Reserve Bank Governor
-
యూపీఐ, రూపే ‘విశ్వవ్యాప్త’మే ధ్యేయం
ముంబై: యూపీఐ, రూపేలను ‘‘వాస్తవరీతిన విశ్వ వ్యాపితం’’గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్న కీలక అంశాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో గవర్నర్ మాట్లాడుతూ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పురోగతికి, వినియోగదారుల రక్షణ, సైబర్ భద్రత, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక సేవల ప్రపంచ ఏకీకరణ అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అనేక దేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ వేదికల ఏర్పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ నిమగ్నమై ఉందని అన్నారు. డేటా గోప్యత ఆందోళన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశ్వసనీయ ఏఐ‘ అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, అలాగే ఆర్థిక రంగ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా దాస్ ఉద్ఘాటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... → సరిహద్దు చెల్లింపు వ్యవస్థలతో సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆర్బీఐ కీలక లక్ష్యాలుగా ఉన్నాయి. → భారతదేశానికి సాంకేతిక ప్రతిభ, అభివృద్ధి చెందిన ఆర్థిక ఫిన్‌టెక్ వ్యవస్థల బలం ఉంది. తద్వారా డిజిటల్ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ సహకారానికి నిబద్దతతో పనిచేయడం, ఎక్సలెన్స్ సంస్థలను అభివృద్ధి చేయడం వంటి వాటికి గ్లోబల్ హబ్‌గా ఉండే సామర్థ్యాన్ని దేశం సముపార్జించింది. → భూటాన్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), మారిషస్, నమీబియా, పెరూ, ఫ్రాన్స్‌సహా కొన్ని ఇతర దేశాలతో రుపే కార్డ్‌ల అంగీకారం, యూపీఐ నెట్వర్క్ ద్వారా చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ బోర్డర్ చెల్లింపులతో అక్రమాలకు చెక్ – ఫెడ్ అధికారి క్రిస్టోఫర్ జే వాలర్ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు క్రిస్టోఫర్ జే వాలెర్ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ, డిజిటల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులతో అక్రమ ధనార్జన, టెర్రర్ ఫండింగ్ కట్టడి సాధ్యమవుతాయని అన్నారు. ట్రాన్స్–బోర్డర్ డిజిటల్ లావాదేవీల సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఫెడ్ అధికారి కూడా దీనికి వోటువేయడం గమనార్హం. -
ఎకానమీ పటిష్టతే ఆర్బీఐ లక్ష్యం
బెంగళూరు: దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టంగా, చురుగ్గా, కస్టమర్‌కు స్నేహ పూర్వకమైనదిగా మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిరంతరం పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంతదాస్ సోమవారం స్పష్టం చేశారు. ఇందుకు తగిన విధాన పరమైన చర్యలను తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ఆర్బీఐ @ 90 గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై గవర్నర్ ప్రసంగిస్తూ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ), సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి (సీబీడీసీ) సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలను విస్తృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → క్రాస్–బోర్డర్ రెమిటెన్స్‌లకు (విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడానికి సంబంధించి) ప్రత్యామ్నాయంగా చౌకైన, వేగవంతమైన ఇన్‌స్ట్రుమెంట్‌గా యూపీఐ వ్యవస్థ పురోగమించనుంది. ప్రత్యేకించి తక్కువ విలువ కలిగిన వ్యక్తిగత రెమిటెన్స్‌ల విషయంలో విప్లవాత్మకమైన మార్పులకు యూపీఐ వ్యవస్థ నాందీ పలకనుంది. జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం, సేవా ఎగుమతుల తర్వాత విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో రెమిటెన్సులు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. 2024 క్యాలెండర్ ఇయర్లో ఇవి 3.7 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు, 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. → రిజర్వ్ బ్యాంక్ గణనీయమైన ఆశావాదంతో ఆర్బీఐ ః 100 వైపు ప్రయాణం సాగిస్తోంది. → అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) థీమ్ విషయానికి వస్తే, గత దశాబ్ద కాలంలో సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో అపూర్వమైన సాంకేతిక పరివర్తన చోటుచేసుకుంది. → లావాదేవీల వ్యయాలను తగ్గించడం, ఆర్థిక సదుపాయాల అందుబాటు, ఇంటరాపరబిలిటీ విషయంలో పోటీ, ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడం, అందరికీ ఆర్థిక సేవల వంటి కీలక చర్యలను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా ప్రోత్సహిస్తుంది. -
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
Shaktikanta Das: సంక్షోభాన్ని పసిగట్టి.. పనిపట్టడమే లక్ష్యం
ముంబై: సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానిపై చర్య తీసుకోవడమే రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎటువంటి తనఖా లేకుండా మంజూరుచేసే అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోతే అది ‘‘పెద్ద సమస్యలను’’ సృష్టించవచ్చని పేర్కొన్నారు. రిస్‌్కతో కూడిన అన్సెక్యూర్డ్ రుణ వృద్ధిని అరికట్టడానికి నవంబర్ 2023లో ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ పోర్ట్‌ఫోలియోలో పరుగు మందగించి బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆశించిన ప్రభావాన్ని చూపింది. ఆరి్థక సవాళ్లు, వీటిని ఎదుర్కొనే అంశంపై ఇక్కడ ఆర్బీఐ కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకువచ్చే నాటికి స్థూలంగా చూస్తే... బ్యాంకింగ్‌లో అన్సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి పోర్ట్‌ఫోలియో పరిస్థితులు చూడ్డానికి బాగానే ఉన్నాయి. అయితే అన్సెక్యూర్డ్ రుణాల భారీగా పెరిగితే అది తీవ్ర సమస్యలు సృష్టించవచ్చన్న డానికి తగిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. ఈ కారణంగా మేము ఈ రుణాలను అరికట్టడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. → ఆర్బీఐ చర్యలకు ముందు ఈ పోర్ట్‌ఫోలియోలో 30 శాతం ఉన్న వృద్ధి రేటు అటు తర్వాత 23 శాతానికి తగ్గింది. ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల విషయంలో ఈ రేటు 29 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. → లాభదాయకత, వృద్ధి కోసం కొన్ని వ్యాపార నమూనాలు రూపొందించుకున్నప్పటికీ, అవి కొన్నిసార్లు స్పష్టంగా కనిపించని లోపాలను, లొసుగులను కలిగి ఉంటాయి. వ్యాపార వృద్ధిని సాధించడం ముఖ్యమే. అయితే ఇది ఆమోదయోగ్యం కాని నష్టాలకు దారితీసే పరిస్థితి ఎన్నటికీ ఉత్పన్నం కాకూడదు. → భారత్ దేశీయ ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు మనం కోవిడ్ సంక్షోభ కాలంలోకి ప్రవేశించడానికి ముందు కంటే చాలా బలమైన స్థితిలో ఉంది. భారత ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉంది. బలమైన మూలధన సమృద్ధి, తక్కువ స్థాయి నిరర్థక ఆస్తులు, బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ రుణదాతలు లేదా ఎన్‌బీఎఫ్‌సీల ఆరోగ్యకరమైన లాభదాయకత వంటి ఎన్నో సానుకూల అంశాలు ఇప్పుడు మన ఆరి్థక వ్యవస్థ పటిష్టతలు. → ఆర్బీఐ తన పర్యవేక్షక పనితీరును మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలను చేపట్టింది. ఏదైనా తప్పుగా గుర్తించినట్లయితే దానిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద్వారా బ్యాంక్ బోర్డుకి వివరణాత్మకంగా తెలియజేయడం, అవసరమైతే బ్యాంక్ ఆడిటర్లను కలవడం వంటివి ఇందులో ఉన్నాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల ఆన్సైట్ పర్యవేక్షణ ప్రాధాన్యత కూడా ఇక్కడ చెప్పుకోదగిన కీలకాంశం. తీసుకున్న చర్యలు ఏమిటి.. అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో ఆర్బీఐ గత ఏడాది నవంబర్ 16న రిస్క్ వెయిటేజ్‌ని పెంచింది. అంటే అలా ఇచి్చన రుణాలపై ‘రిస్క్ నిధుల’ అధిక కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనితో బ్యాంకింగ్ ఈ పోర్ట్ఫోలి యో విషయంలో ఆచితూచి స్పందించింది. -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
‘పేటీఎం’ మీద చర్యలపై తగ్గేది లేదు..
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప.. తాము పేటీఎంకి వ్యతిరేకమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ రంగానికి ఆర్బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉందని, పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు.‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీపీబీఎల్‌పై చర్యలు తీసుకున్నాం. కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను జారీ చేస్తాం‘ అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. ఇవి ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితులపై సమీక్ష.. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2024–25 మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెడుతున్న అంశాలను వివరించారు. ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది పేర్కొన్నారు. -
క్రిప్టోలపై మా వైఖరిలో మార్పు లేదు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు. క్రిప్టో మేనియా భరించలేం.. వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం.. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు. ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు. 2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి. -
వృద్ధి బలపడుతుంది...
ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు. 2 శాతం ప్లస్ లేదా మైనస్లతో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం భారత్ దృష్టి సారించడం జరిగిందన్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు. -
బ్యాంకుల్లో గవర్నెన్స్ లోపాలు
ముంబై: కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో వాటి అమలు తీరులో మాత్రం లోపాలు ఉన్నట్లు తేలిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాటిని అధిగమించగలిగామని, లేకపోతే ఎంతో కొంత ఒడిదుడుకులు తలెత్తేవని ఆయన పేర్కొన్నారు. ‘కార్పొరేట్ గవర్నెన్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులకు దారి తీసేలా కొన్ని బ్యాంకుల్లో గవర్నెన్స్‌పరమైన లోపాలు బైటపడటం ఆందోళనకరమైన విషయం‘ అని బ్యాంక్ బోర్డుల డైరెక్టర్లతో సోమవారం జరిగిన సమావేశంలో దాస్ పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, యాజమాన్యాలు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మోసాలు.. మొండిపద్దులపరమైన ఒత్తిళ్లను దాచి పెట్టేందుకు, కృత్రిమంగా ఆర్థిక పనితీరును గొప్పగా చూపించుకునేందుకు బ్యాంకులు ‘స్మార్ట్ అకౌంటింగ్’ విధానాలను ఆశ్రయించడాన్ని దాస్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇందుకోసం బ్యాంకులు పాటిస్తున్న విధానాలను ప్రస్తావించారు. ఖాతాల్లో మొండిబాకీల భారాన్ని తగ్గించుకునేందుకు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు సందర్భాన్ని బట్టి తమ రుణాలను విక్రయించి, తిరిగి బైబ్యాక్ చేయడం .. రుణగ్రహీత చెల్లించాల్సిన రీపేమెంట్లను అంతర్గతంగా ఖాతాల్లో సర్దుబాటు చేయడంలాంటివి వీటిలో ఉన్నట్లు దాస్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ కంప్యూటింగ్ సామర్ధ్యం పెంచుకోవాలి
న్యూఢిల్లీ: కొత్త విభాగాల్లో పరిశోధనలు, సామర్ద్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రస్తుతం తమకున్న కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టపర్చుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక రంగం, ఆర్బీఐ కార్యకలాపాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని దాస్ వివరించారు. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో డేటా సెంటర్, ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్.. సైబర్‌సెక్యూరిటీ శిక్షణా సంస్థకు పునాది వేసిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇది 18.55 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్‌సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్‌లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్‌లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
వృద్ధికి ఒమిక్రాన్ ముప్పు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్ వేరియంట్పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు.. మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. రిటైల్ రుణాల విధానాలపై ఆందోళన.. రిటైల్ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది. ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు.. కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది. మొండిబాకీలు పెరుగుతాయ్.. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
మరిన్ని అస్త్రాలు రెడీ..!
ముంబై: కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితులపై పోరు విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అస్త్రాలు అయిపోలేదని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా తగిన చర్యలన్నింటినీ సకాలంలో తీసుకోడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తగిన సమయంలో చర్యలు తీసుకోడానికి అవసరమైన విధానాలు ఆర్బీఐ దగ్గర ఉన్నాయని సూచించిన ఆయన, అయితే వీటిని వినియోగించడానికి తగిన సమయం కోసం సెంట్రల్ బ్యాంక్ వేచిచూస్తుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ ద్రవ్య, పరపతి విధాన ప్రకటన సందర్భంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరళతర ద్రవ్య, పరపతి విధానానంవైపే ఆర్బీఐ ఇప్పటికీ మొగ్గుచూపుతోందని ప్రకటించిన ఆయన, అవసరమైన సమయంలో ఈ మేరకు రేటు కోత నిర్ణయాలు ఉంటాయని సూచించారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ద్రవ్యోల్బణంపై ఒక అంచనాకు రాలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గడంతోనే దీనిపై ఒక నిర్ణయానికి రాగలమని పేర్కొన్నారు. ఒక ఫైనాన్షియల్ దినపత్రిక నిర్వహించిన వెబినార్‌లో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ఆర్థిక వ్యవస్థపై పనిచేయడం లేదనీ, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని ఈ పరిస్థితి మాంద్యానికి దారితీస్తుందని పేర్కొనడం సరికాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏవీ చోటుచేసుకోకుండా తగిన చర్యలు ఉంటాయి. తగిన సమయంలో రెపోరేటు కోత నిర్ణయం ఉంటుంది. ► వడ్డీరేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడుతుంది. రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ► కోవిడ్–19 సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం చర్యలు పటిష్టంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ పరిశీలనలోకి వచ్చిన అంశాన్నే నేను చెబుతున్నాను. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన వ్యూహం హర్షణీయం. భారీ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న బ్యాంకుల వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్లోబల్ బ్యాంకులకు భారత్ బ్యాంకింగ్ పోటీ ఇవ్వగలుగుతుంది. ► మొండిబకాయిలను దృష్టిలో ఉంచుకుని రుణాల మంజూరు, పంపిణీ విషయంలో బ్యాంకింగ్ మరీ ఆందోళన చెందాల్సిన పనేమీలేదు. అది ‘‘తనంతట తానుగా ఓడిపోవడం లాంటిదే. (రుణ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవడం వల్ల మొండిబకాయిల భయాలతో బ్యాంకులు మరీ భయపడిపోయి, రుణ మంజూరీలకు వెనుకడుగువేస్తున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యం). ఇలాంటి ధోరణి వల్ల బ్యాంకింగ్ తన ఆదాయ వనరులను తానే అడ్డుకున్నట్లు అవుతుంది. దీనితో తన కనీస అవసరాలను సైతం సమీకరించుకోలేకపోతుంది. ఇలాంటి ధోరణి బ్యాంకింగ్‌లో ఎంతమాత్రం మంచిదికాదు. ► రుణాల మంజూరీకి ముందు ఆయా వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను ఒక్కసారి గమనించండి. దీనివల్ల రుణాలు పొందే విషయాల్లో జరిగే మోసాలను ముందు పసిగట్టవచ్చు. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరాయి. ► భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద మూలధన సమస్యలు తలెత్తాయి. ► ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న ‘‘మారటోరియం’’ తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చు. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటిస్తాం. రుణానికి–డిమాండ్‌కు సంబంధం... రుణ వృద్ధికీ, డిమాండ్‌కు సంబంధం ఉంటుంది. గతంలో వలెనే బ్యాంకింగ్ ఇప్పుడూ రుణాలు ఇవ్వడం లేదన్న సాధారణ అభిప్రాయాన్ని గవర్నర్ తెలియజేశారు. అయితే రుణానికి డిమాండ్ తగినంతలేదు. పెట్టుబడులు తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు దీనికి నేపథ్యం. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ డిమాండ్ లేకపోవడమే ఇబ్బంది... రుణాల మంజూరీకి బ్యాం కులు వెనుకంజ వేయడం లేదు. డిమాండ్ లేకపోవడమే అసలు సమస్య. 2016లో మొండిబకాయిలపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తెచ్చిననాటి సమస్య మొదలైంది. దివాలా కోడ్ (ఐబీసీ) పరిస్థితిని ఇంకాస్త దిగజార్చింది. ఇప్పుడు కరోనా మిగిలిన డిమాండ్‌ను చంపేసింది. – ఎస్ మల్లిఖార్జున రావు, పీఎన్బీ సీఈఓ బ్యాంకింగ్‌ను అనడం సరికాదు... రుణాలు ఇవ్వడానికి భయపడిపోవద్దని చెబుతూ, ఈ విషయంలో బ్యాంకింగ్‌పైనే ఎందుకు బాధ్యత పెడుతున్నారో నాకు తెలియడంలేదు. మేము మంచి ప్రాజెక్టులకే రుణాలను ఇస్తున్నాము. ఇక్కడ ఏ బ్యాంకునూ అనడానికి లేదు. రుణాలను తేలిగ్గా మంజూరు చేసే మొత్తం వ్యవస్థే దెబ్బతింది. – రాజ్‌కిరణ్ రాయ్, యూనియన్ బ్యాంక్ సీఈఓ మా బ్యాంక్‌లో 20 శాతం వృద్ధి... జూన్ త్రైమాసికంలో మా బ్యాంక్ కీలక వడ్డీ ఆదాయంలో 20 శాతం వృద్ధిని నమోదుచేసింది. బ్యాంక్ భారీ రుణ వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇక్కడ రుణాల మంజూరీ విషయంలో వెనుకంజవేయడమనే ప్రశ్నేలేదు. బ్యాంకింగ్ పటిష్ట, సమర్థవంతమైన విధానాలను అవలంబించడమే కీలకం. – ఆదిత్య పురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
ఇన్ఫ్రా పెట్టుబడులు జోరందుకోవాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. ‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఆర్బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు. వ్యవ’సాయం’.. ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. వృద్ధి చోదకంగా ఐసీటీ.. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు. మారటోరియం పొడిగించొద్దు: హెచ్డీఎఫ్సీ పరేఖ్ రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు. -
ఊర్జిత్ పటేల్ కెమెరా ముందు కనిపించక్కర్లేదు
రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ కనిపించడం లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీటుగా సమాధానం ఇచ్చారు. కీలకమైన పదవులలో ఉండేవాళ్లు విధానాలను బట్టి పనిచేసుకుంటూ ఉంటారని.. వాళ్లు ఎన్నిసార్లు కెమెరా ముందుకు వచ్చారన్నదాన్ని బట్టి వాళ్ల పనితీరును అంచనా వేయడం సరికాదని ఆయన విలేకరులతో అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ అసలు ఎక్కడా కనిపించడం లేదని, ప్రతిసారీ శక్తికాంత దాస్ మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఊర్జిత్ పటేల్ కెమెరా ముందు కనిపించక్కర్లేదు
-
రాజన్ చివరి సారిగా మెరిపిస్తారా...?
• నేడు ద్రవ్య విధాన పరపతి సమీక్ష • రాజన్‌కు గవర్నర్ హోదాలో ఇదే చివరిది • రేట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనాలు న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ తన చిట్టచివరి ద్రవ్య, విధాన పరపతి సమీక్షా సమావేశంలో మెరుపులు మెరిపిస్తారా...? వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తారా..? చాలామంది ఇలాగే ఆలోచిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ మంగళవారం నాటి పరపతి విధాన సమీక్షపైనే పడ్డాయి. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్‌కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నందున ఆర్బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ, అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నారన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజన్ కీలక రేట్లలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. తదుపరి సమీక్షా సమావేశం అక్టోబర్ 4న జరగనుంది. వడ్డీ రేట్ల నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ పేరుతో కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రేట్ల కోతకు మూడు కారణాలు ఆర్బీఐ 0.25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించడానికి అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా - మెరిల్లించ్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ఇందుకు మూడు కారణాలు పేర్కొంది. ‘1. రాజన్‌కు ఇదే చివరి సమీక్ష. కనుక తన కఠిన విధానాన్ని విడిచిపెట్టవచ్చు. 2. జూన్‌లో 5.7 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం... మంచి వర్షాలు పడితే ఆహార ద్రవ్యోల్బణం తగ్గి ఫలితంగా మార్చి నాటికి 5.1 శాతానికి తగ్గుతుంది. అదే సమయంలో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పెరగొచ్చు. 3. అధిక వడ్డీ రేట్లు రుణాల గిరాకీని తగ్గించడం ద్వారా ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లు కూడా అధికం అవుతాయి. రుణాలకు గిరాకీ పెరిగే సమయంలో రేట్లను తగ్గించడం మంచిది’ అని సంస్థ తన నివేదికలో పేర్కొంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేస్తుందన్న దానికి కారణంగా లోగడ చెప్పారని, ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్ల కోత కూడా వాయిదా పడిన విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ గుర్తు చేసింది. అవకాశం లేదు!! కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చు. ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో 5.7శాతానికి పెరగడంతోపాటు జూలై, ఆగస్టు నెలల్లోనూ అధిక స్థాయిల్లోనే కొనసాగవచ్చు. తదుపరి వడ్డీ రేట్లలో కోత అన్నది ద్రవ్యోల్బణం తీరు, మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటుపైనే ఆధారపడి ఉంది. - డీబీఎస్ 50 పాయింట్ల మేర కోత బ్రిటన్ సహా చాలా దేశాల్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నందున ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లలో కోత విధించవచ్చు. - రాణా కపూర్, ఎండీ, యస్‌బ్యాంక్ రేట్ల కోతకు అవకాశం లేదు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 5.77 శాతానికి చేరింది. 22నెలల్లో ఇంత వేగంగా పెరగడం ఇదే ప్రథమం. జీఎస్టీ అమలుతో ఇది మరింత పెరిగే వకాశం ఉంది. కనుక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు. - అరుంధతీ భట్టాచార్య, చైర్ పర్సన్, ఎస్బీఐ విభేదాలతో మంచే జరుగుతుంది: సుబ్బారావు బెంగళూరు: ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలతో నష్టం లేదని, పైగా విధానాల మెరుగునకు ఉపకరిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ తమ అభిప్రాయాలకు కట్టుబడి ఉండాలి. వారి వైపు నుంచి చూస్తే ఇదేమీ తప్పు కాదు. వాస్తవానికి ప్రజా విధానాల మెరుగునకు ఇవి దోహదం చేస్తాయి’ అని సుబ్బారావు ఒక వార్తా సంస్థతో చెప్పారు. గతంలో గవర్నర్‌గా పనిచేసిన సమయంలో సుబ్బారావుకు, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంతో... ప్రస్తుత గవర్నర్ రాజన్‌కు ఆర్థిక మంత్రి జైట్లీతో ఉన్న విభేదాలపై ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం వచ్చింది. అయితే, ఈ భిన్నాభిప్రాయాలను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు, విధి విధానాలు ఉండాలన్నారు. విభేదాలు నాలుగు గోడలకే పరిమితం కావాలని, ఫైనాన్షియల్ మార్కెట్లను, ఈ రంగ నిపుణులను అయోమయానికి గురి చేయరాదని అభిప్రాయపడ్డారు. -
ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా?
అధిక వడ్డీ రేట్ల విధానంపై విమర్శకులకు రాజన్ సవాల్ పరిస్థితులు మెరుగైతే వృద్ధి అంచనాల్లో మార్పులు ప్రతీ గ్రామానికీ బ్యాంకు సాధ్యం కాదు పోస్ట్ బ్యాంకు, మొబైల్ కంపెనీల రాకతో పరిస్థితులు మారతాయని ఆశాభావం ముంబై: అధిక వడ్డీ రేట్ల విధానంతో వృద్ధికి అడ్డుపడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తిప్పికొట్టారు. తనను విమర్శించే వారు ముందుగా ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉందని చూపించాలంటూ సవాల్ చేశారు. అడ్డంకులున్నా దేశ జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ స్థానంలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నకు పరపతి విధానం (ఆగస్ట్ 9న) వరకు వేచి చూడాలని కోరారు. తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. పలు అంశాలపై రాజన్ మీడియా ప్రతినిధుల ముందు తన అభిప్రాయాలను ఆవిష్కరించారు. విమర్శకులకు సవాల్ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతున్నారని, వృద్ధికి అడ్డు పడుతున్నారన్న విమర్శలపై నేను దృష్టి పెట్టను. వరుసగా నాలుగో నెల జూన్‌లోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగి 5.77 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. మా పాలసీ రేటు 6.5 శాతంగానే ఉంది. ఈ అంశంపై జరిగే చర్చ ఆర్థిక ప్రాతిపదికన కాకుండా ఉండాలి’ అని అన్నారు. తనను విమర్శించే వారు... వడ్డీ రేట్లను తగ్గించేందుకు ద్రవ్యోల్బణం తక్కువగానే ఎలా ఉందో చెప్పాలని సవాల్ చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు ఇటీవలి కాలంలో రాజన్ విధానాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే. వృద్ధి కోణం నుంచి... ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతమున్న సవాళ్లే కొంత కాలం పాటు కొనసాగుతాయి. ఆర్థిక పురోగతి తీరుపై ఎంతో నిరుత్సాహం నెలకొని ఉంది. కానీ, రెండేళ్ల వరుస కరువుతోపాటు అంతర్జాతీయంగా మందగమనం నెలకొని ఉంది. అలాగే, బ్రెగ్జిట్ వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు సైతం ఎదురయ్యాయి. ఈ అడ్డంకులున్నా దేశీయ వృద్ధి మంచిగానే ఉంది. వర్షాలు తగినంత కురిస్తే వ్యవసాయ రంగం మెరుగుపడుతుంది. గ్రామీణ వినియోగం పెరగడం ద్వారా మొత్తం మీద ఆర్థిక రంగం ఊపందుకుంటుంది. కానీ, ఇవి అంచనాలే. వాస్తవంగా ఏం జరుగుతుందో చూడాలి’ అని రాజన్ వివరించారు. మంచి వర్షాలు కురిసి, అంతర్జాతీయ ఆర్థిక రంగం మెరుగుపడితే జీడీపీ 7.6 శాతంగా ఉంటుం దన్న తమ అంచనాల్లో మార్పు ఉంటుందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని చెప్పారు. బ్యాంకు శాఖలపై... అందరికీ ఆర్థిక సేవల అందుబాటు (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) గురించి రాజన్ మాట్లాడుతూ... ‘ప్రతీ గ్రామంలో బ్యాంకు శాఖ ఉండడం అన్నది సాధ్యం అయ్యేది కాదు. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కొన్ని బ్యాంకులు మొబైల్ బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నాయి. వాహన రూపంలో ఉండే ఈ బ్రాంచ్ గ్రామాలలో తిరుగుతూ ప్రతీ గ్రామంలో నిర్ధిష్ట సమయం మేరకు సేవలు అందిస్తుంది. అలాగే, చిన్న, సూక్ష్మ శాఖల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉంది. పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు లెసైన్స్ జారీ చేశాం. మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. ఓ మొబైల్ కంపెనీకి 1.5 లక్షల విక్రయ కేంద్రాలు ఉంటే వాటన్నింటి ద్వారా నగదు జమ, ఉపసంహరణకు అవకాశం ఏర్పడుతుంది. ఇది నిజంగా వ్యవస్థనే మార్చే పరిణామం. ఈ నెల చివరిలోపు రానున్న యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నగదు బదిలీ సులభతరం కానుంది’ అని రాజన్ వివరించారు. అనుభవాలపై పుస్తకం రాయను... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తాజాగా తన అనుభవాలను ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో విలేకరుల ప్రశ్నకు రాజన్ స్పందించారు. గవర్నర్ గిరీ నుంచి తప్పకున్న తర్వాత విద్యా సంబంధింత అంశాలపై మాత్రం పుస్తకాలు రాస్తానని చెప్పారు. బ్యాంకుల ఆందోళనలపై... రుణాల విషయంలో దర్యాప్తు సంస్థల నుంచి తమకు రక్షణ కల్పించాలన్న బ్యాంకర్ల డిమాండ్‌ను రాజన్ సమర్థించలేదు. ఈ విషయంలో నిబంధనల మేరకు నడచుకోవడమే రక్షణాత్మక విధానంగా సూచించారు. ‘రుణాల విషయంలో తాము తీసుకున్న చర్యలకు బాధ్యులను చేయరాదంటూ బ్యాంకర్లు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే, రుణాలు ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు, విధానాల మేరకు నడచుకోవాలి. లేకుంటే ప్రక్షాళన సాధ్యం కాదు. రుణాల జారీలో బాధ్యతాయుతంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటే... చర్యలకు వారు బాధ్యులు కారు. కానీ, ఒక్కోసారి నిర్ణయాల్లో తప్పిదం జరుగుతోంది’ అని రాజన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. -
ఆయనకు ముందే తెలిసిపోయిందా?
తనకు రెండోవిడత రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి దక్కకపోవచ్చని రఘురామ్ రాజన్‌కు ముందే తెలిసిపోయినట్లుంది. తాను మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి, పాఠాలు చెప్పుకొంటానని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా తన పదవీకాలం సెప్టెంబర్ 4వ తేదీతో ముగుస్తుందని, ఆ తర్వాత మళ్లీ పాఠాలు చెప్పుకొంటానని ఆయన తన సహచరుల వద్ద వ్యాఖ్యానించారు. తన తర్వాత ఆ పదవి చేపట్టేవాళ్లు దేశాన్ని మరింత ఎత్తులకు తెస్తాడన్న నమ్మకం తనకుందని, మరో రెండు నెలలు అందరితో పనిచేస్తానని ఆయన అన్నారు. దాంతో అసలు రాజన్‌కే ఆ పదవి రెండోసారి చేపట్టడం ఇష్టం లేదా, లేక మోదీ సర్కారు తనను కొనసాగించడానికి సముఖంగా లేదన్న విషయం ఏమైనా ఆయనకు తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్‌ను గవర్నర్‌గా కొనసాగించకూడదని, ఆయన అచ్చంగా అమెరికా మనిషని, ఆయన ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామి ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం రాజన్‌ను కొనసాగించడానికి మొగ్గు చూపినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. -
నిర్ణయంపై ‘ఏ ప్రభావం’ పడదు: జైట్లీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4 తరువాత రెండవసారీ పొడిగించాలా... వద్దా అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై ‘ఏ అంశం ప్రభావం’ పడబోదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం స్పష్టం చేశారు. తక్షణం రాజన్‌ను తొలగించాలన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ప్రభుత్వం, ఆర్బీఐ బాధ్యతాయుతమైన సంస్థలు. మరే ఇతర అంశం ప్రభావం లేకుండా రెండు సంస్థలూ తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఆయన ఈ ఒక చానల్‌తో వ్యాఖ్యానించారు. స్వామి ఆరోపణలపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు ఆయన మాట్లాడుతూ, ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థికమంత్రిత్వశాఖల మధ్య సంబంధాలు, విధానపరమైన చర్చలు పూర్తి సజావుగా, పరిపక్వ స్థాయిలో ఉన్నాయి. వాటిపై (ప్రతికూల వ్యాఖ్యలు) వ్యాఖ్యానించడం సరికాదు’’ అని మాత్రం అన్నారు. స్వామి అసలు లక్ష ్యం జైట్లీనే: రమేశ్ కాగా సుబ్రమణ్యస్వామి నిజమైన లక్ష్యం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీనే అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ అనలేక... బహిరంగంగా తన అభిప్రాయాలు వెల్లడించని ఆర్బీఐ గవర్నర్‌పై స్వామి ‘డమ్మీ’ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజన్ ఆర్థిక శక్తిసామర్థ్యాలు ప్రపంచం అంతటికీ తెలుసనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆర్బీఐని పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక వ్యవహారాల బీజేపీ ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, సీనియర్ నాయకునిగా స్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని అన్నారు. -
తప్పు చేస్తే ఎంతటివారైనా వదలొద్దు..
♦ ఆర్బీఐ కాగితపు పులి కాదని నిరూపించండి ♦ సహోద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ లేఖ ముంబై: తప్పు చేసిన వారు ఎంతటి సంపన్నులైనా, శక్తిమంతులైనా విడిచిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. శిక్షలు కేవలం సామాన్యులు, బలహీనులకు మాత్రమే పరిమితమన్న అపప్రథను పోగొట్టాలని పేర్కొన్నారు. తద్వారా రిజర్వ్ బ్యాంక్ పేపరు కాగితం కాదని తెలియజెప్పాలని ఆయన సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు 16,800 మంది ఉద్యోగులకు రాసిన 5 పేజీల లేఖలో రాజన్ ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఎవరూ కూడా సంపన్నులు, శక్తిమంతులతో వైరం తెచ్చుకోవడానికి ఇష్టపడరు. దీంతో వారు మరిన్ని తప్పులు చేసి తప్పించుకునే ఆస్కారం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి వల్లే మనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. దేశం నిలకడగా అధిక వృద్ధి సాధించాలంటే ఈ సంస్కృతి మారాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దీన్ని సంపన్నులు, వ్యాపార వర్గాలకు వ్యతిరేక విధానాలుగా భావించరాదని, కేవలం తప్పులను అరికట్టడానికి మాత్రమే ఇవి ఉద్దేశించినవని రాజన్ పేర్కొన్నారు. నేరాలను గుర్తించి, శిక్షలు విధించే లా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై నిరంతరం దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అన్నీ ఉన్నాయ్ .. కానీ.. అత్యంత గౌరవప్రదమైన నియంత్రణ సంస్థగా ఆర్బీఐకి పేరుందని, అత్యంత సమర్ధులైన సిబ్బందీ ఉన్నారని.. కానీ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదన్న భావన కూడా నెలకొందని రాజన్ వ్యాఖ్యానించారు. నియంత్రణ చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆర్బీఐ సిబ్బంది అలసత్వం వహించరాదని, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు. మీడియా కన్నా ముందుండాలి.. ఆర్బీఐపరమైన సమాచార వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా.. ఏవైనా కొత్తవి సాధిం చినా, నిబంధనలు తెచ్చినా గందరగోళానికి తావులేదకుండా అసలైన విషయం సూటిగా అర్థమయ్యేలా ప్రెస్ రిలీజ్ విడుదల చేయాలని ఆయన తమ సిబ్బందికి నిర్ధేశించారవు. -
ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోంది..
చెన్నై : భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. కంపెనీల పెట్టుబడులు కూడా మెరుగుపడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అయితే, పటిష్టమైన వృద్ధిని సాధించాలంటే మరిన్ని సంస్కరణలను అమలు చేయడంతోపాటు నిలిచిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తగిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ ఆర్బీఐ బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజన్ పలు అంశాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతుల మందగమనం కొంత ఆందోళనకరమైన అంశమేనన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రికవరీ బాటలో ఉంది. దీన్ని మరింత జోరందుకునేలా చేయాలంటే.. కొన్ని అడ్డంకులను తొలగించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంస్కరణలను పరుగులు పెట్టించడం, ఆగిపోయిన ప్రాజెక్టులను గాడిలోపెట్టడం వంటివి కీలకం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఆశాజనకంగానే రుతుపవనాలు... రుతుపవన వర్షాలపై ఇప్పటిదాకా ఆశాజనకమైన వార్తలే వస్తున్నాయని.. అయితే, వచ్చే కొద్ది రోజుల్లో వర్షాలు ఎలాఉంటాయనేది నిశితంగా గమనించాల్సి ఉందని రాజన్ పేర్కొన్నారు. ఇక ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడూ ఆందోళనకరమైన విషయమేనని చెప్పారు. గణాంకాల ఆధారంగానే తమ పాలసీ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.01%, టోకు ధర ద్రవ్యోల్బణం మైనస్ 2.36% చొప్పున నమోదైన సంగతి తెలిసిందే. రికవరీబాటలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ... ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉన్నప్పటికీ.. రికవరీ బాటలో కొనసాగుతోంది. అయితే, 1930ల నాటి మహా మాంద్యం తరహా పరిస్థితులేవీ లేవు’ అని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచం మళ్లీ మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతోందంటూ రాజన్ వ్యాఖ్యానించినట్లు(లండన్ బిజినెస్ స్కూల్ ప్రసంగంలో) మీడియాలో వార్తలు రావడం.. ఆయన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదంటూ ఆర్బీఐ వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంపై రాజన్ మాట్లాడుతూ.. అంతర్గతంగా జరిగిన అప్పటి సమావేశంలో తన ప్రసంగాన్ని మీడియా అనవసర ఊహాగానాలతో పెద్ద సంచలనం చేసిందని పేర్కొన్నారు. గ్రీస్ ప్రభావం పరిమితమే... ఐఎంఎఫ్ చెల్లింపుల విషయంలో గ్రీస్ డిఫాల్ట్ కావడం, అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై చాలా పరిమితంగానే ఉండొచ్చని రాజన్ చెప్పారు. గ్రీస్‌తో వాణిజ్యం, ఇతరత్రా ఆర్థికపరమైన కార్యకలాపాలు భారత్‌కు పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని ఆయన వెల్లడించారు. అయితే, యూరో ఒడిదుడుకులు భారత్ కరెన్సీపై కొంతమేరకు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. భారత్ వృద్ధిపథంపై ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణి కొనసాగుతుందని కూడా రాజన్ స్పష్టం చేశారు. అన్ని అకౌంట్లూ ఒకేచోట చూసుకోవచ్చు..! ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే విషయంపై ప్రభుత్వం, ఆర్బీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్స్ మెరుగుపడేందుకు ఈ అదనపు నిధులు దోహదం చేస్తాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని రాజన్ పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం పీఎస్‌యూ బ్యాంకులకు రూ.7,940 కోట్ల మూల ధన నిధులను కేటాయించడం తెలిసిందే. తీవ్ర సమస్యగా మారిన మొండిబకాయిల విషయంలో పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టామని రాజన్ చెప్పారు. ఆర్బీఐ పాలసీకి అనుగుణంగా చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు బాటపట్టాయన్నారు. వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్టుల ఖాతాలకు సంబంధించి ప్రత్యేక మధ్యవర్తిత్వ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ-అకౌంట్ అగ్రిగేటర్)ను ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ అనుమతించనుందని రాజన్ వెల్లడించారు. బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లు ఇతరత్రా ఫైనాన్షియల్ సంస్థలకు చెందిన అకౌంట్లను ప్రజలు ఒకేచోట చూసుకునేందుకు(కామన్ ఫార్మాట్) వీలుకల్పించడమే దీని లక్ష్యమని చెప్పారు. నియంత్రణపరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్బీఐ నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆర్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులతో విడివిడిగా భేటీ అవుతారు. సాయంత్రం మాసాబ్‌ట్యాంకులోని ఐడీఆర్బీటీలో జరిగే బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 16న ఆర్బీఐలో జరిగే సెంట్రల్ బోర్డు మీటింగ్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం పార్క్ హయత్ హోటల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెన్యా గవర్నర్ ప్రొఫెసర్ జుగునా ఎన్ దుంగుతో సమావేశమవుతారు. అనంతరం ముంబై వెళ్తారు. -
ఈసారి రేట్ల కోత ఉండకపోవచ్చు
ద్రవ్యోల్బణం తగ్గుదలపై స్పష్టత వచ్చేదాకా అంతే విశ్లేషకుల అంచనాలు ముంబై: వచ్చే మంగళవారం (ఆగస్టు 5) జరిపే పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్.. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని, తగ్గించకపోవచ్చని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా ఆర్బీఐ రేట్ల తగ్గింపుపై హడావుడిగా నిర్ణయం తీసుకోకపోవచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకరేజి సంస్థ డీబీఎస్ పేర్కొంది. జూన్‌లో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష అనంతరం స్థూల ఆర్థికపరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయని, పారిశ్రామిక వృద్ధిలో కాస్త స్థిరత్వం కనిపిస్తోందని ఒక నివేదికలో తెలిపింది. రాబోయే త్రైమాసికాల్లో పారిశ్రామిక వృద్ధి కన్సాలిడేట్ కాగలదని పేర్కొంది. మరోవైపు, ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గుముఖం పట్టిందని స్పష్టత వచ్చే దాకా ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ ఒక నివేదికలో పేర్కొంది. అప్పటిదాకా ఆర్బీఐ చేపట్టే ద్రవ్య నిర్వహణ చర్యలను నిశితంగా గమనించాల్సి ఉంటుందని వివరించింది. ఏదేమైనా వర్షపాతం మెరుగ్గా ఉండి, ద్రవ్యోల్బణం దిగి వస్తే డిసెంబర్లో ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ధరల పెరుగుదల మరింత కాలం కొనసాగితే రేట్ల కోత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణంపై పోరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇవి కల్పించే ఊరట స్వల్పకాలికమైనదేనని డీబీఎస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండే వర్షపాతం ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవని కూడా వివరించింది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం, పండ్లు.. కూరగాయల రేట్లు ఎగియడం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తగ్గినా.. అది స్థిరంగా కొనసాగేలా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. రేట్లు తగ్గిస్తే కార్పొరేట్లకు కష్టాలు రిజర్వ్ బ్యాంకు గనుక కీలక వడ్డీ రేట్లను ఇప్పుడిప్పుడే తగ్గించిందంటే కార్పొరేట్లపై ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ హెచ్చరించింది. పాలసీ రేట్లను ఏమాత్రం తగ్గించినా రూపాయి పతనానికి దారి తీస్తుందని, ఇది టాప్ 500 కంపెనీల్లో చాలా మటుకు సంస్థల దిగుమతి ప్రణాళికలను దెబ్బతీస్తుందని ఒక నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రూపాయి మారకం విలువ దాదాపు 1.1-5.8 శాతం మేర క్షీణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ దీప్ ఎన్ ముఖర్జీ పేర్కొన్నారు. రూపాయి విలువ 1 శాతం క్షీణించినా కంపెనీల స్థూల లాభాలు 1.3 శాతం తగ్గిన సందర్భాలు ఉన్నాయని ఆయన వివరించారు. బీఎస్ఈ 500లో నికరంగా దిగుమతి ఎక్కువగా ఉండే 53 శాతం సంస్థల గత ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ముఖర్జీ చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు-తొమ్మిది నెలల కాలంలో రేట్ల కోత చేపడితే కంపెనీలకు సమస్యలు తప్పవన్నారు. జైట్లీతో రాజన్ భేటీ న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఆగస్టు 5వ తేదీన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. పలు ఆర్థిక అంశాలపై తాను ఆర్థికమంత్రితో చర్చించినట్లు తెలిపారు. శుక్రవారంనాటి మార్కెట్ భారీ నష్టాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాల నుంచి మనం పక్కకు జరగలేమని అన్నారు. ఆగస్టు 5 పాలసీ సందర్భంగా యథాతథ పరిస్థితిని ఆర్బీఐ కొనసాగించవచ్చన్న ఊహాగానాలే మార్కెట్ నష్టానికి కారణమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.