ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
అన్‌సెక్యూర్డ్ రుణాలపై చర్యలు తప్పనిసరని ఉద్ఘాటన
లేదంటే... తీవ్ర సమస్యలు నెలకొనేవని హెచ్చరిక
దేశ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టతపై భరోసా
ముంబై: సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానిపై చర్య తీసుకోవడమే రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎటువంటి తనఖా లేకుండా మంజూరుచేసే అన్‌సెక్యూర్డ్ రుణాల విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోతే అది ‘‘పెద్ద సమస్యలను’’ సృష్టించవచ్చని పేర్కొన్నారు. రిస్‌్కతో కూడిన అన్‌సెక్యూర్డ్ రుణ వృద్ధిని అరికట్టడానికి నవంబర్ 2023లో ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీనితో ఈ పోర్ట్‌ఫోలియోలో పరుగు మందగించి బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆశించిన ప్రభావాన్ని చూపింది. ఆరి్థక సవాళ్లు, వీటిని ఎదుర్కొనే అంశంపై ఇక్కడ ఆర్‌బీఐ కాలేజ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
→ ఆర్‌బీఐ మార్గదర్శకాలు తీసుకువచ్చే నాటికి స్థూలంగా చూస్తే... బ్యాంకింగ్‌లో అన్‌సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి పోర్ట్‌ఫోలియో పరిస్థితులు చూడ్డానికి బాగానే ఉన్నాయి. అయితే అన్‌సెక్యూర్డ్ రుణాల భారీగా పెరిగితే అది తీవ్ర సమస్యలు సృష్టించవచ్చన్న డానికి తగిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. ఈ కారణంగా మేము ఈ రుణాలను అరికట్టడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
→ ఆర్‌బీఐ చర్యలకు ముందు ఈ పోర్ట్‌ఫోలియోలో 30 శాతం ఉన్న వృద్ధి రేటు అటు తర్వాత 23 శాతానికి తగ్గింది. ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల విషయంలో ఈ రేటు 29 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.
→ లాభదాయకత, వృద్ధి కోసం కొన్ని వ్యాపార నమూనాలు రూపొందించుకున్నప్పటికీ, అవి కొన్నిసార్లు స్పష్టంగా కనిపించని లోపాలను, లొసుగులను కలిగి ఉంటాయి. వ్యాపార వృద్ధిని సాధించడం ముఖ్యమే. అయితే ఇది ఆమోదయోగ్యం కాని నష్టాలకు దారితీసే పరిస్థితి ఎన్నటికీ ఉత్పన్నం కాకూడదు.
→ భారత్ దేశీయ ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు మనం కోవిడ్ సంక్షోభ కాలంలోకి ప్రవేశించడానికి ముందు కంటే చాలా బలమైన స్థితిలో ఉంది. భారత ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉంది. బలమైన మూలధన సమృద్ధి, తక్కువ స్థాయి నిరర్థక ఆస్తులు, బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ రుణదాతలు లేదా ఎన్‌బీఎఫ్‌సీల ఆరోగ్యకరమైన లాభదాయకత వంటి ఎన్నో సానుకూల అంశాలు ఇప్పుడు మన ఆరి్థక వ్యవస్థ పటిష్టతలు.
→ ఆర్‌బీఐ తన పర్యవేక్షక పనితీరును మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలను చేపట్టింది. ఏదైనా తప్పుగా గుర్తించినట్లయితే దానిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద్వారా బ్యాంక్ బోర్డుకి వివరణాత్మకంగా తెలియజేయడం, అవసరమైతే బ్యాంక్ ఆడిటర్లను కలవడం వంటివి ఇందులో ఉన్నాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల ఆన్‌సైట్ పర్యవేక్షణ ప్రాధాన్యత కూడా ఇక్కడ చెప్పుకోదగిన కీలకాంశం.
తీసుకున్న చర్యలు ఏమిటి..
అన్‌సెక్యూర్డ్ రుణాల విషయంలో ఆర్‌బీఐ గత ఏడాది నవంబర్ 16న రిస్క్ వెయిటేజ్‌ని పెంచింది. అంటే అలా ఇచి్చన రుణాలపై ‘రిస్క్ నిధుల’ అధిక కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనితో బ్యాంకింగ్ ఈ పోర్ట్‌ఫోలి యో విషయంలో ఆచితూచి స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment