నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ | RBI Governor Raghuram Rajan to visit Hyderabad on Oct 14 | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్

Published Tue, Oct 14 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్

నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్

సాక్షి, హైదరాబాద్: రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్బీఐ నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆర్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులతో విడివిడిగా భేటీ అవుతారు.

సాయంత్రం మాసాబ్‌ట్యాంకులోని ఐడీఆర్‌బీటీలో జరిగే బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 16న ఆర్బీఐలో జరిగే సెంట్రల్ బోర్డు మీటింగ్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం పార్క్ హయత్ హోటల్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెన్యా గవర్నర్ ప్రొఫెసర్ జుగునా ఎన్ దుంగుతో సమావేశమవుతారు. అనంతరం ముంబై వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement