సంచిలో నాటు బాంబులు చూసి ఉలిక్కిడ్డ పోలీసులు | Police Arrested A Man Who carrying Country Bombs | Sakshi
Sakshi News home page

కలకలం: పట్టపగలు.. చేతిసంచిలో 20 నాటు బాంబులు

Published Sun, Jul 25 2021 4:39 AM | Last Updated on Sun, Jul 25 2021 1:38 PM

Police Arrested A Man Who carrying Country Bombs - Sakshi

పోలీసుల అదుపులో అనుమానితుడు (ఎర్ర చొక్కా వ్యక్తి). చిత్రంలో నాటు బాంబులు ఉన్న చేతిసంచి

వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): పట్టపగలే ఓ వ్యక్తి చేతిసంచిలో నాటుబాంబులు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపింది. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి (37) తీసుకెళ్తున్న ఓ చేతిసంచిని అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు.

ఆ సంచిలో ఉన్న నాటు బాంబులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి.. దొరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబులు ఎందుకోసం తీసుకొస్తున్నారు? ఎక్కడ నుంచి తెస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చేతిసంచిలో సుమారు 20 నాటు బాంబులు ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్‌ఐ గోపి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement