
సాక్షి,విజయవాడ: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టును కార్పొరేషన్ అధికారులు శనివారం రట్టు చేశారు. విజయవాడకు అక్రమంగా తరలించిన పోటెళ్ళ తలలు ,కాళ్ళును స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్ప్రెస్ రైల్లో వచ్చిన పదహారు బాక్సులను పట్టుకున్నారు. సీజ్ చేసిన పదహారు బాక్సులను వీఎంసీ సిబ్బంది నిర్జన ప్రదేశంలో పూడ్చేశారు. వీటిని యూపీ నుంచి ఢిల్లీకి, అక్కడినుంచి విజయవాడ కు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసం అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ మాఫియా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కబేళాలోని మాంసం మాత్రమే కొనుగోలు చేయాలని వీఎంసీ అధికారులు సూచించారు.
చదవండి: అద్దె మాఫీ.. వారికి ఉపశమనం..