)ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. మిగిలిన వారికి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ
నలుగురికి గాయాలు చిల్లకూరు : ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ మినీ లారీ వేగంగా వచ్చి వెనుక వైపు ఢీకొనడంతో లారీలోని ఓ వ్యక్తితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు గూడూరు డిపోకి చెందిన బస్సు ముత్తుకూరుకు వెళ్తుంది. నాంచారమ్మపేట వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిలవగా అదే సమయంలో బెస్తపాళెంలోని రొయ్యల గుంతల వద్దకు ఐస్ తీసుకెళ్తుతున్న మినీలారీ వేగంగా వచ్చి బస్సును వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన విద్యార్థులు శ్రావణి, వినీత, అనూష ముందుకు పడి గాపడ్డారు. లారీలో ఉన్న పోలయ్య గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 సిబ్బంది గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
సిలికా లారీల పట్టివేత
చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక లోడుతో సిలికా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలను చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటికి అపరాధ రుసుము విధించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
చిల్లకూరు : ‘నాకు పనుంది బైక్‌పై నెల్లూరు వెళ్తా.. మీరు ఆటోలో వచ్చేయండి’ చెప్పిన వ్యక్తి కొంతసేపటికి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. సంఘటన మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు శ్రామిక్‌నగర్‌కు చెందిన ఎంబేటి మురళి (30) లారీ డ్రైవర్‌గా పనిచేన్నాడు. అతని భార్య పోలమ్మ, తమ ముగ్గురు పిల్లలైన చరిత, ఏసు, శరత్‌కుమార్‌లను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని ఆదివారం గూడూరు మండలం అయ్యవారిపాళెంలోని బంధువుల ఇంటి వచ్చారు. పోలమ్మ అక్క పిల్లలు చిట్టేడు గిరిజన గురుకుల పాఠశాలలో చదవుతుండగా వారిని చూసేందుకు బంధువులతో కలిసి భార్య పిల్లలను ఆటోలో చిట్టేడుకు పంపాడు. మురళి బైక్‌పై వెళ్లినప్పటికీ అర్జెంటు పని ఉందని చిట్టేడు నుంచి ఒంటరిగానే నెల్లూరుకు బయలుదేరి ఆటోలో భార్య, పిల్లలను నెల్లూరుకు రావాలని చెప్పాడు. ఈ క్రమంలో మురళి కోట క్రాస్‌రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా చెన్నె వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్‌ను గమనించకుండా ఢీకొట్టింది. ఈ ఘటనలో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకనే ఆటోలో వస్తున్న భార్య, పిల్లలు అక్కడి చేరకుని మృతదేహాన్ని చూసి బోరు విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలానికి చేరకుని వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
చిల్లకూరు : మండలంలోని వల్లిపేడులో శుక్రవారం బ్యాల వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. వల్లిపేడుకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడికి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్లతో బాలికతో ఈ నెల 25న వివాహం జరిపించేందుకు వారి తల్లిదండ్రులు నిశ్చియించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ సీతాలక్ష్మి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూపర్వైజర్ సీతాలక్ష్మి, వీఆర్వో సుబ్బయ్య, కానిస్టేబుళ్లు సాయినాథ్, కిషోర్ గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రలతో మాట్లాడారు. యువకుడి తల్లిదండ్రలకు అవగాహన కల్పించి ఇద్దరికి వివాహం జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి మరో రెండేళ్ల పాటు వివాహం చేయమని వారి వద్ద లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు వాణి, పరమేశ్వరి పాల్గొన్నారు. -
నాలుగు సిలికా లారీలు పట్టివేత
చిల్లకూరు : నిబంధనలకు విరుద్ధంగా సిలికాను తరలిస్తున్న నాలుగులారీలను శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. తీరప్రాంత గ్రామాల్లోని గనుల నుంచి అధికలోడుతో పాటు సరైన ధ్రువీకరణపత్రాలు సిలికాను తర లిస్తున్న నాలుగు లారీలను విజిలెన్స్ డీఎస్పీ వెంకట్‌నాథ్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఏజీ రాములు పట్టుకున్నారు. వాటిలో ఒక లారీని రవాణాశాఖాధికారులకు అప్పగించారు. మరోలారీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేదిగా తెలిసింది. లారీని పట్టుకున్నట్లు తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి ఎలాంటి జరిమానా విధించలేదని సమాచారం. మరో రెండు లారీలను మాత్రం చిల్లకూరు పోలీసులకు అప్పగించి గనులశాఖకు సిపార్సు చేశారు. ఎమ్మెల్యే లారీ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులను వివరణ కోరేందకు ప్రయత్నించగా వారు అందుబాటుకి రాలేదు. -
బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల ఫిర్యాదు
నెల్లూరు : ఓ ప్రయివేటు బస్పు డ్రైవర్ పై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి బస్సు నడుపుతున్న బస్సు డ్రయివర్‌పై ప్రయాణికులు సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వడదెబ్బతో ఏడుగురి మృతి
చిలుకూరు, న్యూస్‌లైన్: మండలంలోని నారాయణపురంలో శనివారం ఓ మహిళ వడదెబ్బతో మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూర నాగమణి (55) రెండు రోజుల క్రితం పాలారంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురైంది. అక్కడి నుంచి స్వగ్రామం వచ్చిన నాగమణి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. చిల్లేపల్లిలో... చిల్లేపల్లి, (నేరేడుచర్ల): మండలంలోని చిల్లేపల్లి గ్రామానికి చెందిన బండా ఈశ్వరమ్మ(52) వడదెబ్బతో మృతి చెందింది. శుక్రవారం ఉపాధి పనులకు వెళ్లిన ఈశ్వరమ్మ.. ఇంటికి వచ్చిన అనంతరం అస్వస్థతకుగురైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతిపట్ల ఉపాధిహామీ ఏపీవో శేఖర్ సంతాపం ప్రకటించారు. చల్లూరులో... చల్లూరు(రాజాపేట): మండలంలోని చల్లూరులో మీస అయిలయ్య (55) అనే వికలాంగుడు రోజు మాదిరిగానే శుక్రవారం మేకలు తోలుకుని అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వల్లాపురంలో... వల్లాపురం(నడిగూడెం): మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన నూకపంగు తిరపమ్మ(70) మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. ఆమె ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కనగల్‌లో... కనగల్: మండలంలోని పడిగిమర్రిలో సుంకిరెడ్డి చంద్రారెడ్డి(62) అనే వృద్ధుడు శనివారం వడదెబ్బతోమృతి చెందాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినట్లు స్థానిక సర్పంచ్ జగాల్‌రెడ్డి తెలిపారు. పాల సంఘం చైర్మన్ మృతి కప్రాయపెల్లి(ఆత్మకూరు(ఎం): మండలంలోని కప్రాయపెల్లి పాల సంఘం అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి(48) వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందా రు. శుక్రవారం పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం అతనికి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో మోత్కూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మందడి నర్సిరెడ్డి తెలుగు రైతు మండల అధ్యక్షుడిగాను కొనసాగారు. అంత్యక్రియలు శనివారం కప్రాయపెల్లిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో స్థానిక సర్పంచ్ బొట్టు మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు కాంభోజు భాగ్య శ్రీ, వివిధ పార్టీల నాయకులు పూర్ణచందర్ రాజు, హేమలత, బొట్టు అబ్బయ్య, కాంబోజు భాను, నూనెముంతల బుచ్చిరాములు పాల్గొన్నారు. మిర్యాలగూడలో... మిర్యాలగూడ: పట్టణంలో ని ఈదులగూడకు చెందిన పుట్టపాక పార్వతమ్మ (65) వడదెబ్బతో మృతి చెందిం ది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పశువుల వద్దకు వెళ్లిన పార్వతమ్మ వడదెబ్బకు గురైంది. స్పృహ కోల్పయి మధ్యాహ్నం మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.