ఊర్జిత్ పటేల్ కెమెరా ముందు కనిపించక్కర్లేదు
ఊర్జిత్ పటేల్ కెమెరా ముందు కనిపించక్కర్లేదు
Published Thu, Nov 24 2016 3:10 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ కనిపించడం లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీటుగా సమాధానం ఇచ్చారు. కీలకమైన పదవులలో ఉండేవాళ్లు విధానాలను బట్టి పనిచేసుకుంటూ ఉంటారని.. వాళ్లు ఎన్నిసార్లు కెమెరా ముందుకు వచ్చారన్నదాన్ని బట్టి వాళ్ల పనితీరును అంచనా వేయడం సరికాదని ఆయన విలేకరులతో అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ అసలు ఎక్కడా కనిపించడం లేదని, ప్రతిసారీ శక్తికాంత దాస్ మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement