సిలికా లారీల పట్టివేత
సిలికా లారీల పట్టివేత
Published Sun, Sep 18 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక లోడుతో సిలికా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలను చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటికి అపరాధ రుసుము విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement