
న్యూఢిల్లీ: కొత్త విభాగాల్లో పరిశోధనలు, సామర్ద్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రస్తుతం తమకున్న కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టపర్చుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక రంగం, ఆర్‌బీఐ కార్యకలాపాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని దాస్ వివరించారు.
ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో డేటా సెంటర్, ఎంటర్‌ప్రైజ్ కంప్యూటింగ్.. సైబర్‌సెక్యూరిటీ శిక్షణా సంస్థకు పునాది వేసిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇది 18.55 ఎకరాల్లో ఏర్పాటవుతోంది.