siezed
-
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
-
మటన్ కొనేటప్పుడు జాగ్రత్త!
సాక్షి,విజయవాడ: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టును కార్పొరేషన్ అధికారులు శనివారం రట్టు చేశారు. విజయవాడకు అక్రమంగా తరలించిన పోటెళ్ళ తలలు ,కాళ్ళును స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లో వచ్చిన పదహారు బాక్సులను పట్టుకున్నారు. సీజ్ చేసిన పదహారు బాక్సులను వీఎంసీ సిబ్బంది నిర్జన ప్రదేశంలో పూడ్చేశారు. వీటిని యూపీ నుంచి ఢిల్లీకి, అక్కడినుంచి విజయవాడ కు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసం అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ మాఫియా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కబేళాలోని మాంసం మాత్రమే కొనుగోలు చేయాలని వీఎంసీ అధికారులు సూచించారు. చదవండి: అద్దె మాఫీ.. వారికి ఉపశమనం.. -
మళ్లీ నియమాలు ఉల్లంఘించబోమంటూ..
-
ఉల్లంఘనులకు శుభవార్త
కర్ణాటక, బనశంకరి: లాక్డౌన్ అమలైనప్పటి నుంచి పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి అప్పగిస్తామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ తెలిపారు. గురువారం నగరంలో మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ చేసిన బైక్‌లు, కార్లు తదితరాలను లాక్డౌన్ ముగిసే వరకు వాహనాలను వెనక్కి ఇచ్చేది లేదని, కోర్టు ద్వారానే విడిపించుకోవాలని గతంలో ప్రకటించడంతో వేలాది మంది వాహనదారుల్లో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ఈ తరుణంలో శుభవార్తను వినిపించారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అనుమతి మేరకు వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నామని, కానీ అంతకు ముందు వాహనాల రికార్డులు పరిశీలించి వెనక్కి ఇస్తామన్నారు. బెంగళూరులో ఇప్పటి వరకు లాక్ డౌన్ నుంచి 47 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.(5,88,989 ఉల్లంఘనలు) -
ఆర్టీఓ తనిఖోల్లో 8 బస్సులు సీజ్
-
గోమతి సినిమా థియేటర్ మూత
తిరువొత్తియూరు: కడలూరులో పైరసీ సీడీలు తయారు చేస్తున్న గోమతి సినిమా థియేటర్‌కు పోలీసులు సీలు వేశారు. తమిళనాడులో పైరసీ సీడీల విక్రయం ఎక్కువైంది. రెండు వారాల ముందు విడుదలైన ఒరు కుప్పై కథై చిత్రం ఇంటర్నెట్లోను, పైరసీ సీడీలలోను విడుదలైంది. దీంతో చిత్ర నిర్మాత మంగళవారం కడలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో విదేశాలకు పేటెంట్ హక్కు ఇస్తే దాని ద్వారా దొంగతనంగా సినిమా లీక్ అవుతుందన్నారు. ఈ చిత్రానికి విదేశీ హక్కు జారీ చేయలేదని కాని ఇంటర్నెట్లో పైరసీ సీడీల మూలంగా సినిమా బయటకు రావడం దిగ్భ్రాంతిని కలుగచేసిందని పేర్కొన్నారు. ఆ డీవీడీలను పరిశీలించగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మయిలాడుదురై గోమతి థియేటర్లో పైరసీ సీడీలు తయారు అవుతున్నట్టు తెలిసిందన్నారు. దీంతో పోలీసులు బుధవారం గోమతి థియేటర్లో తనిఖీ చేయగా పైరసీ సీడీలు తయారుచేస్తున్నట్టు తెలిసింది. దీంతో సినిమా థియేటర్‌కు సీలు వేసి ఇద్దరిని అరెస్టు చేశారు. -
కల్తీ మద్యం సీసాల పట్టివేత
కావలిరూరల్ : పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు తన బృందంతో దాడి చేసి గురువారం పట్టుకున్నారు. కావలిలోని పలు మద్యం దుకాణాల్లో మద్యాన్ని డైల్యూట్ చేసి విక్రయిస్తున్న ట్లుగా కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అను వైన్స్‌పై అధికంగా ఫిర్యాదులు అందడంతో ఎక్సై జ్ అధికారులు గురువారం నిఘా పెట్టారు. ఉదయం షాపు తెరిచిన వెంటనే గుమస్తా లోపలికి వెళ్లి షట్టర్‌ను మూసివేశాడు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో 30 మి.లీ.ల మద్యాన్ని బయటకు తీసి అంతే పరిమాణంలో నీటిని నింపి తిరిగి సీల్‌ను యధాతథంగా బిగించి పెట్టాడు. రబ్బర్ ట్యూబ్ ముక్కతో బాటిల్ మూతను చాకచక్యంగా తీసి కల్తీ చేశాక, అంతే చాకచక్యంగా అమర్చాడు. మద్యం విక్రయించే సమయం కాగానే షాపును ఓపెన్ చేసి తొలుత కల్తీ చేసిన మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టాడు. ఎక్సైజ్ సిబ్బంది కస్టమర్లా వెళ్లి క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి హైడ్రోమీటర్‌తో పరీక్షించగా 25 శాతం ఉండాల్సిన నీటి పరిమాణం 37 శాతంగా ఉంది. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో షాపుపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ జరిగిన ఇంపీరియల్ బ్లూ మద్యం 25 క్వార్టర్ బాటిళ్లు, ఓటీ విస్కీ 12 క్వార్టర్ బాటిళ్లు మొత్తం 37 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గుమస్తా బడెకల శ్రీనును అరెస్టు చేశారు. షాపు యజమాని మందాడి హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్, కావలి ఎక్సైజ్ ఎస్సై ఎస్ శ్రీని వాసులు, సిబ్బంది పాల్గొన్నారు. డైల్యూషన్ ఇలా.. మద్యంలో 25 శాతం వరకు నీటి పరిమాణం ఉంటుంది. నిబంధనల ప్రకారం అంతకు మించి ఉండరాదు. అయితే సీసాలో కొంత మేర మద్యం తీసి వేసి అందులో నీటిని ని ంపుతారు. ఇలా మద్యాన్ని నీటితో కల్తీ చేయడాన్ని డైల్యూషన్ అంటారు. అలాగే ఇంకో విధానంలో క్వార్టర్ అధికంగా ఉండే ప్రీమియం బ్రాండ్స్ మద్యంలో తక్కువ రకం మద్యాన్ని కలుపుతారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు మద్యం అమ్మకాలలో ఎలాం టి అవకతవకలను ఉపేక్షించమని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు పేర్కొన్నారు. కావలి ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపామన్నారు. ఇటీవల 59 బెల్టు దుకాణాలపై దాడులు చేశామన్నారు. మద్యం సరఫరా చేసిన మద్యం షాపు యజమానులపైన కేసులు నమోదు చేశామన్నారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం అడ్డదారులు తొక్కితే ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నా, మద్యం కల్తీ జరుగుతున్నా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా, సమయ పాలన పాటించకపోయినా 94409 02264 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
రిజిస్ట్రేషన్ ఒకటి.. బస్సులు రెండు
సామర్లకోట: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఒకే నెంబరుతో రెండు బస్సులు నడుపుతున్న సిరి ట్రావెల్స్‌కు చెందిన ఎఆర్ 01 1166 నెంబరు బస్సును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్ చేశారు. బస్సు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపారు. -
ఆనంద ఆక్వా వద్ద స్వల్ప ఉద్రిక్తత
మొగల్తూరు: మొగల్తూరులోని ఆనంద ఆక్వా పరిశ్రమలో పనులు చేపట్టారంటూ గ్రామస్తులు పరిశ్రమ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ పరిసరాలు శుభ్రం చేయించుకునేందుకు కూలీలను నియమించుకున్నారు. అయితే పరిశ్రమ సూపర్వైజర్లు విధుల్లో చేరారనుకుని సీపీఎం నాయకులు యడ్ల చిట్టిబాబుతో కలిసి కొందరు స్థానికులు ఇక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు రావడంతో వీరిని వారించారు. తాము పరిసరాలను శుభ్రం చేయించుకుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో కంపెనీ వద్ద పరిసరాలు శుభ్రం చేయడానికి వీలులేదని గ్రామస్తులు అనడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పరిశ్రమను సీజ్ చేయడంతో ఎవరికీ లోపలకు వెళ్లే అవకాశం లేదని, దీంతో ఆరుబయట విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పరిసరాలు శుభ్రం చేయించుకుంటున్నట్టు డీఎస్పీ చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
రాపూరు : రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు మండలంలోని కండలేరు పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఆటోల్లో సుమారు 100 బస్తాల బియ్యంను స్వాధీనం చేసుకుని, ఆటో డ్రైవర్లు రమేష్, వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించామని, బియ్యాన్ని వారికి అప్పగిస్తామని తెలిపారు.çç ఈ బియ్యం ఎక్కడి నుంచి, ఎక్కడికి తరలిస్తున్నారో విచారిస్తామన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ తరలింపును అడ్డుకున్న స్థానికులు ఆత్మకూరురూరల్ : పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని గోడౌన్ అధికారులు, డీలర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమంగా తరలిస్తుండగా, స్థానికులు అడ్డుకుని అధికారులకు పట్టించారు. ఈ సంఘటన బుధవారం ఆత్మకూరులో జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీఎం మినీలారీలో 18వ నంబరు రేషన్ దుకాణానికి 105 బస్తాల బియ్యం సరఫరా చేస్తూ రసీదుతో సహా పంపారు. అయితే ఈ వాహనం 18వ నంబరు రేషన్ దుకాణం వరకు వచ్చినా, అక్కడ సరుకు దించకుండా సమీపంలోని రైస్‌మిల్లు వద్దకు వెళ్తుండగా పసిగట్టిన స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో లారీడ్రైవర్ పరారయ్యాడు. స్థానిక ఇన్చార్జి తహసీల్దారు సారంగపాణి, వీఆర్ఓలు కేశవమూర్తి, మురళి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంతో సహా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 5,250 కేజీల బియ్యం (105 బస్తాలు) రేషన్ బియ్యమేనని అధికారులు ధ్రువీకరించారు. అయితే రసీదు మేరకు 18వ నంబరు రేషన్ డీలర్ దుకాణంలో లేరు. విచారించగా ఆయన చెన్నైకు వెళ్లారని అధికారులు తెలుసుకుని ఫోన్లో సంప్రదించారు. తనకు 45 బస్తాల బియ్యం రావాల్సి ఉందని, తాను ఊర్లో లేనందున మరో రోజు పంపాలని కోరినట్లు ఆయన వివరించారు. తహసీల్దారు సిబ్బందితో కలిసి రేషన్ దుకాణంలో స్టాక్‌ను పరిశీలించారు. పట్టుబడిన లారీ, బియ్యం సహా ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. అక్కడ గోదాముల్లో స్టాకును పరిశీలించారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేసినట్లు తహసీల్దారు సారంగపాణి తెలిపారు. -
సిలికా లారీల పట్టివేత
చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక లోడుతో సిలికా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలను చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటికి అపరాధ రుసుము విధించనున్నట్లు అధికారులు తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తడ : తడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని సెల్వకుప్పంలో శనివారం రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఐదు ఇళ్లల్లో అక్రమంగా దాచి ఉంచిన 175 బస్తాల తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా పూడికుప్పం, సెల్వకుప్పం కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుంది. చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలోని ఇళ్లల్లో నిల్వ చేసి రాత్రి సమయాల్లో లారీల్లో తమకు అనుకూలమైన రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల మధ్య వాటాల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తడంతో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల సెల్వకుప్పం నుంచి ఓ లారీలో తమిళ రేషన్‌బియ్యం తీసుకు వెళ్తుండగా ఓ వర్గం అడ్డుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. తడలో తప్పించుకున్న ఆ లారీని సూళ్లూరుపేట ఎస్ఐ గంగాధరం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రామంలో బియ్యం నిల్వ ఉన్నట్టు ప్రత్యర్థి వర్గం స్మగ్లర్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్కే ఇంతియాజ్‌క్ ఫోన్లో సమాచారం అందించారు. ఆయన ఆదేశాలతో తడ తహసీల్దార్ ఏడుకొండలు, సూళ్లూరుపేట సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్‌బాబు సహకారంతో గ్రామంలో తనిఖీలు చేవారు. ఐదు ఇళ్లల్లో దాచి ఉంచిన 175 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కొండూరు వద్ద ఉన్న సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. అయితే బియ్యం ఉన్న ఇళ్లల్లో ఎవరూ కాపురం లేకపోగా, ఆ సరుకు తమదంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని తహసీల్దార్ తెలిపారు. -
21 టన్నుల ఉప్పుడు బియ్యం పట్టివేత
చిల్లకూరు : కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల ఉప్పుడు బియ్యంను విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రమేషయ్య మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా ప్రతి నెల మొదటి వారంలో విజిలెన్స్ అదికారులు ప్రత్యేక దృష్టి సారించగా చౌకదుకాణంలో పేదలకు ఇవ్వాల్సిన బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని పౌర సరఫరా అధికారులకు అప్పగిస్తున్నామన్నారు. ముందుగా అందిన సమాచారంతో తమ సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా 420 బస్తాల బియ్యం తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వీటి విలువ సుమారు రూ.4.50లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, సీఐ శ్రీనివాసారావు, ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, సీఎస్‌డీటీ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
వెంకటాచలం : తమిళనాడు నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. తమిళనాడు నుంచి టీఎన్18ఏబీ 9291 నంబరు లారీలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్ బియ్యంను నెల్లూరుకు రవాణా చేస్తున్నారనే సమాచారం విజిలెన్స్ అధికారులకు మంగళవారం తెల్లవారు జామున సమాచారం అందింది. దీంతో విజిలెన్స్ అధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటల సమయంలో ఏపీ 26 టీఏ7776 నంబరుతో ఉన్న లారీని విజిలñ న్స్ అధికారులు తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీకు నకిలీ నంబర్ స్టిక్కరు అతికించి ఉండటాన్ని గమనించి సిక్కరును తొలగించారు. స్టిక్కరు కింద టీఎన్18ఏబీ 9291 నంబర్ ఉండటంతో సమాచారం వచ్చిన లారీ ఇదేనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి చేరుకుని అక్రమ బియ్యం రవాణా చేస్తున్న లారీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు. ఈ లారీలో 17 టన్నులు రూ.4 లక్షల విలువగలిగిన బియ్యం పట్టుకున్నామన్నారు. లారీ యజమాని దినేష్, దళారి మునుస్వామి, డ్రైవర్ మదన్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ బియ్యం ఎక్కడకు తరలిస్తున్నారో విచారణలో తేలుస్తామన్నారు. ఆయన వెంట విజిలెన్స్ సీఐలు ఉప్పాల సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఏఓ ధనుంజయరెడ్డి, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కార్పొరేషన్ చెత్త వాహనం సీజ్
రూ. 2.58 లక్షల పన్ను వసూళ్లుకు నోటీసులు నెల్లూరు (టౌన్) : ఎలాంటి పన్ను చెల్లించకుండా నగరంలో తిరుగుతున్న కార్పొరేషన్‌కు చెందిన వాహనాన్ని శుక్రవారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. చెత్త తరలించేందుకు నగరంలో తిరుగుతున్న కార్పొరేషన్ వాహనాన్ని ఆపి రవాణాశాఖ ఎంవీఐ బాలమురళీకృష్ణ రికార్డులను తనిఖీ చేశారు. 2010 నుంచి త్రైమాసిక పన్ను చెల్లించకపోవడంతో వాహానాన్ని రవాణా కార్యాలయానికి తరలించారు. వాహనానికి సబంధించిన పన్ను రూ. 86 వేలు, ఫైనాల్టీ రెండు రెట్లు రూ.1.52 లక్షలు కలిపి మొత్తం రూ.2.58 లక్షలు కట్టాలని కార్పొరేషన్ అధికారులుకు నోటీసులు జారీ చేశారు. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వెంకటగిరి : మండలంలోని సీసీ కండ్రిగ దళితవాడ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కారులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కారు సహా రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. వెంకటగిరి సబ్ డీఎఫ్ఓ రవీంద్రారెడ్డి కథనం మేరకు.. సీసీకండ్రిగ సమీపంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందడంతో నిఘా ఉంచామన్నారు. ఆదివారం తెల్లవారు జామున కారు అనుమానాస్పదంగా సీసీకండ్రిగ చెరువు వద్ద నుంచి తెలుగుగంగ కట్ట మీదుగా వస్తుండంతో వెంబడించామని తెలిపారు. దీంతో సీసీకండ్రిగ సమీపంలోని గుండ్ల సముద్రం కాలనీ వద్ద కారును వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. కారు లోపల 12 ఎర్రచందనం దుంగలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ రేంజర్ జి వెంకటేశ్వర్లు, పీఆర్వో వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, డక్కిలి డీఆర్వో డివి రమణయ్య, ఎఫ్బీఓ చంద్రశేఖర్, మస్తాన్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఐదు గ్రావెల్ టిప్పర్ల సీజ్
తడ: రవాణా శాఖ ప్రత్యేక అధికారుల బందం శనివారం రాత్రి తడలో తనిఖీలు నిర్వహించి ఐదు గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో పొరుగు రాష్ట్రానికి వెళుతున్న ఈ టిప్పర్లకు రూ.16 వేలు చొప్పున జరిమానా విధించి తడ పోలీసులకు అప్పగించారు. నిత్యం చిత్లూరు జిల్లా నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు తడ మీదుగా తమిళనాడుకు గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటాయి. తమిళనాడులో గ్రావెల్‌కు డిమాండ్ ఉండటంతో అధికార పార్టీ అండదండలున్న పలువురు యథచ్ఛేగా గ్రావెల్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. చెక్‌పోస్టులో మైనింగ్ శాఖకు సంబంధించి ఒక్కరే విధుల్లో ఉండటం వీరికి వరంగా మారింది. రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో తేలికగా తప్పించుకెళ్లిపోతున్నారు. ప్రత్యేక తనిఖీ బందాలు వచ్చిన సమయంలోనే ఈ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వస్తోంది. -
1.3 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పూణేకిచెందిన ప్రయాణికుల వద్ద 1.3 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది. -
583 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
50 వేల బీటీ పత్తి విత్తనాల బస్తాలు సీజ్
గుంటూరు: గుంటూరులోని కావేరి సీడ్స్ పై విజిలెన్స్ అధికారులు బుధవారం సాయంత్రం దాడి చేసి రూ.5 కోట్ల విలువైన 50వేల బీటీ పత్తి విత్తనాల బస్తాలను సీజ్ చేశారు. గుంటూరులోని కావేరి సీడ్స్ సంస్థ వారు తమ కార్యాలయాన్ని ఇటీవల సిటీ సెంటర్లో ఏర్పాటుచేశారు. అందులో 50వేల బస్తాల బీటీ పత్తి విత్తనాలను నిల్వచేశారు. అయితే కార్యాలయానికి అనుమతి తీసుకోలేదన్న కారణంగా విజిలెన్స్ అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం దాడిచేసి పత్తి విత్తనాల విక్రయాలను నిలిపివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విత్తనాలను నిల్వ ఉంచినందున కేసు నమోదు చేశామని వారు చెప్పారు. -
583 గ్రాముల బంగారం స్వాధీనం
శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
700 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్ లో గురువారం ఉదయం 14 కిలోల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల సందర్భంగా రెండు బ్యాగుల్లో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. బ్యాగులో ప్యాకింగ్ ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్టు విచారణలో తేలింది. అయితే బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలాన్ లో ఉందని, కానీ నిందితుల దగ్గర 14.700 కిలోల మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పట్టబడిన బంగారం, రసీదులలో తేడా ఉండటంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి , బంగారాన్ని సీజ్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
700 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. గురువారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికురాలి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అనంతరం ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు.