బెంగళూరు జ్ఞానభారతి ఆవరణలో పార్క్ చేసిన కొన్ని వాహనాలు
కర్ణాటక, బనశంకరి: లాక్‌డౌన్ అమలైనప్పటి నుంచి పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి అప్పగిస్తామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ తెలిపారు. గురువారం నగరంలో మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ చేసిన బైక్‌లు, కార్లు తదితరాలను లాక్‌డౌన్ ముగిసే వరకు వాహనాలను వెనక్కి ఇచ్చేది లేదని, కోర్టు ద్వారానే విడిపించుకోవాలని గతంలో ప్రకటించడంతో వేలాది మంది వాహనదారుల్లో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ఈ తరుణంలో శుభవార్తను వినిపించారు.
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అనుమతి మేరకు వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నామని, కానీ అంతకు ముందు వాహనాల రికార్డులు పరిశీలించి వెనక్కి ఇస్తామన్నారు. బెంగళూరులో ఇప్పటి వరకు లాక్ డౌన్ నుంచి 47 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.(5,88,989 ఉల్లంఘనలు)
Comments
Please login to add a commentAdd a comment