![Bank Employees Missing In Chittoor District - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/11/2/01_0.jpg.webp?itok=knX9Ascm)
సాక్షి, చిత్తూరు: జిల్లాలో బ్యాంక్ ఉద్యోగుల అదృశ్యం కలకలం రేపింది.. ఆదివారం 10 మంది బ్యాంక్ ఉద్యోగుల బృందం సదాశివకోనకు వెళ్లారు. అప్పటి నుంచి ఉద్యోగుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల కోసం అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం వారి ఆచూకీ కనుగొన్నారు.ఉద్యోగుల ఫోన్లలో సిగ్నల్ లేకపోవడం వల్లే ఎవ్వరికీ అందుబాటులోకి రాలేక పోయినట్లు పోలీసులు తెలిపారు. కాసేపటి క్రితమే వారిని వడమాలపేట పీఎస్‌కు తీసుకొచ్చారు. కాగా.. బ్యాంకు ఉద్యోగులంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment