రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు.
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 600 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నాయి. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు.