కార్పొరేషన్ చెత్త వాహనం సీజ్
-
రూ. 2.58 లక్షల పన్ను వసూళ్లుకు నోటీసులు
నెల్లూరు (టౌన్) : ఎలాంటి పన్ను చెల్లించకుండా నగరంలో తిరుగుతున్న కార్పొరేషన్‌కు చెందిన వాహనాన్ని శుక్రవారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. చెత్త తరలించేందుకు నగరంలో తిరుగుతున్న కార్పొరేషన్ వాహనాన్ని ఆపి రవాణాశాఖ ఎంవీఐ బాలమురళీకృష్ణ రికార్డులను తనిఖీ చేశారు. 2010 నుంచి త్రైమాసిక పన్ను చెల్లించకపోవడంతో వాహానాన్ని రవాణా కార్యాలయానికి తరలించారు. వాహనానికి సబంధించిన పన్ను రూ. 86 వేలు, ఫైనాల్టీ రెండు రెట్లు రూ.1.52 లక్షలు కలిపి మొత్తం రూ.2.58 లక్షలు కట్టాలని కార్పొరేషన్ అధికారులుకు నోటీసులు జారీ చేశారు.