బ్యాంకులకు శక్తికాంత దాస్ సూచన
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్‌బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment