Computing
-
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
ఆర్బీఐ కంప్యూటింగ్ సామర్ధ్యం పెంచుకోవాలి
న్యూఢిల్లీ: కొత్త విభాగాల్లో పరిశోధనలు, సామర్ద్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రస్తుతం తమకున్న కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టపర్చుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక రంగం, ఆర్బీఐ కార్యకలాపాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని దాస్ వివరించారు. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో డేటా సెంటర్, ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్.. సైబర్‌సెక్యూరిటీ శిక్షణా సంస్థకు పునాది వేసిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇది 18.55 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. -
నేనే రాజు.. నేనే మంత్రి !
సర్కిల్ పరిధిలోని ఓ గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో చెప్పకుండా ఓ అబ్బాయితో వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు స్టేషన్‌కు వెళ్లి ఆ అధికారి కాళ్లపై పడి కుమార్తెను అప్పగించాలని ప్రాధేయపడ్డారు. ఇక్కడ కూడా తన తీరు మార్చుకోని ఇన్స్పెక్టర్, మీ అమ్మాయిని అప్పగించాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు తమవి, అంత ఇచ్చుకోలేమని బతిమిలాడి రూ.15 వేలు ముట్టచెప్పారు. దీంతో బాలికను వారికి అప్పగించిన ఇన్స్పెక్టర్, అబ్బాయి వారి నుంచి రూ.50 వేలు తీసుకుని ఎలాంటి కేసు లేకుండా చేశాడు. సాక్షి, వరంగల్ / వరంగల్ క్రైం : ఆ పోలీస్‌స్టేషన్‌లో ఆయన చెప్పిందే వేదం. అక్కడకు వచ్చే బాధితులు సుంకం కట్టకుండా బయటకు వెళ్లడం సాధ్యం కాదు. కేసు ఏదైనా సరే సుంకం కట్టాల్సిందే. కొత్త నిబంధనలు, ప్రతీ కేసుకో లెక్క, ఆ లెక్కకో రేటు కట్టి మరీ వసూలు చేయడం ఆయన నైజం! ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘గబ్బర్ సింగ్’లా పోలీస్ స్టేషన్లో పద్ధతులు మార్చేశాడు. సదరు అధికారి విధులు నిర్వర్తించే కాజీపేట సబ్ డివిజన్లోని ఓ పోలీసుస్టేషన్‌కు బాధితులు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే జంకుతున్నారు. ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్లో బాధ్యతలు తీసుకుని సుమారు 10 నెలలు గడిచింది. అప్పటి నుంచి ఒక్కో పనికి ఒక్కో రేట్ చొప్పున ఫిక్స్ చేసి నెలనెలా రూ.లక్షలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పంట కోత సీజన్లో హార్వెస్టర్ల యాజమానుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసిన ఆ ఇన్స్పెక్టర్ తనకు తానే సాటి అని నిరూపించుకున్నట్లు సొంత శాఖలోనే చర్చ సాగుతోంది. పోస్టింగ్‌కు ఖర్చు చేశాం కదా! మామూళ్లకు తెగబడిన ఆ ఇన్స్పెక్టర్ను ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ‘రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నాం... ఆ పెట్టుబడి కూడా రాబట్టుకోలేకపోతే ఉద్యోగం ఎందుకు’ అంటూ చెబుతుండడం గమనార్హం. ఆ ఇన్స్పెక్టర్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని డబ్బు రూపంలో మార్చుకోవడం సిద్దహస్తుడిగా చెబుతారు. అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన ఆయన వైఖరిపై వరుస ఫిర్యాదులు అందడంతో ఇంటలెజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అండ ఉంది.. లాక్డౌన్ సమయంలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్న సదరు ఇన్స్పెక్టర్ డబ్బు తీసుకుని తక్కువ మొత్తంలో స్టాక్‌ను చూపెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో అప్పటి ఉన్నతాధికారుల నుంచి మందలింపునకు గురైనా ఆయన తీరులో మార్పు రాలేదు. రాష్ట్ర స్థాయిలో పేరు ఉన్న ఓ కీలక ప్రజాప్రతినిధి, మంత్రి పేరు చెప్పుకుంటూ వారి అండదండలు తనకు ఉన్నాయని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఆ కీలక ప్రజాప్రతినిధి అన్న అండదండలు తనకు ఉన్నాయని, తన పోస్టింగ్‌కు ఎలాంటి ఢోకా లేదని ధీమాతో ఉన్న సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఎన్నెన్నో లీలలు ఓ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదని, తల్లీకుమార్తెలు కలిసి హత్య చేశారని గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతో కనీసం ఆత్మహత్య కేసు కూడా నమోదు చేయకుండా దహన సంస్కరాలు చేయించేశారు. ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించారని సమాచారం. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఏం ఏం జరిగిందో తెలియదు కానీ కేసు నమోదు కాలేదు. యువకుడి అంత్యక్రియలు సాధారణంగా జరిగిపోయాయి. ఊరూరా తిరిగి జాతకాలు చెప్పుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైఢర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాక బండి అప్పగించటానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే కేసు నమోదు చేస్తేనే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది కాబట్టి, రూ.10వేలు ఇవ్వాల్సిందేనని ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పాడు. సర్కిల్ పరిధిలో ఓ వ్యక్తి కారుతో మరో వ్యక్తిని ఢీకొట్టడంతో పెద్ద మనుషుల సమక్షంలో చర్చించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పరిహారంగా రూ. 65 వేలు ఇప్పించగా వివాదం సమసిపోయింది. కానీ విషయం ఇన్స్పెక్టర్కు తెలియగానే ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కారును తీసుకువచ్చి, రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేం రూ.70 వేలు సమర్పించుకుని కారు విడిపించుకున్నారు. భార్యాభర్తల మధ్య వివాదం పంచాయితీగా మారింది. విడిపోవటానికి భర్త నుంచి భార్యకు నష్టపరిహారంగా రూ. 8.75 లక్షలు చెల్లించాలని కుల పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత భర్త ఇన్స్పెక్టర్ను ఆశ్రయించడంతో రూ.50 వేలు తీసుకుని భార్య తరపు వారిని బెదిరించి రూ.3 లక్షలకు పరిహారాన్ని తగ్గించారనే ఆరోపణలు వచ్చాయి. వివాదంలో ఉన్న స్థలం వెంచర్‌గా మారింది. దీనికి గాను స్థలం అమ్ముకున్న వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కొనుక్కున్న వ్యక్తి నుంచి రూ.2 లక్షలు బహుమతి రూపంలో ఇన్స్పెక్టర్ తీసుకున్నట్లు సర్కిల్ పరిధిలో చర్చ జరిగింది. గుట్కాల వ్యాపారాన్ని చూసీచూడనట్లు ఉండటానికి వ్యాపారులు నెలనెలా రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొచ్చే గుట్కాలు ఇక్కడి నుంచే జిల్లా కేంద్రానికి సరఫరా అవుతుండడం గమనార్హం. మండలం, సర్కిల్ పరిధిలో ఉన్న రెండు, మూడు వాగుల నుంచి నిత్యం సుమారు 70 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ.10 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పంచాయతీ కార్యదర్శి రూ.కోటి స్వాహా
సాక్షి, రాజానగరం: ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏకంగా కోటి రూపాయలకు పైగా ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో తాజాగా బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అవినీతికి అలవాటు పడిన కొంతమంది కార్యదర్శులు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను ఆయా పంచాయతీలకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకుని బొక్కేశారు. ఈ తరహాలోనే జిల్లాలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు గుట్టుగా చేసిన అక్రమం తాజాగా బయటపడింది. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు. ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్‌ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 2014–15 నుంచి మొత్తం రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ రాజానగరం ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కోరుకొండ, కాతేరు పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా నియమించారు. వారు చేసిన పరిశీలనలో రూ.84,12,916 ఖర్చులకు ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో ఆ మేరకు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వరరావుకు సమాధానం చెప్పుకునేందుకు (సరి చేసుకునేందుకు) అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562లకు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 57,27,354 నికరంగా దుర్వినియోగమైందని విచారణ బృందం ఆగస్టు 20న రిపోర్టును తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసింది. ఇక్కడే ఇంత... మరి అక్కడో... నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్‌చెరువు పంచాయతీకి కూడా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్‌చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అతను లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం, గాడాల, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా అతనిపై పలు అరోపణలున్నాయి. దీంతో ఈయనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా శిక్షార్హులే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని, అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు కూడా అందజేశామని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ తెలిపారు. అతను స్వాహా చేసిన ప్రజల సొమ్ములను రికవరీ చేయడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు. అంతేకాక అతను ఇన్చార్జిగా పనిచేసిన దివాన్‌చెరువు పంచాయతీలో కూడా విచారణ జరిపేందుకు రెండు మూడు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపిస్తామన్నారు. -
వివాదంలో ఎస్సీ సంక్షేమ శాఖ!
సాక్షి, నిజామాబాద్: కక్ష సాధింపులు.. వేధింపులు.. వసూళ్లు.. ఈ మూడు అంశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను కుదిపేస్తున్నాయి. ఆయా శాఖలను వివాదాల్లోకి లాగుతున్నాయి. తరచూ అధికారులకు, హాస్టల్ వార్డెన్ల నడుమ ఏర్పడుతున్న గొడవలు రచ్చకెక్కుతున్నాయి. సంక్షేమ శాఖల పాలనను పక్కన పెట్టి పోటాపోటీగా కలెక్టర్‌కు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇంతటితో పోకుండా నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యక్ష పంచాయితీలకూ కాలు దువ్వుతున్నారు. అయితే ప్రతీ చిన్న విషయానికి యూనియన్ నేతలను కలుపుకొని వివాదాలను రచ్చకెక్కిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటు ఉన్నతాధికారులకు సైతం ఈ సంక్షేమ శాఖల గొడవలు విసుగు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పాలన గాడి తప్పి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఐదారు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖలో ఓ అధికారికి, హాస్టల్ వార్డెన్ల నడుమ చాలా సినిమానే నడిచింది. సదరు అధికారి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని వార్డెన్లు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు సదరు అధికారి కూడా వార్డెన్లపై పలు ఆరోపణలు చేశారు. అయితే, సదరు అధికారి ఉంటే తాము పని చేయలేమని, సెలవుల్లో వెళ్తామని వార్డెన్లు ముక్త కంఠంతో చెప్పాగా, ఓ ఉన్నతాధికారి ఎదుట విచారణ కూడా జరిగింది. కానీ చివరికి యూనియన్ నేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కొన్ని వాస్తవాలున్నప్పటికీ ఎవరిపై ఎలాంటి చర్యలు లేకుండానే చివరికి కథ ముగిసింది. ట్రైబల్ వెల్ఫేర్‌లో.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇటీవల ఓ ద్వితీయ శ్రేణి అధికారి తీరుతో వేగలేక పోయిన హాస్టల్ వార్డెన్లు, ఆ శాఖ ఉద్యోగులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని వార్డెన్లు, శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు మచ్చ తెస్తున్న సదరు ద్వితీయ శ్రేణి అధికారిని పిలిపించి ఓ ఉన్నతాధికారి మందలించారు. కానీ ప్రస్తుతం కూడా సదరు అధికారి తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అధికారులకు, వార్డెన్ల మధ్య వివాదాలను మరిచిపోక ముందే జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఓ అధికారి తమను వేధిస్తున్నారంటూ కొంత మంది వార్డెన్లు యూనియన్ నాయకులతో కలిసి ఆ శాఖ అధికారితో పాటు కలెక్టర్‌కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ అధికారితో కలిసి మెలిసి పని చేసిన వారే వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కావాలనే టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూడా రచ్చకెక్కింది. వారిదే పెత్తనం.. మూడు సంక్షేమ శాఖలకు కలిపి నాయకులుగా పిలవబడే కొంత మంది తీరుతోనే ఆయా శాఖల పరువు బజారున పడుతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ అధికారైనా సరే తాము చెప్పినట్లు నడుచుకోవాలని, చెప్పిన పని చేయాలని ఆర్డర్లు వేసి మరీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒక వేళ అడ్డు చెబితే ఇక సదరు అధికారి పని అంతేనని, కక్ష సాధింపులకు దిగుతారని, అవసరమైతే సరెండర్ చేయిస్తారనే పేరుంది. కాగా తమ వర్గానికి చెందిన, మచ్చిక చేసుకున్న అధికారులుంటే వారిపై ఎన్ని అవినీతి, ఆరోపణలున్నా సరే వారిని రక్షించడానికి ఎలాంటి పనికైనా సిద్ధపడుతారనే మాట ప్రచారంలో ఉంది. ఫిర్యాదు అందింది.. ఎస్సీ సంక్షేమ శాఖలోని ఓ అధికారిపై వార్డెన్ల సంఘ నాయకులు చేసిన ఫిర్యాదు నాకు అందింది. అయితే, ఈ వివాదం ఇరువురి మధ్య నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది వాస్తవమో విచారణ జరిపి తేలుస్తాం. – రాములు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి -
క్లౌడ్ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించే వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో మంజ్రా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ద్వారా జరుగుతున్నాయని, వాటిలో భారత దేశం 30 శాతంతో ముందుకు వెళ్తోందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీకృత విధానంతో మొబైల్ అప్లికేషన్లు, హెల్త్‌కేర్ అప్లికేషన్లు, రోబోటిక్ సర్వీస్‌లు వంటి వాటిలో వినూత్న ఆవిష్కరణలు జరిపి సున్నిత సమస్యలకు సాంకేతికతను జోడించి పరిష్కరించాలన్నారు. అనంతరం రాజ్‌కుమార్ భయ్యాను వర్సిటీ అధ్యాపకులు సత్కరించారు. మొబైల్ అండ్ క్లౌడ్ ల్యాబ్ హెడ్ సతీ‹ష్నారాయణ్ శ్రీరామ్, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కృష్ణమోహన్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎంహెచ్ కృష్ణప్రసాద్, కరుణ తదితరులు పాల్గొన్నారు.