హర్షిణి(ఫైల్)
సాక్షి, చిత్తూరు అర్బన్: యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేటకు చెందిన హర్షిణి(19) బంగారుపాళ్యం వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చిత్తూరు గాంధీరోడ్డులోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. అయితే బుధవారం ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుబుంబసభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ తెలిస్తే డయల్ –100, 9491074517 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment