21 టన్నుల ఉప్పుడు బియ్యం పట్టివేత
21 టన్నుల ఉప్పుడు బియ్యం పట్టివేత
Published Thu, Sep 15 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
చిల్లకూరు : కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల ఉప్పుడు బియ్యంను విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రమేషయ్య మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా ప్రతి నెల మొదటి వారంలో విజిలెన్స్ అదికారులు ప్రత్యేక దృష్టి సారించగా చౌకదుకాణంలో పేదలకు ఇవ్వాల్సిన బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని పౌర సరఫరా అధికారులకు అప్పగిస్తున్నామన్నారు. ముందుగా అందిన సమాచారంతో తమ సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా 420 బస్తాల బియ్యం తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వీటి విలువ సుమారు రూ.4.50లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, సీఐ శ్రీనివాసారావు, ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, సీఎస్‌డీటీ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement