బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Published Sat, Aug 20 2016 12:47 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
చిల్లకూరు : మండలంలోని వల్లిపేడులో శుక్రవారం బ్యాల వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. వల్లిపేడుకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడికి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్లతో బాలికతో ఈ నెల 25న వివాహం జరిపించేందుకు వారి తల్లిదండ్రులు నిశ్చియించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీతాలక్ష్మి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూపర్‌వైజర్ సీతాలక్ష్మి, వీఆర్వో సుబ్బయ్య, కానిస్టేబుళ్లు సాయినాథ్, కిషోర్ గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రలతో మాట్లాడారు. యువకుడి తల్లిదండ్రలకు అవగాహన కల్పించి ఇద్దరికి వివాహం జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి మరో రెండేళ్ల పాటు వివాహం చేయమని వారి వద్ద లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు తీసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు వాణి, పరమేశ్వరి పాల్గొన్నారు.
Advertisement