రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందని, దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటిపై నియంత్రణలు ఎత్తివేయాలని ఒత్తిడితెస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నెలారంభంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయటం తెలిసిందే. కొత్త గవర్నర్‌గా శక్తికాంతదాస్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జైట్లీ తాజా సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment